Yogi Golimar in UP..! 20 encounters in 48 hours.. 14,973 encounters in 8 years..?
  • యూపీలో యోగి గోలిమార్..!
  • ఉత్తర్ ప్రదేశ్ లో ఆపరేషన్ లాంగ్డా.. ఆపరేషన్ ఖల్లాస్..
  • యూపీలో డౌడిలను ఏరిపారేస్తున్న యోగి..
  • యూపీ పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చిన యోగి..
  • 48 గంటల్లో.. 20 ఎన్ కౌంటర్లు..
  • 14 వేల మంది ఎన్ కౌంటర్.. 30 వేల నేరస్థులు అరెస్టు..
  • రోజుకు 6 ఎన్ కౌంటర్లు..!
  • యూపీలో నేరస్థులపై యోగి హుక్కు పాతం..
  • దొరికిన వాడిని పాయింట్ బ్లాక్ లో లేపేస్తున్న యూపీ పోలీసులు..
  • యూపీలో అతిక్ అహ్మద్ మాఫియాను లేపేసిన యోగీ సర్కార్…

UP CM Yogi Govt : ఉత్తరప్రదేశ్ లో నేరస్థులకు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ పేరు వినబడితేనే ఫ్యాంట్లు తడిసిపోతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ కి సీఎం యోగి అయినప్పటి నుంచి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పట్ల యోగి ప్రత్యేక దృష్టి పెట్టారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యూపీ పోలీసులకు నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని యోగి ఆదేశించారు. దీంతో 2017 మార్చి నుంచి 2018 జులై వరకు యూపీ పోలీసులు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 3వేల ఎన్ కౌంటర్లు నిర్వహించారు. దాదాపు 78 నేరస్థులను ఎన్ కౌంటర్ లో కాల్చి పడేసినట్లు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

ఇక విషయంలోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్ లో యోగీ అధిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి 10 నెలల లోనే రౌడీషీటర్లు, గూండాలు వెంటనే లోంగిపోవాలని యోగీ అధిత్యనాథ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో ఆ వార్త తెగ వైరల్ అయ్యింది. సీఎం యోగి నిర్ణయాలు దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించాయి. ఉత్తరప్రదేశ్ లో అసలు నేరాలు జరకుండా చూడాలని ప్రయతిస్తున్న పోలీసులు ఇప్పటి వరకూ 921 ఎన్ కౌంటర్లు చేశారు. 33 మంది రౌడీలు అంతం అయ్యారు. దీంతో నేరస్తులకు చుక్కలు చూపిస్తున్నా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. హంతకుల పీచమణిచేలా పోలీసులకు పూర్తిస్థాయిలో పవర్స్ ఇచ్చారు. కరడుగట్టిన క్రిమినల్స్ కూడా యోగి దెబ్బకు హడలెత్తిపోతున్నారు. గోలీమార్‌ అంటున్న యోగి సర్కార్‌ హయాంలో ఈ ఆరేళ్లలో 183 మంది ఎన్‌కౌంటర్‌ అయ్యారు. వీరిలో కరడుగట్టిన క్రిమినల్స్‌, రేపిస్టులే ఎక్కువ. మోస్ట్‌వాండెట్‌ క్రిమినల్‌ వికాస్‌దూబే ఎన్‌కౌంటర్‌తో యూపీలో ఉన్న క్రిమినల్‌ గ్యాంగ్‌లన్నీ తోకముడిచాయి.

యూపీలో యోగి గోలిమార్..!

దీంతో ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నేరస్తుల మీద ఏ రేంజ్‌లో ఉక్కుపాదం మోపుతోందో తెలియజేసే ఓ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఆ రికార్డులను చూస్తే మహేష్ బాబు దూకుడు సినిమాలో హీరో చెప్పిన డైలాగ్స్ గుర్తుకు రావడం ఖాయం. ఆ సినిమాలో తాను చేసిన ఎన్‌కౌంటర్ల గురించి ఓ భారీ డైలాగ్ చెబుతాడు. అయితే, రియల్ లైఫ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కూడా అలాంటిదే ఓ భారీ రికార్డు సృష్టించింది.

ఉత్తర్ ప్రదేశ్ లో ఆపరేషన్ లాంగ్డా..

