Another massive cloudburst in Uttarakhand.. Hundreds of families under the rubble?

దేశ భూమి ఉత్తరాఖండ్ ని వరదలు ఇంకా వదలేదు. దాదాపు రెండు నెలలు కావోస్తున్న ఆ రాష్ట్రంలో మాత్రం ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. తాజాగా మరో సారి.. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో ఎన్నో వందల కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకున్నాయి. అయితే ప్రాణ నష్టం తీవ్రంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక విషయంలోకి వెళ్తే..

ఇటీవల ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా థరాలీలో క్లౌడ్ బరస్ట్ సంభవించిన విషయం తెలిసిందే. ఈ క్లౌడ్ బరస్ట్‌లో ఎందరో శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. అయితే మరోసారి తాజాగా ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో ఎన్నో వందల కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకున్నాయి. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రాణ నష్టం తీవ్రంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కొట్టుకుపోయిన వంతెనలు..

ఉత్తరాఖండ్‌లో అలకనంద, మందాకిని నదుల సంగమంలో నీటి మట్టాలు నిరంతరం పెరుగుతున్నాయి. కేదార్‌నాథ్ లోయలోని లావారా గ్రామంలో, మోటారు రోడ్డుపై ఉన్న వంతెన వరద ప్రవాహాలకు కొట్టుకుపోయింది. రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల్లో సంభవించిన ఈ క్లౌడ్ బరస్ట్ కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రోడ్లు మూసుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు, ఇళ్లు వర్షపు నీరు, బురదతో నిండిపోయాయి. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ తాజా క్లౌడ్ బరస్ కారణంగా.. రుద్రప్రయాగ్‌లోని అలకనంద, మందాకిని నదుల నీటి మట్టాలు క్షణం క్షణానికి పెరుగుతున్నాయి. రుద్రప్రయాగ్‌లోని హనుమాన్ ఆలయం పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం వల్ల 180కి పైగా రోడ్లు మూసుకుపోయాయి. జౌలా-భదేత్ గ్రామంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. వరదల్లో అనేకమంది గల్లంతైనట్లు సమాచారం. అదే ప్రాంతంలోని స్యూర్ గ్రామంలో ఒక ఇల్లు దెబ్బతింది. రోడ్డుపై పార్క్ చేసిన కారు శిథిలాల్లో కొట్టుకుపోయింది. భదేత్‌, బగద్ధార్‌, తలాజ్​మణి గ్రామాల రెండు వైపులా వాగులు ఉప్పొంగి వరద ముప్పు మరింత పెరిగింది. భారీ వర్షాల దృష్ట్యా రుద్రప్రయాగ్‌, బాగేశ్వర్‌, చమోలి, హరిద్వార్‌ జిల్లాల్లోని పాఠశాలలను మూసివేశారు.

సహాయక చర్యలు..

ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా మోటారు రోడ్డుపై వంతెనలు కొట్టుకునిపోయాయి. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. NDRF, SDRF బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..

భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ అతలాకుతలమైంది. ఉత్తరాఖండ్‌లోని చమోలి, పిథోరగఢ్, బాగేశ్వర్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే ఉత్తరకాశి, డెహ్రాడూన్, తెహ్రీ గర్హ్వాల్, రుద్రప్రయాగ్, పౌరి గర్హ్వాల్, హరిద్వార్, అల్మోరా, నైనిటాల్‌లకు శుక్రవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *