Movie: ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఇషా సందడి.. రూ. 17 కోట్ల బ్యాగ్..నెటిజన్ల మైండ్ బ్లాక్ బ్యాగ్ స్పెషాలిటీ ఏంటంటే?:
ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఇషా అంబానీ తన అద్భుతమైన ఫ్యాషన్ స్టైల్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె ప్రఖ్యాత డిజైనర్ రాహుల్ మిశ్రా రూపొందించిన ప్రత్యేకమైన దుస్తులు మరియు ప్రముఖ బ్రాండ్ స్కియాపారెల్లి క్రియేషన్స్‌ను ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు.

భారతీయ బిలియనీర్ ముఖేష్ అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ అంతర్జాతీయ వేదికలపై తన ఫ్యాషన్ సెన్స్‌తో ఎప్పుడూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. తాజాగా ప్యారిస్ హాట్ కోచర్ వీక్‌లో ఆమె సరికొత్త లుక్‌తో మెరిసిపోయింది. ప్రముఖ ఇండియన్ డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన అల్ట్రా మోడ్రన్ డ్రెస్ వేసుకుని ఫ్యాషన్ ప్రియుల గుండెలు పిండేసింది. అయితే, అందరి దృష్టి ఆమె వేసుకున్న డ్రెస్ కంటే, ఆమె చేతిలో ఉన్న రూ.17 కోట్ల విలువైన డైమండ్ బ్యాగ్‌పైనే పడింది.
ప్యారిస్ హాట్ కోచర్ వీక్ జూలై 6న ఎంతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. రాహుల్ మిశ్రా తన ‘దేవి’ కలెక్షన్‌ను ఈ స్టేజి పైన ప్రదర్శించారు. ఇక ఈ ప్రతిష్టాత్మక షోను చూడటానికి ఈషా అంబానీ ఫ్రంట్ రోలో కూర్చుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హాలీవుడ్ పాప్ సింగర్ కార్డీ బి కూడా ఆమె పక్కనే కూర్చుని సందడి చేసింది.
సెలబ్రిటీ స్టైలిస్ట్ ఆండ్రూ ముకమల్ ఆధ్వర్యంలో ఇషా అంబానీ లుక్ వైరల్ అయింది. రాహుల్ మిశ్రా కస్టమ్ మేడ్‌గా తయారు చేసిన సిల్వర్-గ్రే కలర్ స్ట్రాప్‌లెస్ గౌనులో ఈషా మెరిసిపోయింది. ఈ డ్రెస్ టాప్ పార్ట్‌ను క్రిస్టల్స్, సీక్విన్స్, మరియు త్రీడీ బీడ్వర్క్తో ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారు. ఇక ఇది చూడటానికి మన సాంప్రదాయ గుడి నగల డిజైన్లా అనిపించింది. దీనికి తోడు స్టైలిష్ బ్రెయిడెడ్ జడ, సన్‌గ్లాసెస్‌తో ఆమె లుక్ అదిరిపోయింది.
ఈషా అంబానీ ఫ్యాషన్ లుక్ ఒకెత్తయితే, ఆమె పట్టుకున్న హ్యాండ్‌బ్యాగ్ మరొకెత్తు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన ‘హెర్మేస్ సాక్ బిజౌ బిర్కిన్’ బ్యాగ్‌తో ఆమె కనిపించింది. ఇక దీని ధర అక్షరాలా రూ.17 కోట్లు అని తెలియడంతో నెటిజన్ల మైండ్ బ్లాక్ అయిపోయింది.
ఈ బ్యాగ్ అంత రేట్ ఉండటానికి కారణం లేకపోలేదు. ఇందులో ఏకంగా 111 క్యారెట్ల బరువున్న 3,000 వజ్రాలను పొదిగారు. అలాగే 18 క్యారెట్ల వైట్ గోల్డ్, మొసలి చర్మంతో ఈ బ్యాగ్‌ను ఎంతో ఖరీదైనదిగా తయారు చేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి బ్యాగులు కేవలం మూడు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి అంబానీ ఫ్యామిలీ దగ్గర ఉంది. నిజానికి ఇది నీతా అంబానీ పర్సనల్ కలెక్షన్లోనిది కావడం విశేషం. గ్లోబల్ స్టేజ్‌పై భారతీయ ఫ్యాషన్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడంలో ఇషా అంబానీ ఎప్పుడూ ముందే ఉంటుంది. ప్యారిస్ వేదికగా లగ్జరీకి, హై ఫ్యాషన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ ఆమె చేసిన ఈ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇక అంబానీ రేంజ్ ఏంటో ఈ వైరల్ ఫోటోలు మరోసారి నిరూపించాయి.