ఇక తాజాగా.. యూపీలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఇటీవల ఉత్తరప్రదేశ్ పోలీసులు ఒక పెద్ద ఆపరేషన్ ప్రారంభించారు. కేవలం 48 గంటల్లో ఉత్తరప్రదేశ్ అంతటా నేరస్థులను ఎన్ కౌంటర్ చేశారు. ఆపరేషన్ లాంగ్డా, ఆపరేషన్ ఖల్లాస్ కింద ఈ చర్య జరిగింది. నేరాలను తగ్గించడానికి, నేరస్థులను కఠినంగా శిక్షించడానికి ఈ ఆపరేషన్లు ప్రారంభించారు. మీరట్ నుంచి ముజఫర్ నగర్ వరకు, పోలీసులు నేరస్థులను కాళ్ళపై కాల్చడం లేదా ఎన్ కౌంటర్లో చంపేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రమంతటా ఆపరేషన్ లాంగ్డా, ఆపరేషన్ ఖల్లాస్ కొనసాగుతున్నాయి. ఆపరేషన్ లాంగ్డా అంటే ఒక నేరస్థుడిని కాలిపై కాల్చి.. ఆపై అరెస్టు చేయడం. ఆపరేషన్ ఖల్లాస్ అంటే పెద్ద పెద్ద నేరాలకు పాల్పడిన నేరస్థుడికి ఎన్ కౌంటర్ ద్వారా ఏకంగా యమరాజు వద్దకు పంపడం. నేరానికి ఏకైక శిక్ష ఎన్కౌంటర్ అని యూపీ ప్రభుత్వం భావిస్తోంది.

48 గంటల్లో.. 20 ఎన్ కౌంటర్లు..

ఈ ఆపరేషన్లలో భాగంగా కేవలం 48 గంటల్లో, యూపీ పోలీసులు దాదాపు 20 ఎన్ కౌంటర్లను నిర్వహించారు. ప్రతి నగరంలో ఎన్ కౌంటర్లు జరిగాయి. మీరట్, ముజఫర్నగర్, ఫరూఖాబాద్, ఫిరోజాబాద్, మొరాదాబాద్, మధుర, హర్దోయ్, ఉన్నావ్, ఝాన్సీ, బులంద్హర్, బాగ్పత్, బల్లియా, లక్నో, ఘజియాబాద్, షామ్లీ వంటి ప్రాంతాల్లో నేరస్థుల ఏరివేతలు జరిగాయి. మొదటి ఎన్ కౌంటర్ ఫిరోజాబాద్లో జరిగింది. రూ.2 కోట్లు దోచుకున్న పేరుమోసిన నేరస్థుడు నరేష్ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. పరారీలో ఉన్న నేరస్థుడు నరేష్ను పట్టుకోవడానికి ASP అనుజ్ చౌదరి నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. మఖన్పూర్ ప్రాంతంలో నరేష్, పోలీసులు మధ్య కాల్పులు జరిగాయి. దీంతో ఆపరేషన్ ఖల్లాస్ ను అమలు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ ఎన్కౌంటర్లో రామ్గఢ్ SO సంజీవ్ దూబే నేరస్థుల కాల్పుల్లో మరణించారు. గ్రామీణ ASP అనుజ్ చౌదరికి బుల్లెట్ తగిలింది. అదృష్టవశాత్తూ, బుల్లెట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లో గుచ్చుకుంది. ఈ ఎన్కౌంటర్లో నేరస్థుడు నరేష్ ను చంపేశారు. అక్టోబర్ 5వ తేదీ రాత్రి, ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లో పోలీసులు ఇమ్రాన్ అనే నేరస్థుడిని ఎనౌకౌంటర్లో చంపారు. ఇమ్రాన్ తలపై ఇప్పటికే లక్ష రూపాయల రివార్డు ఉంది. 13 దోపిడీ కేసుల్లో నిందితుడు.

యూపీలో ఆపరేషన్ ఖల్లాస్..

ముజఫర్ నగర్ లో పోలీసులు వరుసగా రెండు ఎన్ కౌంటర్లు నిర్వహించారు. మొదట, లక్ష రూపాయల రివార్డు ఉన్న నేరస్థుడు మెహతాబన్ను పోలీసులు ఎన్ కౌంటర్లో చంపారు. మెహతాబ్ 18కి పైగా దోపిడీ కేసుల్లో వాంటెడ్గా ఉన్నాడు. లక్ష రూపాయల రివార్డును ప్రకటించిన మరో నేరస్థుడు నయీమ్ ఖురేషిని కూడా పోలీసులు చంపారు. ఖురేషి ఆరు హత్య, 20 దోపిడీ కేసుల్లో పరారీలో ఉన్నాడు. ఒకవైపు సీఎం యోగి ఆదేశాల మేరకు ఆపరేషన్ ఖల్లాస్ ప్రారంభించి నలుగురు కరుడుగట్టిన నేరస్థులను హతమార్చారు. మరోవైపు లక్నోలో జరిగిన ఎన్కౌంటర్లో అత్యాచార నిందితుడు హతమయ్యాడు. ఘజియాబాద్లో హత్య నిందితుడి కాలికి కాల్పులు జరిగాయి. షామ్లీలో ఒక ఆవు స్మగ్లర్ను కాల్చి చంపగా, ఝాన్సీలో వాంటెడ్ క్రిమినల్ను కాల్చి చంపారు. బులంద్ షహర్లో జరిగిన ఎన్కౌంటర్లో అత్యాచార నిందితుడు మృతి చెందగా, బాగ్పత్లో దోపిడీ నిందితుడిని అరెస్టు చేశారు. జైలు నుంచి తప్పించుకున్న నేరస్థుడిని బల్లియాలో దొంగతనం కేసులో నిందితుడిని ఆగ్రాలో, దోపిడీ నిందితుడిని జలౌన్లో ఎన్కౌంటర్ చేశారు. ఆపరేషన్ లాంగ్డా కింద.. మీరట్ లో వస్త్ర వ్యాపారి ఆదిల్ను కాల్చి చంపి వీడియోను వైరల్ చేసిన నిందితుడు జుల్కమరు కూడా ఎన్ కౌంటర్ చేశారు.

