Hyderabad: కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల ప్లాన్.. హైదరాబాద్ ట్రాఫిక్‌పై ప్రభుత్వం కీలక అడుగు

హైదరాబాద్ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నగరంలోని కీలక ప్రాంతమైన కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ రూపురేఖలు మారనున్నాయి. హైదరాబాద్ ప్రజలకు మరో గుడ్ న్యూస్. నగరంలోని ప్రముఖ కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో త్వరలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ ప్రాంతంలో నిత్యం ఏర్పడే ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కీలక ప్రణాళికను అమలు చేయనుంది. ఇందులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి ముందడుగు వేసింది.

ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 14 కీలక నిర్మాణాలను చేపట్టనున్నారు. వీటిని ఏడు ప్రధాన కూడళ్ల వద్ద నిర్మించనున్నారు. గతంలో కోర్టు కేసులు, భూసేకరణ ప్రక్రియ కారణంగా పనుల్లో కొంత జాప్యం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ అడ్డంకులు తొలగిపోవడంతో అధికారులు ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తున్నారు. మొత్తం పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాహనదారులకు పెద్దగా ఇబ్బందులు కలగకుండా నిర్మాణ పనులను దశలవారీగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు

ఈ ప్రాజెక్టులో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 నుంచి కేబీఆర్ పార్క్ రోడ్డు వరకు నాలుగు లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. అలాగే పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు మూడు లేన్ల ఫ్లైఓవర్ ప్రతిపాదించారు.

మహారాజా అగ్రసేన జంక్షన్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 వైపు రెండు లేన్ల ఫ్లైఓవర్, ఫిల్మ్ నగర్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 మధ్య రెండు లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 వరకు కూడా రెండు లేన్ల ఫ్లైఓవర్ ఏర్పాటు చేయనున్నారు.

వీటితో పాటు మొత్తం ఆరు అండర్‌పాస్‌లు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఫిల్మ్ నగర్ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు రెండు లేన్ల అండర్‌పాస్, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నుంచి ఫిల్మ్ నగర్ వైపు ఒక అండర్‌పాస్, ఎల్వీ ప్రసాద్ నుంచి పంజాగుట్ట వైపు మూడు లేన్ల అండర్‌పాస్ నిర్మించనున్నారు. అలాగే రోడ్ నంబర్ 45 నుంచి కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ వరకు మరో అండర్‌పాస్ ప్రతిపాదించారు.

రూ.1,090 కోట్ల అంచనా వ్యయం

ఈ భారీ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు దాదాపు రూ.1,090 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో నిర్మాణ పనులకు రూ.699.75 కోట్లు, భూసేకరణ కోసం సుమారు రూ.390 కోట్లు ఖర్చు కానున్నట్లు తెలుస్తోంది.

ఉక్కు వంతెనల నిర్మాణం చేపట్టడం ద్వారా భూసేకరణ అవసరం తగ్గడంతో పాటు తక్కువ స్థలంలోనే పనులు చేపట్టే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు పూర్తయితే కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గడంతో పాటు వాహనదారులకు సిగ్నల్ ఫ్రీ జర్నీ అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా హైటెక్ సిటీ, ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వైపు వెళ్లే వాహనదారులకు ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *