ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైసీపీ (YCP) హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సిట్ (Sit) అధికారులు సోదాలు నిర్వహించి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కెసిరెడ్డి (Raj Kasireddy) సూచన మేరకు 12 బాక్సుల్లో భద్రపరిచిన రూ.11కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు.
ఇక విషయంలోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంది. ఏపీ లిక్కర్ స్కాం (AP Liquor Scam) కేసులో కీలక మలుపు తీసుకుంది. ఏ40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్లో సిట్ అధికారుల దాడులు చేశారు. ఏ1గా ఉన్న రాజ్ కెసిరెడ్డి ఆదేశాలతో వరుణ్, చాణక్య 12 పెట్టెలలో రూ.11 కోట్లు దాచినట్టు అంగీకరించడంతో.. శంషాబాద్ మండలంలోని కాచారం ఫార్మ్ హౌస్లో దాడులు చేసిన సిట్.. రూ.11 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. 2024 జూన్లో ఈ మొత్తం దాచినట్టు పేర్కొన్నారు అధికారులు.. మరోవైపు, మద్యం కేసులో కీలక నిందితుడు వరుణ్ ను అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు తెలిపారు.

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ (Shamshabad) మండలం కాచారంలోని సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్‌లో అక్రమ మద్యం నగదు డంప్‌ను అధికారులు గుర్తించారు. లిక్కర్‌స్కామ్‌లో ఏ-40 వరుణ్ పురుషోత్తం నోట సంచలన నిజాలు బయటికొచ్చాయి. అతని వాంగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారులకు భారీగా నగదు పట్టుబడింది. నగదు సీజ్ ఘటనలో చాణక్య, వినయ్ పాత్రపైనా సిట్ బృందం విచారణ చేపట్టింది. మొత్తంగా చూసుకుంటే ఏపీ లిక్కర్ స్కామ్లో మరో అరెస్ట్ జరిగింది.