ఫేమస్ రెజ్లింగ్ (Wrestling) లెజెండ్ హల్క్ హోగన్ (Hulk Hogan) గుండెపోటుతో మృతి చెందారు. 71 ఏళ్ళ ఈయన ఫ్లోరిడాలోని ఆయన నివాసంలో కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. 1980, 90లలో హోగన్ ఎన్నో ఛాంపియన్ షిప్ లను గెలుచుకున్నారు.
అమెరికన్ (America) ప్రొఫెషనల్ రెజ్లింగ్ దిగ్గజం హల్క్ హోగన్ (టెర్రీ జీన్ బోలియా) గురువారం (జూలై 24) ఫ్లోరిడాలోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. రెస్క్యూ సిబ్బంది వెంటనే క్లియర్వాటర్ (ఫ్లోరిడా) (Florida)లోని ఆయన ఇంటికి చేరి, హోగన్‌ను స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అక్కడే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని అతడి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు అధికారికంగా ప్రకటించారు. దీంతో అక్కడి స్థానిక మీడియా సంస్థలు ఆయనపై ప్రత్యేక కథనాల ప్రచురించాయి.
రెజ్జింగ్ లో ప్రపంచ గుర్తింపు..
ఇక రెజ్లింగ్‌లో ప్రపంచ స్థాయి రెజ్లర్‌గా గుర్తింపు పొంది ఎన్నో చాంఫియన్‌షిప్‌లు (Championships) సొంతం చేసుకున్న రెజ్లర్ దిగ్గజం హల్క్ హోగన్ కన్నుమూతపై ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రపంచ రెజ్లింగ్‌లో దిగ్గజ రెజ్లర్‌గా ఉన్న హల్క్ హోగన్ మృతితో రెజ్లింగ్ దిగ్గజాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి.
Also Read : Chiranjeevi Vice President : ఉపరాష్ట్రపతిగా మెగాస్టార్ చిరంజీవి..? మోదీ స్కెచ్ ఇదేనా..?
ఆరాధ్య దైవం ఇక లేరు..
ప్రపంచ రెజ్లింగ్ ప్రియుల ఆరాధ్య దైవం హల్క్ హోగన్ అసలు పేరు టెర్రీ జెనె బొల్లే. అమెరికాకు చెందిన టెర్రీ జెనె బొల్లే రెజ్లింగ్ రింగ్ (Wrestling ring) పేరు హల్క్ హోగన్. రింగ్ పేరును తన పేరుగా చేసుకున్న హల్క్ హోగన్ రెజ్లింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ప్రత్యర్థులను చిత్తు చేసి అనేక చాంఫియన్‌షిప్‌లు సొంతం చేసుకున్నాడు. బరిలో దిగాడంటే ప్రత్యర్థి చిత్తు చేస్తూ అనేక టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. అతడికి ప్రపంచవ్యాప్తంగా విశేష అభిమానులు ఉన్నారు. 1953, ఆగస్టు 11న జార్జియా రాష్ట్రంలోని ఆగస్టాలో జన్మించారు. అనంతరం 16వ ఏళ్లకు వచ్చేసరికి WWF (ప్రస్తుతం WWE)పై హల్క్ హోగన్‌కు ఆసక్తి ఏర్పడింది. రెజ్లింగ్‌పై ఆసక్తి పెంచుకున్న హల్క్ హోగన్ తరచూ రెజ్లింగ్ పోటీలు జరిగే ప్రాంతానికి వెళ్తుండేవాడు. 1977లో రెజ్లింగ్‌లోకి ప్రవేశించిన హల్క్ హోగన్ అనంతరం అనేక విజయాలు పొందాడు. ఇక అక్కడి నుంచి ప్రారంభమైన కెరీర్ అంతర్జాతీయ స్థాయిలో కొనసాగింది. 1980లో గ్రేటెస్ట్ ప్రొఫెషనల్ రెజ్లర్ లలో ఒకరిగా గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. ఇక హల్క్ హోగన్‌కు ముగ్గురు భార్యలు. లిండన్ క్లారిడ్జ్, జెన్నీఫర్ మెక్‌డేనియాల్, స్కై డైలీని వివాహం చేసుకున్నాడు. ఇద్దరితో విడిపోయిన హల్క్ హోగన్ మరణం వరకు స్కై డైలీతో కలిసి ఉన్నాడు. అతడికి ఇద్దరు సంతానం బ్రోక్ హోగన్, నిక్ హోగన్
Also Read : KA Paul on Nimisha Priya : నిమిషా ఉరి శిక్షను రద్దు చేయించిన కేఏ పాల్..!
రెజ్లింగ్ నుంచి విరామం..
ఇక కొన్నేళ్ల కిందట రెజ్లింగ్ నుంచి విరామం తీసుకుని సొంత పనులు చేసుకుంటున్న హల్క్ హోగన్ గుండెపోటుతో మృతి చెందడంతో రెజ్లింగ్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వేలాది మంది రెజ్లర్లకు ఆరాధ్య దైవంగా ఉన్న హల్క్ హోగన్ మృతి చెందడంతో తీవ్ర విషాదం ఏర్పడింది. అతడి మృతికి అమెరికా అధ్యక్షుడు (US President) డొనల్డ్ ట్రంప్ (Donald Trump) తోపాటు ప్రపంచ రెజ్లింగ్ దిగ్గజాలు కూడా స్పందిస్తూ సంతాపం ప్రకటించారు.
ట్రంప్ కు మద్దతు...

గతంలో అమెరికా ఎన్నికల్లో ట్రంప్ కు హోగన్ మద్దతు పలికారు. ఉత్సాహంగా ప్రచారం లో కూడా పాల్గొన్నారు. ఓ కార్యక్రమంలో షర్ట్ తీసి, టీషర్ట్ చించుకుంటూ ఉద్రేకంగా ప్రసంగించడం అక్కడున్న వారందర్నీ ఆకర్షించింది. ఆయన ప్రసంగం తర్వాత ఇతర సభ్యులతో పాటు ట్రంప్ కూడా నిల్చొని చప్పట్లతో హోగన్‌ను అభినందించారు. ఇటీవలే ఈయనకు హార్ట్ ఆపరేషన్ అయింది. దాని నుంచి ఆయన కోలుకుంటున్నారని హోగన్ భార్య స్కై డైలీ (Sky Daily) చెప్పారు. కానీ కొద్దిరోజుల్లోనే హార్ట్ అటాక్ (Heart attack) తో మరణించడంతో ఆయన అభిమానులను తీవ్రంగా కలిచివేసింది.