అంతరిక్షం.. మానవ మేధస్సుకు అందనివి అనంత శూన్య ప్రపంచం. భవిష్యత్తులో అంతరిక్ష జీవనం మనకు ఎంతవరకు సానుకూలంగా ఉంటుందనే విషయంపై వివిధ దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి. రష్యా కూడా అందులో ముందువరుసలో ఉంది. తాజాగా రష్యా అంతరిక్షంలోకి ఎలుకలను పంపుతోంది. ఎలుకలతో పాటు ఈగలను కూడా పంపిస్తోంది. కాస్మిక్ రేడియేషన్ ప్రభావం జీవులపై ఎలా ఉంటుందో తెలిపేందుకే ఈ ప్రయోగం చేపడుతున్నట్టు రష్యా ప్రకటించింది.

ఇక విషయంలోకి వెళ్తే..
రష్యా మరో అద్భుతం సృష్టించింది. ఈగలను, ఎలుకలను అంతరిక్షంలోకి పంపి విజయవంతంగా వాటిని వెనక్కి తీసుకొచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. రష్యాకు చెందిన బయోలాజికల్ రీసెర్చ్ ఉపగ్రహం 30 రోజుల అంతరిక్ష ప్రయాణాన్ని పూర్తి చేసి సెప్టెంబర్ 19న సురక్షితంగా భూమిపైకి తిరిగొచ్చింది. అయితే ఈ మిషన్‌లో 75 ఎలుకలు, 1500పైగా ఈగలతో పాటు మొక్కల విత్తనాలు, సూక్ష్మజీవులను పంపించారు. వీటిలో 65 ఎలుకలు వెనక్కి తిరిగిరాగా మిగిలినవి మృతి చెందాయి.

కజకిస్తాన్ నుంచి ప్రయోగం..
సోయిజ్ 2.1 బీ రాకెట్ ద్వారా ఈ శాటిలైట్ కజకిస్థాన్‌లోని బైకోనూర్ కాస్మోడ్రోమ్ ప్రాంతం నుంచి ఆగస్టు 20న నింగిలోకి పంపించింది. రష్యా అంతరిక్ష సంస్థ రాస్ కాస్మోస్. లాంఛింగ్ తర్వాత ఈ ఎయిర్ క్రాఫ్ట్ పోలార్ ఆర్బిట్ 230 నుంచి 236 మైల్స్ వద్ద కక్ష్యలోకి ప్రవేశించింది. 97 డిగ్రీల ఇన్ క్లినేషన్ వద్ద బయోన్- ఎం నెం. 2 పే లోడ్ లో తీసుకెళ్లిన స్పెసిమెన్స్ ను హై లెవెల్ కాస్మిక్ రేడియేషన్ ముందు ఉంచారు. వాడి నాడీ వ్యవస్థలను పరిశీలించారు.

అంతరిక్షంలో ప్రయోగం దశలు..
ఈ మిషన్ భూమిపైకి చేరుకున్నాక అంతరిక్ష ప్రయాణంలో వాటి నాడి వ్యవస్థలపై ప్రభావాన్ని గుర్తించేందుకు ఎలుకలు, ఈగలను పరిశీలించారు. ఈ శాస్త్రీయ కార్యక్రమాన్ని మొత్తం 10 విభాగాలుగా విభజించారు. మొదటి రెండు విభాగాలు జంతువులపై గురత్వాకర్షణ, రేడియేషన్ ప్రభావాలు అధ్యయనం చేయనున్నాయి. మూడు నుంచి ఐదు విభాగాలు మొక్కలు, సూక్ష్మజీవులను పరిశీలించనున్నాయి. ఆరు నుంచి తొమ్మిది విభాగాలు బయోటెక్నాలజీ, రెడియేషన్ రక్షణ, కొత్త సాంకేతికతను పరీక్షించనున్నాయి. ఇక పదవ విభాగాన్ని రష్యా, బెలారస్ నుంచి వచ్చిన విద్యార్థుల ప్రయోగాలకు కేటాయించారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే రష్యా ఉల్కాపతం ప్రయోగాన్ని కూడా నిర్వహించింది. ఈ ప్రయోగంలో భూమిపైకి జీవం అంతరిక్ష నుంచి వచ్చి ఉండొచ్చనే అంశంపై పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే రష్యా కూడా త్వరలో మనుషులను అంత క్షంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

1957 లో లైక కుక్క స్పుత్నిక్ అంతరిక్ష యాత్ర..
రష్యాకు జంతువులను అంతరిక్షంలోకి పంపడంలో ఇదేం తొలి సారి కాదు.. రష్యాకు ఇటువంటి ప్రయోగాలపైన సుదీర్ఘ చరిత్ర ఉంది. 1957లోనే లైకా అనే కుక్కను స్పుత్నిక్ 2 ద్వారా అంతరిక్షంలోకి పంపించింది రష్యా. భూమి చుట్టూ కక్ష్యలోకి వచ్చిన మొదటి జీవిగా లైకా గుర్తింపు పొందింది. భూమి వాతావరణం దాటి జీవం యొక్క మనుగడను పరీక్షించడానికి కుక్కలు, కోతులు, ఇతర చిన్న జంతువులను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. తాజాగా ఈగలు, ఎలుకలతో ప్రయోగం మొదలవుతోంది. ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన తర్వాత రోస్కో స్మోస్ కి కేటాయించే నిధులు తగ్గిపోయాయి. అదే సమయంలో అంతర్జాతీయ సహకారం కూడా స్తంభించింది. అయినా కూడా జీవ అంతరిక్ష పరిశోధనలో కీలక పాత్ర పోషించాలనే రష్యా అశను ఈ ప్రయోగం ప్రతిబింబిస్తుందని అంటున్నారు.
