Lenin Movie : సైలెంట్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్లాక్‌బస్టర్ లెనిన్ మూవీ.. అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీ.. భాగ్యశ్రీ బోర్సే నటనకు ప్రశంసలు
థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఓ బ్లాక్‌బస్టర్… బాక్సాఫీస్ దగ్గర వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతూనే ఉన్నా… ఎలాంటి పెద్ద అనౌన్స్‌మెంట్ లేకుండానే అర్ధరాత్రి నుంచి సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఆ వార్తతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అసలు ఆ సినిమా ఏది..? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది..? తెలుసుకుందాం.

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ లెనిన్. మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ విలేజ్ లవ్ స్టోరీ కమ్ రివేంజ్ థ్రిల్లర్‌లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. జులై 10న భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. గ్రామీణ నేపథ్యంలోని కథ, అఖిల్ నటన, భాగ్యశ్రీ బోర్సే గ్లామర్, తమన్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ కలిసిరావడంతో ‘లెనిన్’ అఖిల్ కెరీర్‌లోనే అతిపెద్ద విజయంగా నిలిచింది. నిర్మాతల ప్రకారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
థియేటర్లలో ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న లెనిన్ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకుంది. ఇక అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ ఇవాళ తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. దీంతో థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులతో పాటు మరోసారి చూడాలనుకునే అభిమానులు కూడా ఇప్పుడు ఇంట్లోనే ఈ సినిమాను ఆస్వాదించొచ్చు.
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పీ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సుమారు 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ విజయాన్ని అందుకుంది. ఈశ్వరీ రావు, ప్రమోద్ పంజు, బ్రహ్మాజీ, రాంకీ, సునీల్, గెటప్ శ్రీను, శత్రు కీలక పాత్రలు పోషించారు. మరి థియేటర్లలో లెనిన్ సినిమాను మిస్ అయ్యారా..? లేదా మరోసారి చూడాలనుకుంటున్నారా..? అయితే ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ బ్లాక్‌బస్టర్‌ను చూసి ఎంజాయ్ చేయండి.