Xi Jinping Under House Arrest ?
  • జిన్ పింగ్ పాలనతో చైనా సైన్యం తిరుగుబాటుకు కారణం ఏంటి..?
  • మే 21 నుంచి బాహ్య ప్రపంచానికి కనిపించని జిన్ పింగ్ …
  • కమ్యూనిస్ట్ పార్టీకి.. చైనా సైన్యానికి పొసగడం లేదా..?
  • చైనా సైన్యంలో సీనియర్ అధికారులు తొలగింపు..?
  • జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా సైన్యంలో అసంతృప్తి ఏర్పడిందా.. ?
  • మరి కొన్ని రోజుల్లో చైనాలో కమ్యూనిస్ట్ పార్టీకి ఎదురు దెబ్బ తగలనుందా..?
  • జిన్ పింగ్ ను గద్దె దించేందుకు చైనా సైన్యం సంసిద్ధం అయ్యిందా..?

చైనా… (China) భారత్ (India) పొరుగు దేశం చైనాలో ఏం జరుగుతుంది అని ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది. సైనిక తిరుగుబాటు (A military coup) జరిగిందా… జిన్ పింగ్ గృహ నిర్బంధంలో ఉన్నారు అనేది ఎవరికి అర్థం అవ్వడం లేదు. తాజాగా చైనాలో సైన్యం తిరుగుబాటుకు సిద్దం అయ్యిందని.. దీంతో జిన్‌పింగ్ (Xi Jinping) గృహ నిర్బంధంలో ఉన్నట్లు సోషల్ మీడియాలో (Social media) పోస్ట్ తెగ వైరల్ అవుతున్నాయి. మరి నిజంగా చైనాలో సైన్యం తిరుగుబాటుకు సిద్ధం అయిందా లేదా అని ఇప్పుడు తెలుసుకుందాం రండి.

చైనాలో ఏం జరుగుతోంది..?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డ్రాగన్ కంట్రీ చైనా గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ఆ దేశంలో ఏం జరుగుతుంది అని ప్రపంచ దేశాలు ఆరా తీస్తున్నాయి. చైనా సైన్యంలోని అధికారులు ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మధ్య సంబంధాలు దూరమైనట్లు సమాచారం. ఈ మే 21 నుంచి జూన్ 5 వరకు జిన్‌పింగ్‌ ఎవరికీ కనిపించకుండా అదృశ్యమయ్యారు. ఆయనపై తిరుగుబాటు మొదలైనట్లు ప్రచారం నడుస్తోంది.

అధ్యక్షుడు జిన్ పింగ్ ని చైనా సైన్యం గృహ నిర్బంధం చేసిందా..?

ఇటీవలే కాశ్మీర్ (Kashmir) లోని పహల్గాం ఉగ్రదాడి (Pahalgam terror attack) తర్వాత భారత్ – పాకిస్థాన్ (Pakistan) మధ్య జరిగిన ఉద్రిక్తల పరిస్థితుల నెల కొన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ – భారత్ పై ఉగ్రదాడికి పల్పడిన సమయంలో చైనా దేశం పాకిస్థాన్‌కు అండగా నిలిచి పాక్ తరఫున భారత్ పై దాడికి దిగింది. పాకిస్థాన్ కు చైనా డ్రోన్లు పంపించి ఆ డ్రోన్లతో పాక్‌ – భారత్‌ (Pakistan – India) పైకి దాడులకు పాల్పడింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు చైనా ఆయుద సాయం, ఆర్ధిక సాయం చేయడంతో అక్కడి పరిస్థితులు మారిపోయాయి. ఇదే కాకుండా… గతంలో కూడా పాకిస్తాన్ లో చైనా ప్రభుత్వం ఎకనామిక్ కారిడార్ నిర్మిస్తున్న సమయంలో చైనా కార్మికులపై పాక్ ఉగ్రవాదులు ఉగ్రదాడికి పాల్పడ్డారు. దీంతో అప్పట్లో చైనా ప్రభుత్వం (Chinese Govt ) సైతం పాక్ పై ఘాటుగా స్పందించి అయినప్పటికి చైనా తీరు మాత్రం మారలేదు. దీంతో మళ్లీ పాక్ కు చైనా ప్రభుత్వం అండగా నిలిచి భారత్ పై యుద్దానికి ఉసకొల్పుతోంది. ఆర్ధిక, ఆయుధ సాయం సైతం అందిస్తుంది. దీంతో చైనా సైన్యంలోని అధికారులు ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మధ్య సంబంధాలు దూరమైనట్లు తెలుస్తోంది. మే 21 నుంచి జూన్ 5 వరకు జిన్‌పింగ్‌ ఎవరికీ కనిపించకుండా అదృశ్యమయ్యారు.

అసలు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఎక్కడా..?

వాస్తవానికి ఇంత వరకు చైనా ప్రభుత్వం.. భారత్‌, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జిన్‌పింగ్‌ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అంతేకాదు గత రెండు వారాలుగా చైనా ప్రభుత్వ వార్తాపత్రిక లో కూడా ఆయన కనిపించలేదు. జిన్‌పింగ్‌కు సంబంధించి ఎలాంటి వార్తలు రాలేదు. ఇదిలా ఉంటే ఇంకో పక్క చైనా ప్రభుత్వం శుక్రవారం ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులను వాళ్ల పదవుల నుంచి తొలగించింది. అవినీతి ఆరోపణల కారణంగా ఈ అధికారులపై చర్యలు తీసుకున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. అవును నిజంగా… గత కొంత కాలంగా చైనాలోని అధికారిక మీడియాలో సైతం చైనా అధ్యక్షుడి గురంచి ఏ ఒక్క వార్త కూడా ప్రచురించలేదు. కథనాలు వెలువడలేదు. చైనా స్టేట్ కౌన్సిల్‌ 50 మందికి పైగా మంత్రులు, చాలామంది అధికారులు జూన్ 6, 2025న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమయంలో కూడా జిన్‌పింగ్ అక్కడ కనిపించలేదు.

నిజంగా.. చైనా సైన్యం తిరుగుబాటు చేస్తుందా..?

ఇటివలే జిన్‌పింగ్‌ గైర్హాజరిలో చైనా ప్రధాని లీ కెకియాంగ్, ఉప ప్రధాని హీ లిఫెంగ్ విదేశీ నాయకులతో సమావేశాలు నిర్వహించారు. ఇది జిన్‌పింగ్ స్థానాన్ని అనధికారికంగా భర్తీ చేయడానికి నడిపిస్తోందనే అభిప్రాయాలు ఉన్నాయి. చైనా మాజీ విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ (The Qin Gang) , మాజీ రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫు వాళ్ల పదవుల నుంచి తొలగించబడే ముందు ప్రజల నుంచి కనిపించకుండా పోయారు. దీంతో ఆయనపై అనుమానలకు తావు తీస్తుంది. దీంతో అధ్యక్షుడు (President) జిన్‌పింగ్‌ (Jinping)సైన్యం తిరుగుబాటుకు భయపడుతున్నారని, అందుకే ఈ చర్య తీసుకున్నట్లు చాలామంది నిపుణులు భావిస్తున్నారు. దీంతో చైనా సైన్యం నుంచి జిన్‌పింగ్‌కు తిరుగుబాటు మొదలైనట్లు ప్రచారం నడుస్తోంది. ఇక ఈ కథనం కేవలం జాతీయ నుంచి అంతర్జాతీయ (International) దాకా ప్రచురించిన కథనాలు ఆందారంగా మాత్రమే మేము ఈ స్పెషల్ స్టోరీ చేశాము.

Suresh

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *