Bill Gates Andhra Visit : ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచ అధినేత బిల్‌గేట్స్ టూర్..
Bill Gates Andhra Visit : ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు వచ్చారు. సీయోల్ సౌత్ కొరియన్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు.
ఇక విషయంలోకి వెళ్తే..
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ కీలక భేటీ జరిగింది. గన్నవరంలో బిల్‌గేట్స్‌కు మంత్రులు నారా లోకేష్ (Minister Nara Lokesh), అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత (Vangalapudi Anitha), పలువురు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. బిల్‌గేట్స్ విమానం గన్నవరం చేరుకున్న తర్వాత ల్యాండింగ్ సమయంలో కొంత ఆందోళన నెలకొంది. ప్రతికూల వాతావరణంతో గన్నవరం (Gannavaram)లో విమానం ల్యాండ్ కాలేకపోయింది. దీంతో అరగంట పాటు పైలెట్లు విమానాన్ని గాలిలో చక్కర్లు కొట్టారు. పొగమంచు కారణనంగా విమానం ల్యాండ్ చేయలేకపోయారు. అనంతరం విమానం సురక్షితంగా ల్యాండ్ కాగా.. బిల్‌గేట్స్‌కు మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో అమరావతికి వెళ్లారు. సమావేశాల అనంతరం Bill Gates సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రం ద్వారా ప్రభుత్వం ఎలా రియల్ టైమ్ డేటాను ఉపయోగించి ప్రజాసేవలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తోందో సీఎం చంద్రబాబు వివరించారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సంక్షేమ పథకాల అమలులో RTGS ద్వారా సాధించిన ఫలితాలను గేట్స్‌కు తెలియజేశారు. డేటా ఆధారిత పాలనతో ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని సీఎం వివరించారు.
సంజీవని ప్రాజెక్టుకుపై భేటీ..!
అనంతరం సీఎం చంద్రబాబు (CM Chandrababu) నివాసం సమీపంలో ఉన్న సంజీవని ప్రాజెక్టుకు చేరుకుని అరటి రైతులతో బిల్ గేట్స్ సమావేశం అవుతారు.మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు.బిల్‌గేట్స్‌తో పాటు గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి బృందం సైతం గన్నవరం చేరుకుంది. ఈ ఫౌండేషన్ సాయంతో ఏపీలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టులు విస్తరించే అంశంపై వీరు చర్చించనున్నారు. అనంతరం ఆర్టీజీఎస్ కేంద్రానికి బిల్‌గేట్స్ వెళ్తారు. పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలిస్తారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై చంద్రబాబు నాయుడు వారికి వివరించనున్నారు. గేట్స్ ఫౌండేషన్ (Gates Foundation) సహకారంలో ఏపీలో సంజీవని ప్రాజెక్ట్ నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై బిల్‌గేట్స్‌కు చంద్రబాబు వివరిస్తారు.
విజన్ 2047 స్వర్ణాంధ్ర గా బాబు వ్యూహాం..!
గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల ప్రాజెక్టులను మరింత విస్తరించడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. ప్రత్యేకించి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో అమలవుతున్న సంజీవని ప్రాజెక్టు గురించి సీఎం చంద్రబాబు సవివరంగా వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. అలాగే, మెడ్‌టెక్, డయాగ్నస్టిక్స్ సేవలు, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్ వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాలను గేట్స్ బృందానికి ప్రజెంటేషన్ రూపంలో వివరించారు. ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య, సాంకేతిక ఆధారిత పరిపాలనలో చేపట్టిన సంస్కరణలు, భవిష్యత్ ప్రణాళికలను గేట్స్ ప్రశంసించారు. ముఖ్యంగా వ్యవసాయంలో సాంకేతిక సాగు, డేటా ఆధారిత పంటల నిర్వహణ, రైతుల ఆదాయాన్ని పెంచే విధానాలపై విస్తృత చర్చ జరిగింది.