14 వేల మంది ఎన్ కౌంటర్.. 30 వేల నేరస్థులు అరెస్టు..

ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ సీఎం గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గణాంకాల ప్రకారం.. 2017 నుంచి ఉత్తరప్రదేశ్లో పోలీసు ఎన్ కౌంటర్లలో 239 మంది నేరస్థులు మరణించారు. ఇదే కాలంలో, 9,467 మంది నేరస్థులు గాయపడ్డారు. ఎన్కౌంటర్ తర్వాత 30,694 మంది నేరస్థులను అరెస్టు చేశారు. గత ఎనిమిది సంవత్సరాలలో పోలీసులు, నేరస్థుల మధ్య 14,973 ఎన్కౌంటర్లు జరిగాయి. మీరట్ జోన్లో అత్యధిక సంఖ్యలో ఎన్ కౌంటర్లు జరిగాయి. ఇక 2018 జూలై వరకు రాష్ట్రంలో 3026 ఎన్‌కౌంటర్లు జరిగాయి. అందులో 78 మంది నేరస్తులు చనిపోయారు. 838 మంది గాయపడ్డాడు. 7043 మంది క్రిమినల్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నేరచరిత్ర ఉన్న 11,981 మంది బెయిల్ రద్దు చేసి వారిని కోర్టుల్లో హాజరుపరిచారు. ఇక ఈ వరుస ఎన్ కౌంటర్ సందర్బంలో ముగ్గురు పోలీసులు మరణించారు. అయినా పోలీసులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఉత్తరప్రదేశ్ లో రౌడీలు ఉండకూడదని, ఉంటే జైల్లోనే ఉండాలని పోలీసు అధికారులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

యూపీలో అతిక్ అహ్మద్ మాఫియాను లేపేసిన యోగీ సర్కార్…

ఇక యూపీలో అతిక్ అహ్మాద్ అనే ఒక గ్యాంగ్ స్టార్ రాష్ట్ర చరిత్రలో ఒక పెద్ద మాఫియాగా మారింది. దీంతో యోగి సర్కర్ అతిక్‌ మాఫియాపై ఉక్కుపాదం అతడికి చెందిన 350 కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అతిక్, అతని అనుచరులు బలవంతంగా ఆక్రమించుకున్న 751 కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించింది ప్రభుత్వం. మొత్తం మీద నేరగాళ్లకు సింహస్వప్నంగా మారిన యోగి సర్కార్ మాఫియా ముఠాలను కూకటివేళ్లతో పెకిలించేందుకు దూకుడు ప్రదర్శిస్తోంది. ఇది ఇక ముందు కూడా కొనసాగే అవకాశం ఉంది.

రోజుకు 6 ఎన్ కౌంటర్లు..!

ఇక గతంలో రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం సాధించిన ఘనతను ప్రజలకు తెలియజేసేందుకు మొత్తం రికార్డులను పరిశీలించి, క్రోడీకరించగా ఈ లెక్కలు వెలుగులోకి వచ్చాయి. వాటి సగటును పరిశీలిస్తే 16 నెలల కాలంలో రోజుకు ఆరు ఎన్‌కౌంటర్లు జరిగినట్టు లెక్క. సగటున వారానికి ఒక క్రిమినల్ బుల్లెట్లకు బలయ్యాడు. దీంతో యూపీలో యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తర్వాత నేరాలు తగ్గుముఖం పట్టాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. యోగి కాషాయ వస్త్ర ధారణలో గన్ చేతపట్టుకొని పక్కన ఆవుతో నిలబడి ఉన్న జిలా గోరఖ్ పూర్ మూవీ పోస్టర్ గతేడాది సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. యోగి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *