బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల మరో ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు (Tamil Nadu), కేరళలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
హైదరాబాద్ (Hyderabad) మహా నగర వ్యాప్తంగా వర్షం (Heavy Rain) దంచికొడుతోంది. సోమవారం సాయంత్రం వరకు ఎండ ఉండగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. భారీగా కురిసిన వర్షంతో నగర వాసులు తడిసి ముద్దయ్యారు. వర్షానికి వివిధ పసులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. నగరంలోని బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణ గూడ, లక్షీకాపుల్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, మాసాబ్ ట్యాంక్, బంజరహిల్స్, GVK, పంజా గుట్ట, అమీర్ పేట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. జీహెచ్ఎంసీ (GHMC), పోలీసులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు ప్రారంభించారు.
ఇక బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో (Arabian Sea) ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల మరో ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్ప పీడనం ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణతో (Telangana) పాటు తమిళనాడు, కేరళలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Department of Meteorology) వెల్లడించింది. కోస్తాంధ్రలో ఆగస్టు 4, 5 తేదీల్లో రాయలసీమలో ఆగస్టు 3 నుంచి 6 వరకు భారీ వర్షాలు పడతాయి. అలాగే లక్షద్వీప్ (Lakshadweep), కర్ణాటక, కేరళ, యానాంలో కూడా వచ్చే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.
గత రెండు రోజులుగా.. ఏపీ, తెలంగాణలో పగలు ఎండ, మేఘాల వాతావరణం ఉంటుంది. రాత్రిపూట ఒక్కసారిగా వాతావరణం మారి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. తెలంగాణలో రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, యాదగిరిగుట్ట, సిరిసిల్ల, నిజమాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఏపీలో.. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, చిత్తూరు, ఒంగోలులో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.