Young Hero's comments on Akhanda 2 trailer?

అఖండ 2 : సింహా, లెజెండ్, అఖండ.. ఇలా బాలకృష్ణ, బోయపాటి కాంబో అంటేనే బాక్సాఫీస్‌కు పూనకాలు వస్తాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు వీళ్లు నాలుగోసారి అఖండ 2: తాండవంతో వస్తున్నారు. రీసెంట్‌గా రిలీజైన బ్లాస్టింగ్ రోర్ టీజర్, అందులోని బాలయ్య మార్క్ డైలాగ్, సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో.. సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఫ్యాన్స్ అయితే ఫుల్ కిక్‌లో ఉన్నారు. అయితే, ఈ సినిమా క్రేజ్ కేవలం నందమూరి ఫ్యాన్స్‌కే పరిమితం కాలేదు. ఇప్పుడు ఇండస్ట్రీలోని యంగ్ హీరోల మధ్య కూడా అఖండ 2 గురించే హాట్ టాపిక్ నడుస్తోందట. ముఖ్యంగా, త్వరలో రాబోయే ట్రైలర్ కోసం వాళ్లు కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ఇది బాలయ్యకు ఉన్న లేటెస్ట్ జెనరేషనల్ ఫాలోయింగ్‌కు పెద్ద ప్రూఫ్.

ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న లీక్డ్ న్యూస్ ప్రకారం, అఖండ 2 టీమ్ నుంచి ట్రైలర్ రిలీజ్ అప్‌డేట్ ఇప్పటికే కొంతమంది యంగ్ హీరోలకు చేరిందట. ఆ అప్‌డేట్ తెలిసినప్పటి నుంచి, వాళ్ల వాట్సాప్ గ్రూపుల్లో ఇదే డిస్కషన్ నడుస్తోందని అంటున్నారు. ట్రైలర్ ఎలా ఉండబోతోంది బోయపాటి ఈసారి ఏం చూపించబోతున్నాడు? బాలయ్య లుక్స్ ఎలా ఉంటాయి? అనే దానిపై వాళ్లలో వాళ్లే డీప్ గా మాట్లాడుకుంటున్నారని కూడా టాక్. ఒక యంగ్ హీరో అయితే, తుపాకీ టీమ్‌తో మాట్లాడుతూ, ట్రైలర్ రాగానే చూస్తారుగా.. అప్పుడు ఇండస్ట్రీలో చాలా గట్టిగా మాట్లాడుకుంటారు!, అని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు. దీన్నిబట్టి ట్రైలర్ కట్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో ఊహించుకోవచ్చు. బోయపాటి ఈసారి ట్రైలర్‌తోనే సినిమాపై అంచనాలను హై లెవల్‌కు తీసుకెళ్లే ప్లాన్‌లో ఉన్నట్లు అర్థమవుతోంది.

సాధారణంగా ఒక సీనియర్ హీరో సినిమా గురించి యంగ్ జనరేషన్ హీరోలు ఇంతలా డిస్కస్ చేసుకోవడం చాలా అరుదు. ఇది బాలకృష్ణ స్టామినాను, బోయపాటి మార్క్ మాస్ యాక్షన్‌కు ఉన్న క్రేజ్‌ను మరోసారి చూపిస్తోంది. సీనియర్ హీరో అయినా, ఇప్పటికీ యూత్‌ను, మాస్‌ను అంతలా ఎట్రాక్ట్ చేయగలగడం బాలయ్య స్పెషాలిటీ. ఏదేమైనా, అఖండ 2 ట్రైలర్ రిలీజ్ కోసం కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇండస్ట్రీలోని యంగ్ హీరోలు కూడా గట్టిగానే ఎదురుచూస్తున్నారు. ఆ ట్రైలర్ వచ్చాక, ఆ యంగ్ హీరో చెప్పినట్లు నిజంగానే, గట్టిగా మాట్లాడుకునే, రేంజ్‌లో ఉంటుందో లేదో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *