Kadapa District : మొగుడు ముందే భార్య ఉరి.. వీడియో రికార్డ్ చేసిన భర్త.. కట్ చేస్తా..
క్షణికావేశంలో భార్య ఉరితాడుకు వేలాడుతుంటే.. ఆ కన్నెర్ర చేసిన భర్త కాపాడాల్సిన బాధ్యతను మరచిపోయాడు. పైగా ‘ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి’ అంటూ సూచనలు చేస్తూ తన మొబైల్ ఫోన్లో వీడియోస్ రికార్డ్ చేశారు. మరి ఉరి వేసుకున్న మహిళ బతికిందా.. అసలు భార్త ఆ ఉరి వీడియోలు ఎందుకు తీశారు. ఏమైనా ఫ్రాంక్ చేశాడా.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి.
ఇక విషయంలోకి వెళ్తే…
సాధారణంగా భార్య, భర్తల మధ్య గొడవలు జరగడం సాధారణమే. తిట్టుకుంటు, ప్రేమగా కొట్టుకుంటు ఉండటం చాలా మంది జీవితాలను ముందుగు సాగిస్తున్నారు. ఇక ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు అనేక కుటుంబాలలో కన్నీరుని మిగిల్చాయి. గొడవ జరిగిన తర్వాత ఆగ్రహావేశాలకు లోనై ఉరివేసుకొని అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాంటిదే ఇప్పుడు కడప జిల్లా రాజంపేటలో కూడా జరిగింది. రాజంపేట మండలం బోయినపల్లి గ్రామానికి చెందిన శ్రీరామ్ శ్రీనివాస్ రైల్వేలో లోకో పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతనికి కృష్ణవేణితో వివాహమైంది. కొంతకాలంగా ఈ దంపతుల మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. తరచూ గొడవ పడటం, ఆ తర్వాత కలిసిపోవడం వాళ్లకి పరిపాటిగా మారిందని స్థానికులు చెబుతున్నారు.
ప్రాణం తీసిన సరదా..!
ఈ క్రమంలోనే గురువారం కూడా దంపతుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రతిరోజు గొడవపడటం తర్వాత మామూలుగా ఉండటం సర్వసాధారణమే అనుకున్నారు స్థానికులు కూడా… అయితే ఈసారి విధి వికటించింది. ఉరి వేసుకుంటానని భర్తతో గొడవ పడిన భార్య కృష్ణవేణి ఈసారి నిజంగానే ఉరి వేసుకుంది. అదేదో ఎవరు లేని సమయంలో అయితే అసలే కాదు.. నేరుగా కట్టుకున్న భర్త ముందే భార్య ఉరి వేసుకుంది. అయితే ఆ ఉరి వేసుకునే సమయంలో భర్త శ్రీరామ్ శ్రీనివాస్ అక్కడే ఉండి కూడా ఉరి వేసుకుంటున్న భార్యని కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. పైగా ఉరి అలా కాదు ఇలా వేసుకోవాలి అంటూ తనకు సూచనలు చేస్తూ వీడియో రికార్డు చేశాడు. ఇక సరాదాగా భావించి తన భార్యను కాపాడుకోలేకపోయాడా లేక కావాలని ఆమెను ఉరిని ప్రేరేపించాడా అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక కృష్ణవేణి మృతిపై ఆమె బంధువులు ఆగ్రహావేశాలకు లోనై శ్రీరామ్‌పై దాడికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అయితే కృష్ణవేణి మృతికి ఆమె భర్తే కారణమని అతని శిక్షించాలని వారు పట్టుబడ్డారు. దీంతో పోలీసులు ఇతనిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఉరి వేసుకుంటుంటే కనీసం ఆపకపోగా చిత్రీకరించిన భర్త శ్రీరామ్ శ్రీనివాసులపై స్థానికులు మండిపడుతున్నారు.