71st National Film Awards | సినీ ప్రేమికులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన వెలువడింది. 2023లో విడుదలైన చిత్రాలకు గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను ప్రకటించింది. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటిస్తోంది.
ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న సినిమాలకు, నటులకు 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు. ఈ అవార్డులను డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ (DFF) ప్రకటిస్తుంది. సినిమా రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ అవార్డులను రాష్ట్రపతి చేతులు మీదగా గ్రహీతలకు అందజేయనున్నారు. 2023 సంవత్సరంలో తెరకెక్కిన సినిమాల్లో వైవిధ్యం, సృజనాత్మకత, సాంస్కృతిక ప్రాముఖ్యత బట్టి అవార్డులను అందజేస్తారు.
తాజాగా కేంద్రం ప్రకటించింది.. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరిని అవార్డు వరించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో శ్రీలీల, కాజల్ కీలక పాత్రలు పోషించారు. అలాగే, ఉత్తమ యాక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ)లో ‘హను-మాన్’ చిత్రం అవార్డు దక్కించుకోగా, ఉత్తమ గేయ రచయితగా ‘బలగం’లో ‘ఊరు పల్లెటూరు’ పాటకు గానూ కాసర్ల శ్యామ్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక ఉత్తమ తమిళ చిత్రంగా ‘పార్కింగ్’కు అవార్డు దక్కింది. బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డు ఉత్పల్ దత్త (అస్సామీ)కు ప్రకటించారు. తొలుత నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరి అవార్డులను వెల్లడించారు.
అవార్డు ఇవే…
- నాన్ ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరి.. స్పెషల్ మెన్షన్ చిత్రాలు
- నేకల్: క్రానికల్ ఆఫ్ ప్యాడీ మ్యాన్ (మలయాళం)
- ది సీ అండ్ సెవెన్ విలెజెస్ (ఒడియా)
- బెస్ట్ స్క్రిప్ట్: సన్ ఫ్లవర్స్ వోర్ ది ఫస్ట్ వన్స్ టు నో (కన్నడ)
- బెస్ట్ వాయిస్ ఓవర్: ది సేక్రెడ్ జాక్ ఎక్స్ ప్లోరింగ్ ది ట్రీస్ ఆఫ్ విషెస్ (ఇంగ్లీష్)
- బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: ది ఫస్ట్ ఫిల్మ్ (హిందీ)
- బెస్ట్ ఎడిటింగ్: మూవీంగ్ ఫోకస్ (ఇంగ్లీష్)
- బెస్ట్ సౌండ్ డిజైన్: దుందగిరి కే పూల్ (హిందీ)
- బెస్ట్ సినిమాటోగ్రఫీ: లిటిల్ వింగ్స్ (తమిళ్)
- బెస్ట్ డైరెక్షన్: ది ఫస్ట్ ఫిల్మ్ (హిందీ)
- బెస్ట్ ఎడిటింగ్: మూవీంగ్ ఫోకస్ (ఇంగ్లీష్)
- బెస్ట్ సౌండ్ డిజైన్: దుందగిరి కే పూల్ (హిందీ)
- బెస్ట్ సినిమాటోగ్రఫీ: లిటిల్ వింగ్స్ (తమిళ్)
- బెస్ట్ డైరెక్షన్ : ది ఫస్ట్ ఫిల్మ్ (హిందీ)
- బెస్ట్ ఆర్ట్స్/కల్చర్ ఫిల్మ్: టైమ్స్ తమిళనాడు (ఇంగ్లీష్)
- బెస్ట్ బయోగ్రాఫికల్ ఫిల్మ్: మా బావు, మా గావ్ (ఒడిశా), లెంటినో ఓవో ఏ లైట్ ఆన్ ది ఈస్ట్రన్ హారిజాన్ (ఇంగ్లీష్)
- ఉత్తమ పరిచయ దర్శకుడు: మావ్: ది స్పిరిట్ డ్రీమ్స్ ఆఫ్ చెరా (మిజో
- బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్: ప్లవరింగ్ మ్యాన్ (హిందీ)