బ్రహ్మకమలం.. ఈ పుష్పాన్ని దేశంలో చాలా మంది చూడి ఉండక పోవచ్చు. ఎందుకంటే ఈ పువ్వు హిమలయాల్లో తప్ప మరెక్కడ పూయదు. చాలా అరుదుగా కొన్నిప్రదేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. వాస్తవానికి ఈ పుష్పం భారత దేశంపు తమాలిక అయిన ఆ శ్వేత వర్ణపర్వాత్లో పూసే దేవ దేవ కమలం. ఈ పువ్వుకు ఖగోళ పుష్పం అని కూడా పిలుస్తారు. సంవత్సరంలో ఒకసారి మాత్రమే అది కూడా ఒక రాత్రి మాత్రమే వికసిస్తుంది. ఇక ఆ పువ్వు ఈ అనంత విశ్వానికి సృష్టికర్తగా పరిగణించే ఆ బ్రహ్మ దైవిక జననానికి సాక్షిగా బ్రహ్మకమలాన్ని పిలుస్తారు. ఈ అరుదైన బ్రహ్మకమలం సంవత్సరంలో ఒక రాత్రి మాత్రమే వికసిస్తుంది. అది కూడా ప్రకృతికి భిన్నంగా.. రాత్రి సమయంలో మాత్రమే వికసించి సూర్యోదయం రాగానే వాడిపోతుంది. ఈ పుష్పం అనేక ఔషధ లక్షణాలను కూడా కలిగి ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

నిజానికి హిమాలయాలలో పుసే ఈ బ్రహ్మ కమలం కు ప్రతి ఏడాది అక్కడి స్థానిక ప్రజలు ఓ ప్రత్యేకమైన వేడుక జరుపుకుంటారు. బ్రహ్మ కమలం వికసించే సమయంలో వారు నృత్యాలు చేస్తూ ఆటపాటలతో సంబరాలు చేసుకుంటారట. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విశ్వాసం ఏమిటంటే.. బ్రహ్మ కమలం వికసించినప్పుడు, ఎవరైతే తమ మనసులోని కోరికలు ఆ పుష్పానికి చెప్పుకుంటారో వారి కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు.

