Gold and Silver Prices : బంగారం ధరలు దిగి వచ్చాయిగా ?


Hyderabad :

కుప్పకూలుతున్న బంగారం ధరలు

బంగారం ధరలు పతనమవుతున్నాయి. మరోసారి పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అలుముకోవడంతో బంగారం ధరలు మరింత తగ్గుతాయని అంచనాలు వినపడుతున్నాయి. అమెరికా ఇరాన్ పై వైమానిక దాడులు జరపడంతో కాల్పుల విరమణ ఒప్పందం ఇక ముగిసినట్లేనని, మళ్లీ యుద్ధం ప్రారంభమయిన నేపథ్యంలో బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. పూర్తి స్థాయిలో ధరలు తగ్గలేదు కానీ, ఇంకా ధరలు తగ్గితే కొనుగోలు చేయడానికి మాత్రం అనేక మంది వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

యుద్ధం మళ్లీ…

అమెరికా – ఇరాన్ ల మధ్య యుద్ధం ప్రారంభమయిన నాటి నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో పెరిగిన ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. హార్మోజ్ జలసంధి లో ఆంక్షలు కొనసాగుతుండటం, క్రూడాయిల్ ధరలు పెరగడంతో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, యుద్ధాలు, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ధరలు ఇంకా తగ్గే అవకాశముందన్న అంచనాలు వినపడుతున్న నేపథ్యంలో కొనుగోళ్లు కూడా పెద్దగా జరగడం లేదు.

ధరలపై అనిశ్చితి…

మరొకవైపు బంగారం, వెండి ధరలు అనిశ్శితి కొనసాగుతుండటంతో మదుపు దారులు కూడా పెట్టుబడి పెట్టేందుకు వెనుకంజ వేస్తున్నారు. పెట్టుబడి పెట్టినప్పటికీ లాభాలు వస్తాయని గ్యారంటీ లేదు. ప్రస్తుతం బంగారం, వెండి పై పెట్టుబడి సురక్షితం కాదని భావిస్తున్నారు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,31,190 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,43,120 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,44,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *