Movie : రేర్‌ రికార్డ్‌ బ్రేక్‌ చేస్తున్న సమంత..? మా ఇంటి బంగారంతో సాధ్యమేనా!

సౌత్ లో టాప్-2లో నిలిచి మరో అరుదైన ఘనతను సాధిస్తున్న సమంత.. అది సాధిస్తుందా అంటున్న ఆడియన్స్‌

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడం చాలా రేర్. అలాంటి సమయంలో రీసెంట్ గా ఓ స్టార్ హీరోయిన్ లీడ్ రోల్ లో తెరకెక్కింది ఓ సినిమా. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద వరుస రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. టాలీవుడ్‌ లో లేడీ లీడ్ సినిమాలకు కొత్త బెంచ్‌ మార్క్ సెట్ చేసిన ఆ మూవీ.. ఇప్పుడు సౌత్ లో టాప్-2లో నిలిచి మరో అరుదైన ఘనతను అందుకోవడం విశేషం. అలా ఏ స్టార్‌ హీరోయిన్‌ మూవీ వచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఈ స్టోరీలో తెలుసుకుందాం.

టాలీవుడ్‌ నుంచి జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది మా ఇంటి బంగారం. స్టార్‌ హీరోయిన్‌ సమంత చాలా రోజుల తర్వాత తెలుగులో చేసిన సినిమా. తొలి రోజు నుంచే మంచి ఓపెనింగ్స్ సాధించింది మా ఇంటి బంగారం చిత్రం. ఆ తర్వాత విడుదలైన సినిమాల పోటీ ఉన్నప్పటికీ కలెక్షన్లలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సాలిడ్ గా వసూళ్లు రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 93 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఆ చిత్రం త్వరలోనే 100 కోట్ల క్లబ్‌ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఆ విజయంతో టాలీవుడ్‌ లో అత్యధిక వసూళ్లు సాధించిన హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంగా మా ఇంటి బంగారం మూవీ రికార్డు సృష్టించింది. మహానటి, అరుంధతి సినిమాల బాక్సాఫీస్ లైఫ్‌ టైమ్ వసూళ్లను డామినేట్ చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. అంతేకాదు.. సమంత కెరీర్‌ లో అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా కూడా మా ఇంటి బంగారం నిలిచింది.

ఇక సౌత్ ఇండియన్ ఫీమేల్ లీడ్ చిత్రాల జాబితాలో మాత్రం మా ఇంటి బంగారం రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఆ లిస్ట్ ను పరిశిలిస్తే మలయాళం నుంచి వచ్చిన లోక 300 కోట్ల వసూళ్లు సాధించింది. ఇక మా ఇంటి బంగారం ఇప్పటికే 93 కోట్లు రాబట్టి ఇంకా థియేటర్స్‌లో రన్‌ అవుతోంది. ఇక అలాగే మహానటి84 కోట్లు.. రుద్రమదేవి- 81 కోట్లు అరుంధతి- 70 కోట్లు భాగమతి- 63 కోట్లు సూక్ష్మదర్శిని 54 కోట్లు వసూళ్లు చేశాయిన ఈ లిస్ట్‌ను చెక్‌ చేస్తే మా ఇంటి బంగారం అమెరికాలో కూడా మరో ప్రత్యేక రికార్డును సొంతం చేసుకుంది. తెలుగు నుంచి లేడీ ఓరియెంటెడ్ స్టోరీస్ తో తెరకెక్కిన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా తెలుస్తోంది. అదే సమయంలో లేడీ ఓరియంటెడ్ స్టోరీస్ తో రూపొందిన సినిమాలకు కూడా సరైన కంటెంట్ ఉంటే ప్రేక్షకులు భారీగా ఆదరిస్తారనే విషయాన్ని మా ఇంటి బంగారం మూవీ మరోసారి ప్రూవ్ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇకపోతే ఈ మా ఇంటి బంగారం మూవీ విషయానికొస్తే.. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మా ఇంటి బంగారం చిత్రంలో మంజూష ముక్కవిల్లి, దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న మా ఇంటి బంగారం మూవీ జోరును బట్టి చూస్తే..100 కోట్ల మైలురాయిని చేరుకోవడం మాత్రమే కాకుండా మరిన్ని రికార్డులు కూడా ఈ సినిమా ఖాతాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఫుల్ రన్ లో ఎంతటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *