Movie: ఇన్ స్టా గ్రామ్‌తో శ్రీలీల అన్నీ లక్షలు సంపాదిస్తుందా? ఫ్లాప్స్‌ ఉన్న సంపాదన మాత్రం ఫుల్‌ అంటున్న నెటిజన్స్‌

సినీ సెలబ్రెటీలు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. తమ సినిమా అప్డేట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటుంటారు. అలాగే సోషల్ మీడియా ద్వారా సెలబ్రెటీలు గట్టిగానే సంపాదిస్తున్నారట. ఇప్పుడు ఓ ముద్దుగుమ్మ బ్రాండ్ ప్రమోషన్స్ తో లక్షల్లో ఎర్న్‌ చేస్తోందని టాక్‌. ఇంతకీ ఆ హీరోయిన్‌ ఎవరు? ఏ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ మీద లక్షలు ఎర్న్‌ చేస్తోంది? ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సినిమా హీరోయిన్స్ చాలా మంది సోషల్ మీడియాతో ఎక్కువ పాపులర్ అవుతుంటారు. సినిమాలతో కంటే సోషల్ మీడియా ద్వారానే అభిమానులకు టచ్ లో ఉంటారు. మాములుగానే సినీ సెలబ్రెటీలకు క్రేజ్ ఉంటుంది. సోషల్ మీడియాలో ఆ క్రేజ్ డబుల్ ఉంటుంది. అయితే హీరోయిన్స్ కేవలం సినిమాలతోనే కాదు సోషల్ మీడియాతోనూ గట్టిగానే సంపాదిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇన్ స్టా గ్రామ్ సబ్ స్క్రిప్షన్ కూడా వచ్చింది. చాలా మంది పైసలు కట్టి ఎక్స్ క్లూజివ్ కంటెంట్ చూడండి అంటూ నెటిజన్స్ కు ఆఫర్స్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ ముద్దుగుమ్మ కేవలం ఇన్ స్టా గ్రామ్ తోనే లక్షలు సంపాదిస్తుందట. రిసెంట్‌గా ఆ ముద్దుగుమ్మ చేసిన సినిమాలన్నీ దాదాపు నిరాశపరిచాయి.. కానీ ఆమె క్రేజ్‌లో మాత్రం ఆ అమ్మడు ఎక్కడా తగ్గడం లేదు. వరుసగా ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. సినిమాలతో పాటు ఇప్పుడు సోషల్ మీడియాతోనూ లక్షలు సంపాదిస్తుంది ఆ అమ్మడు.

సోషల్ మీడియా బ్రాండ్ ప్రమోషన్స్ తో కోట్లల్లో సంపాదిస్తోంది యంగ్ బ్యూటీ శ్రీలీల. ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే ప్రతి నెలా 30 నుంచి 50 లక్షల రూపాయల ఎర్న్‌ చేస్తోంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన శ్రీలీల తెలుగులో తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యింది. వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నపటికీ ఈ చిన్నదానికి సాలిడ్ హిట్ మాత్రం రాలేదు. అప్పుడెప్పుడో వచ్చిన ధమాకా, భగవంత్ కేసరి సినిమాలు తప్ప ఈ అమ్మడి ఖాతాలో పెద్దగా హిట్స్ లేవు. తెలుగులోనే కాదు తమిళ్, హిందీలోనూ అదృష్టం పరీక్షించుకుంటుంది ఈ చిన్నది.

ఇక ఇప్పటికే శ్రీలీల తమిళ్ లో ఓ సినిమా చేసింది. కానీ ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు హిందీలో ఓ సినిమా చేస్తోంది. ఇదిలా ఉంటే శ్రీలీల సినిమాలతో పాటు సోషల్ మీడియాతోనూ గట్టిగానే ఎర్న్‌ చేస్తోంది. ఈ అమ్మడి ఇన్ స్టాలో 17 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్ స్టాలో శ్రీలీల బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తోంది. ఆ ప్రమోషన్స్ తో రోజుకు 5 నుంచి 10లక్షల వరకు అందుకుంటుంది. ఇలా నెలకు 30లక్షల నుంచి 50 లక్షల వరకు సంపాదిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *