బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మళ్లీ ఆందోళనలతో అట్టుడుకుతోంది. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు చెలరేగాయి. ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హైది మరణించడంతో చెలరేగిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. పత్రిక కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. త్తోగ్రామ్‌లోని భారత అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయం వద్ద ఆందోళనలు చేలరేగాయి.
ఇక విషయంలోకి వెళ్తే..
బంగ్లాదేశ్(bangladesh-riots)లో మరోసారి హింసాత్మక నిరసనలు మిన్నంటాయి. దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువ నేత, ఇంక్విలాబ్ మంచా ప్రతినిధి షరీఫ్ ఓస్మాన్ హాదీ(Osman Hadi death) మరణవార్త తెలియడంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. నిరసనకారులు ఆగ్రహంతో మాజీ ప్రధాని షేక్ హసీనా (Bangladesh Ex PM Sheikh Hasina) కు చెందిన అవామీ లీగ్ కార్యాలయాలకు నిప్పు పెట్టడమే కాకుండా, ప్రముఖ వార్తాపత్రికల కార్యాలయాలపై కూడా దాడులకు తెగబడ్డారు. డిసెంబర్ 12న ఢాకాలోని పల్టాన్ ప్రాంతంలో ఉస్మాన్ బిన్ హాదీపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. తలకు తీవ్ర గాయమైన ఆయన్ని మెరుగైన చికిత్స కోసం సింగపూర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆయన కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే వేలాది మంది విద్యార్థులు, మద్దతుదారులు ఢాకాలోని షాబాగ్ కూడలికి చేరుకుని భారీ నిరసన చేపట్టారు.
భారత్ కార్యాలయం ముందు నిరసన..
చట్టోగ్రామ్ పోర్ట్ నగరంలోని ఖుల్షీ ప్రాంతంలో ఉన్న భారత హైకమిషన్ కార్యాలయం ఎదుట నిరసనకారులు గుమిగూడారు. హాది హత్యను ఖండిస్తూ, అవామీ లీగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిరసనకారులను కార్యాలయ ప్రాంగణం నుంచి చెదరగొట్టారు. అక్కడే భారీగా మోహరించారు.హైది మరణ వార్త తెలియగానే కోపంతో ఉన్న ప్రజలు నిరసనలు చేపట్టారు. నినాదాలు చేస్తూ, ప్లకార్డులు పట్టుకుని నిరసనకారులు హాది భద్రతలో అధికారుల వైఫల్యమే కారణమని ఆరోపించారు. ఆగ్రహంతో ఉన్న కొంతమంది నిరసనకారులు డైలీ ప్రథమ్ ఆలో కార్యాలయంపై దాడి చేశారు. ఆ తర్వాత ది డైలీ స్టార్ పై దాడి చేసి నిప్పు పెట్టారు. ఈ కార్యాలయంలో పలువురు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లిన నిరసనకారులు అడ్డుకున్నారు. ఇక భవనంలో చిక్కుకున్న వారిని తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కార్యాలయం నుంచి సురక్షితంగా బయటకు తీసుకున్నట్లు స్థానిక వార్తపత్రిక పేర్కొంది.
ఉస్మాన్ హైది మరణంతో చెలరేగిన అల్లర్లు..
ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హైది సింగపూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు. గత శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పుల జరిపారు. తీవ్రంగా గాయపడిన హైదిని మెరుగైన చికిత్స కోసం సింగపూర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ మరణవార్త విన్న అనంతరం ఢాకాలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. హైది ఇటీవల భారతదేశ మ్యాప్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ క్రమంలో ఆయన మృతితో బంగ్లాదేశ్‌లో గురువారం అర్ధరాత్రి నుంచి భారత వ్యతిరేక ఆందోళనలు మొదలయ్యాయి. మరోవైపు ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానమంత్రి మహ్మద్ యూనస్ శాంతిని పాటించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ సంతాప దినంగా ప్రకటించి, దేశవ్యాప్తంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామని తెలిపారు. హైది మరణానికి కారణమైన వారికి వదిలపెట్టబోమని హెచ్చరించారు.

Leave a Reply