ఇక విషయంలోకి వెళ్తే.. చాలా మందికి ఈ బ్రహ్మకమలం రహస్యా తెలియదు. చాలా వరకు సినిమాల్లో తప్ప, మరేక్కొడా ఈ పువ్వును చూసి ఉండరు. నిజానికి.. బ్రహ్మ కమలం ఆధ్యాత్మిక శక్తికి, పవిత్రతకు గొప్ప గుర్తు అని పండితులు చెబుతుంటారు. చాలా మంది హిందూవులు ఈ పువ్వును చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ పువ్వు హిమాలయాల నుంచి వచ్చింది. ఇది మన మనసును శుభ్రం చేసి మంచి ఆలోచనలు, శక్తిని పెంచుతుందని నమ్ముతారు. ఇదే కాకుండా.. ఈ బ్రహ్మ కమలం దేవుడి శక్తికి, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు చిహ్నం అని చెబుతుంటారు. ఈ పువ్వు సంవత్సరానికి ఒక్కసారే అది కూడా రాత్రిపూట మాత్రమే వికసిస్తుంది. ప్రకృతిలో అన్ని పువ్వులు ఉదయం సమయంలో వికసిస్తే.. ఈ పువ్వు మాత్రం రాత్రి సమయంలో మాత్రమే వికసిస్తుంది. కాగా ప్రస్తుత బిజీ ప్రపంచంలో మన ఇళ్లలో బ్రహ్మ కమలం ఉండటం చాలా అవసరం అని వాస్తు శాస్త్రం కూడా చెబుతోంది. అదే కాకుండా విష్ణువు, దుర్గాదేవి, శివుడు వంటి దేవతల పూజలో ఈ పువ్వును వాడటం మంచిది. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ధ్యానం చేసేటప్పుడు ఈ పువ్వును దగ్గర ఉంచుకుంటే గత కర్మ బంధాలు తొలగిపోతాయి అని విశ్వసిస్తారు. ఏదైనా ముఖ్యమైన పని చేసేటప్పుడు లేదా ఆధ్యాత్మిక సాధన చేసేటప్పుడు ఈ పువ్వును పక్కన ఉంచుకుంటే మనసు స్థిరంగా ఉంటుంది. బ్రహ్మ కమలం ఒక పువ్వు మాత్రమే కాదు.. ఈ పువ్వుకు మన మనసులోని కోరికలను, ప్రార్థనలను అర్థం చేసుకోగల శక్తి ఉందని చాలా మంది విశ్వసిస్తారు.
ఒక సారి ఈ బ్రహ్మ కమలపు ఆధ్యాత్మిక మూలం ఏంటో తెలుసుకుందా రండి.
పురాణాల ప్రకారం.. బ్రహ్మదేవుడు ఈ పువ్వును ధరించేవారు. ఇది ప్రశాంతంగా వికసించడం వల్ల నిజమైన సంతోషం బయట ప్రపంచంలో కాకుండా మన లోపలే ఉందని అర్థం చేసుకోవాలి. ఇంట్లో బ్రహ్మ కమలం ఉంటే ఆ ఇంటి వాతావరణం వెంటనే మారిపోతుంది. ఇది మనసుకు శాంతిని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఇంట్లో మంచి శక్తిని ఆకర్షిస్తుంది. బ్రహ్మ కమలం ఇంట్లో ఉన్నప్పుడు చెడు శక్తిని దూరం చేసి మనకు రక్షణ ఇస్తుంది. ఇది మనసులోని భారాన్ని తగ్గిస్తుంది. ధ్యానం చేసేటప్పుడు మనసును స్థిరంగా ఉంచుతుంది. ఈ పువ్వు ఇంట్లో ఉన్నవారికి మంచి నిద్ర, స్పష్టమైన ఆలోచనలు, ప్రశాంతమైన మనసు లభిస్తాయి. ఈ పువ్వు వల్ల.. గ్రహాల ప్రభావం వల్ల మార్పులు జరుగుతాయట. ఈ బ్రహ్మ కమలం వల్ల.. రాహువు ప్రభావం వల్ల కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది అని చెబుతున్నారు. ఇదే సమయంలో.. బ్రహ్మ కమలం మన ఆలోచనలను అదుపులో ఉంచి, శాంతిని ఇస్తుంది. కేతువు ప్రభావం వల్ల మనలోని అహంకారం తగ్గుతుంది. ఈ మార్పునకు బ్రహ్మ కమలం సహాయపడుతుంది. శని ప్రభావం వల్ల కష్టమైన భావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో బ్రహ్మ కమలం శక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుంది.

హైదరాబాద్ లో బ్రహ్మకలమ పుష్ఫాలు..
ప్రస్తుతం ఈ పువ్వులు హిమాలయాల్లోనే కాదు.. హైదరాబాద్ లో కూడా ఉన్నాయి. హైదరాబాద్ లోని సైదాబాద్ కాలనీకి చెందిన అలిగ విద్యానంద్-చందన దంపతుల ఇంట్లో బ్రహ్మకమలం పుష్పం వికసించింది. 2024 లో ఇదే మొక్కకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 26 పుష్పాలు విరబూసాయి. ఇక 2023 లో దాదాపు 31 పుష్పాలు వికశించాయి.
King of Himalayan flower
ఈ బ్రహ్మ కమలం మొక్కను King of Himalayan flower అని అంటారు. ఈ మొక్క పై ఆకులే పువ్వుగా రూపాంతరం చెందుతాయి. హిమాలయ పర్వాత శ్రేణుల్లో.. అంటే నేపాల్, ఉత్తరాఖండ్, కేధార్ ఖండ్, టిబెట్, ఉత్తర బర్మా వంటి ప్రదేశాల్లో పుస్తుంది. ఉత్తరాఖండ్ లో ఈ బ్రహ్మ కమలం పుష్పాలను చూసేందుకు.. ప్రతి ఏడా యాత్రలు కూడా జరుగుతుంటాయి.