Bigg Boss 10 Telugu:అగ్ని పరీక్షలో హైడ్రామా.. కంటెస్టెంట్‌పై అభిజిత్ ఫైర్! ప్రోమో వైరల్

బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 10కు ముందు సామాన్యుల అగ్ని పరీక్ష ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో శ్రీముఖితో పాటు అభిజిత్ కూడా కొందరు కంటెస్టెంట్స్‌పై సీరియస్ అయినట్లు కనిపిస్తోంది. అంతేకాదు, కొందరికి ముఖం మీదే రెడ్ కార్డ్ చూపించినట్లు ప్రోమోలో తెలుస్తోంది.

బుల్లితెరపై భారీ క్రేజ్ సంపాదించుకున్న బిగ్ బాస్ షో ఇప్పటికే తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలో 10వ సీజన్ ప్రారంభం కానుండగా.. అంతకుముందే సామాన్యులను ఎంపిక చేసేందుకు నిర్వహించే **‘బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2’ప్రారంభం కానుంది. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2.. ఆగస్టు 15 నుంచి షురూ

ఆగస్టు 15 నుంచి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ రియాలిటీ షోలో పోటీదారులు తమ ప్రతిభ, నైపుణ్యాలు, వ్యూహాలను ప్రదర్శించి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు పోటీ పడనున్నారు. ఈసారి మొత్తం 70 మంది అగ్ని వారియర్స్ తమ టాలెంట్‌ను చూపించనున్నట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది.

విభిన్న టాలెంట్లతో ఆకట్టుకున్న కంటెస్టెంట్స్

ప్రోమో ప్రారంభంలోనే ఓ కంటెస్టెంట్ బాడీబిల్డింగ్, ఫిట్‌నెస్ స్కిల్స్‌తో ఆకట్టుకోగా.. మరో వ్యక్తి కుడి నుంచి ఎడమకు రివర్స్‌గా తెలుగు రాసి జడ్జిలను ఆశ్చర్యపరిచాడు. గ్రామాల్లో జానపద పాటలు పాడుతూ వ్యవసాయం చేసే ఓ యువతి తన జీవిత కథతో అందరినీ ఆకట్టుకుంది. ఆమె ప్రతిభకు ఫిదా అయిన నవదీప్ వెంటనే గ్రీన్ ట్యాగ్ ఇచ్చారు.

ఇక డ్యాన్స్, ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లు, సరదా సంభాషణలతో ప్రోమో ఆసక్తికరంగా సాగింది. పోటీదారుల ప్రతిభను పరిశీలించిన జడ్జిలు వారికి గ్రీన్, రెడ్ సిగ్నల్స్ ఇస్తూ నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపించింది.

అభిజిత్‌పై కంటెస్టెంట్ కౌంటర్.. సీరియస్ అయిన జడ్జి

అయితే ప్రోమో చివర్లో జరిగిన ఓ సంఘటన ఆసక్తిని పెంచింది. ఓ కుర్రాడు జడ్జి సీటులో ఉన్న అభిజిత్‌కు కౌంటర్ ఇచ్చాడు. గెలిచిన తర్వాత రెండేళ్ల పాటు ఎక్కడా కనిపించలేదంటూ అభిజిత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. దీంతో అభిజిత్ సీరియస్ అవుతూ.. “ఏం మాట్లాడుతున్నావ్.. మాకేం పని లేదనుకున్నావా?” అంటూ ఘాటుగా స్పందించినట్లు ప్రోమోలో కనిపించింది.

ప్రస్తుతం ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈసారి అగ్ని పరీక్షలో ఎవరు మెప్పించి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెడతారో చూడాలి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *