YouTuber Bhaiya Sunny Yadav appeared in Simhachalam

Simhachalam : గత కొన్ని రోజులుగా కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ప్రముఖ యూట్యూబర్ (YouTuber) భయ్యా సన్నీ యాదవ్ (Bhaiya Sunny Yadav) ఆచూకీ లభ్యమైంది. దీంతో అతడి మిస్సింగ్ డ్రామాకు తెర పడింది అనే చెప్పాలి. తాజాగా అతడు ఆంధ్రప్రదేశ్‌లోని సింహాచలంలో ప్రత్యక్షమయ్యాడు. నెల రోజుల కిందట చెన్నై ఎయిర్‌పోర్ట్‌ నుంచి కనిపించకుండా పోయిన భయ్యా సన్నీ యాదవ్‌.. లేటెస్ట్‌గా “నేనొచ్చేశా” అంటూ ఇన్‌స్టాలో పోస్టు పెట్టాడు. అంతకుముందు పాకిస్తాన్‌కు వెళ్లి వస్తుండగా చెన్నై ఎయిర్‌పోర్టులో (Chennai Airport) సన్నీ యాదవ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిందంటూ వార్తలు వచ్చాయి. నేను ‘వైజాగ్ వెళ్తున్నా, మీ ఇంటికెళ్తా, మీ అమ్మానాన్నకి ధైర్యం చెబుతా. నువ్వు టెన్షన్ పడకు’ అంటూ మంగళవారం పోస్ట్ చేశాడు. ప్రస్తుతం బయ్యా సన్నీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

బయ్యా సన్నీ యాదవ్ నెల రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. పాకిస్తాన్ (Pakistan) వెళ్లి వస్తుండగా.. చెన్నై ఎయిర్పోర్ట్ ఎన్ఐఏ అరెస్ట్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ కోసం సన్నీ గూఢచారిగా పనిచేస్తున్నాడంటూ ఆరోపణలు వచ్చాయి. పాక్ జాకీర్ నాయక్ (Zakir Naik) సమ్మిట్కు బయ్యా సన్నీ హాజరయ్యాడు. అయితే బయ్యా సన్నీ నిజంగా ఎన్ఐఏ అదుపులో ఉన్నాడా..? లేదా..? అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. బయ్యా సన్నీ తండ్రి మాత్రం కొడుకు గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా సమాచారం ఇవ్వలేదు. మరొక యూట్యూబర్ అన్వేష్ (Anvesh) ఇంటికి వెళ్తున్నట్లు పోస్ట్ చేశాడు. ‘నన్ను గత రాత్రి ఎవరో కిడ్నాప్ చేశారు, ఇప్పుడే విడిచిపెట్టారు. వచ్చే నాలుగు రోజులు నాకు ఎంతో కీలకం. రెడీ టు ఫేస్ ఎవ్రీ థింగ్’ అంటూ బయ్యా సన్నీ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. చెన్నైలో అరెస్ట్ అయిన బయ్యా సన్నీ సింహాచలంలో ప్రత్యక్షమవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నెల రోజుల పాటు ఎక్కడికి వెళ్లారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Also Read : https://www.instagram.com/p/DK_hQD9TrfN

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *