movie: ఏం సినిమా రా బాబూ ఏళ్లు గడుస్తున్నా ఇంక ట్రెండింగ్‌లో.. కోట్ల కలెక్షన్స్‌.. యువతకు ఓ ఎమోషన్‌..

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమాలు చాలా ఉన్నాయి. అలాగే కొన్ని మూవీస్‌ రిలీజ్ అయి దశాబ్దాలు గడిచినప్పటికీ ఏమాత్రం తగ్గని డిమాండ్ తో.. ఇప్పటికీ యూట్యూబ్ లో హావా కొనసాగిస్తున్నాయి. అందులోని పాటలు సైతం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇంతకీ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నా ఆ సినిమా ఏది? ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు తెలుసుకుందాం.

1996లో బాక్సాఫీస్ షేక్ చేసింది ఓ సినిమా. ముఖ్యంగా అప్పట్లో యువతకు పిచ్చెక్కించేసింది. ఇక అందులోని పాటల గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ సోషల్ మీడియా, యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. అప్పట్లో థియేటర్లలో ఆ పాటలు వింటే కుర్రకారు సీట్లలోంచి లేచి డ్యాన్సులు చేసేవాళ్లట. ఇప్పటికీ ఆ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఆ మూవీ పేరే ప్రేమదేశం. ఈ చిత్రంలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా ముస్తఫా.. ముస్తఫా పాట కాలేజీ కుర్రాళ్లకు ఒక ఎమోషన్. కాలేజ్ కుర్రాళ్ల స్నేహాన్ని, ప్రేమని వెండితెరపై అద్భుతంగా చూపించిన క్లాసిక్ లవ్ స్టోరీ ఇది.

ఇక ప్రేమదేశం మూవీలో అబ్బాస్, వినీత్, టబు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీనే ఆ ముగ్గురి జీవితాలను మార్చేసింది. తెలుగుతోపాటు తమిళంలోనూ ఓ ఊపు ఊపారు. ఇక ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో కె.టి కుంజుమెన్ నిర్మించారు. అప్పటికే ఆయన జెంటిల్మెన్, ప్రేమికుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ఈ చిత్రం స్టోరీని దర్శకుడు కదిర్ చెప్పారట. దీంతో ఈ మూవీని నిర్మించాలని ఫిక్స్ అయ్యారట కుంజుమెన్. కానీ దర్శకుడు, నిర్మాత మధ్య చిన్న అభిప్రాయ బేధం వచ్చి.. ఈ సినిమాను శంకర్ లాంటి టాప్ డైరెక్టర్ అయితేనే న్యాయం చెయగలరని ఎంతో మంది అభిప్రాయ పడ్డారు. కానీ నిర్మాత మాత్రం దర్శకుడు కదిర్ పై నమ్మకం పెట్టుకుని చిత్రీకరించారని ఇండస్ట్రీ టాక్‌.

అలాగే ఈ ప్రేమదేశం చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అప్పట్లో ఈ మూవీలోని పాటలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఈ సినిమాలోని కాలేజీ వాతావరణాన్ని, రిచ్ లుక్ తీసుకురావడానికి అప్పట్లోనే దాదాపు మూడు కోట్లతో సెట్ నిర్మించారట మేకర్స్‌. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన ఈ సినిమాను క్లైమాక్స్ లోని స్నేహానికి ఇచ్చిన విలువ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాతో అబ్బాస్ అప్పట్లో అమ్మాయిల కలల రాకూమారుడిగా మారిపోయారు. ఇప్పటికీ ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *