యూపీఐ లావాదేవీలపై ఛార్జీలకు కేంద్రం కీలక అడుగు..! యూపీఐ చెల్లింపుల్లో మార్పులు.. కొత్త బిల్లు ఏం చెబుతోంది?

యూపీఐ లావాదేవీలు ఇకపై ఉచితం కాదు అనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన కీలక బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు ఆమోదం లభించడంతో భవిష్యత్తులో యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే అవకాశంపై చర్చ మొదలైంది. యూపీఐ వ్యవస్థలో ఇది కీలక మార్పుగా భావిస్తున్నారు.

ఇప్పటివరకు ఉచితంగా కొనసాగుతున్న యూపీఐ (UPI) లావాదేవీల విధానంలో త్వరలో మార్పులు రానున్నాయి. యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధించే ప్రతిపాదనకు కేంద్రం ముందడుగు వేసింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం-2007లో సవరణలకు సంబంధించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

ఈ సవరణల ద్వారా యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే అధికారం బ్యాంకులకు కల్పించనున్నారు. ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. త్వరలోనే ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ కూడా ఆమోదం లభించిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదానికి పంపిస్తారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు ఎలా ఉంటాయి?

ప్రస్తుతం యూపీఐ ద్వారా డబ్బులు పంపడం, స్వీకరించడం పూర్తిగా ఉచితం. వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీలపై ఎలాంటి రుసుములు లేవు. అయితే ఇకపై కొన్ని రకాల వ్యాపార లావాదేవీలపై ఛార్జీలు విధించే అవకాశం ఉంది.

ప్రధానంగా పెద్ద వ్యాపారులు, మర్చెంట్ల నుంచి యూపీఐ లావాదేవీలకు రుసుములు వసూలు చేయనున్నారు. వినియోగదారులు యూపీఐ ద్వారా చెల్లించిన మొత్తాన్ని స్వీకరించే వ్యాపారులు ఈ ఛార్జీలను భరించాల్సి ఉంటుంది. బ్యాంకులు ఈ మొత్తాన్ని మర్చెంట్ల నుంచి వసూలు చేయనున్నాయి.

అయితే చిన్న దుకాణాలు, సాధారణ వినియోగదారులపై దీని ప్రభావం ఉండదని తెలుస్తోంది. రూ.2 వేల కంటే ఎక్కువ విలువైన కొన్ని లావాదేవీలపై ఛార్జీలు విధించే అవకాశం ఉందని సమాచారం.

మళ్లీ అమల్లోకి మర్చంట్ డిస్కౌంట్ రేట్?

గతంలో యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) పేరుతో వ్యాపారుల నుంచి ఛార్జీలు వసూలు చేసేవారు. అయితే 2020లో ఈ విధానాన్ని తొలగించారు. ఇప్పుడు మళ్లీ ఈ విధానాన్ని తీసుకురావాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ కొత్త విధానం వల్ల సామాన్య వినియోగదారులు, చిన్న వ్యాపారులకు ఎలాంటి భారం ఉండదని కేంద్రం స్పష్టం చేస్తోంది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే లావాదేవీలు, చిన్న వ్యాపార చెల్లింపులు ఇప్పటిలాగే ఉచితంగానే కొనసాగనున్నాయి.

యూపీఐ వ్యవస్థ బలోపేతానికి నిధుల వినియోగం

యూపీఐ వ్యవస్థ నిర్వహణ, సాంకేతిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీగా ఖర్చు అవుతోంది. ఈ నేపథ్యంలో పెద్ద వ్యాపారుల నుంచి వచ్చే రుసుములను యూపీఐ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడానికి ఉపయోగించనున్నారు.

ప్రస్తుతం పేమెంట్ అగ్రిగేటర్లకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తోంది. అయితే యూపీఐ మౌలిక సదుపాయాల విస్తరణ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో అదనపు ఆదాయ మార్గాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే యూపీఐ వ్యవస్థలో ఇది ఒక కీలక మార్పుగా నిలవనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *