Yamuna River : ఢిల్లీ (Delhi)లో యమునా నది (Yamuna River) నీటి ప్రవాహం (Water Level) డేంజర్ లో (Danger Mark)ప్రవహిస్తుంది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో యుమునా నది ప్రవాహం ఆదివారం మరోసారి ప్రమాదకర స్థాయి (205.81 మీటర్లు)ని దాటింది. దీంతో మరోసారి ఢిల్లీలో పలు ప్రాంతాల్లో వరదలు తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఢిల్లీ లోని పాత రైల్వే బ్రిడ్జి (Old Railway Bridge) వద్ద యమునా నది నీటిమట్టం 204.50 మీటర్ల ప్రమాద స్థాయిని దాటింది. గురువారం ఉదయం 8 గంటల సమయానికి నదిలో నీటి మట్టం 204.88 మీటర్లుగా ఉందని అధికారులు తెలిపారు.

ఆదివారం సాయంత్రం 6 గంటలకు యమున నీటిమట్టం 206.35 మీటర్లుగా చేరుకునే అవకాశం ఉందని అంచనా.. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హతికుండ్ బ్యారేజ్ నుంచి నదిలోకి నీటిని విడుదల చేశారు. దీంతో యమునా నదిలో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇక ఇప్పటికే.. దేశ రాజధాని ఢిల్లీలో.. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక, పునరావాస కార్యక్రమాలపై ఇది ప్రభావం చూపించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ‘హతిుకుండ్ బ్యారేజ్ నుంచి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం వల్ల ఢిల్లీలోని కొని ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉను వారినిసురక్షిత ప్రాంతాలకుతరలించారు.

హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా సహా యమునా ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు తలెత్తాయి. వరదల కారణంగా 27,000 మందికి పైగా ప్రజలు తమ ఇండ్లను ఖాళీ చేసినట్టు అధికారులు తెలిపారు. యమునా నదిలో నీటి విడుదల పెరగడంతో గౌతమ్ బుద్ధ నగర్ పరిపాలన హిందోన్ వెంబడి లోతట్టు ప్రాంతాలకు వరద హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు.