Water leakage in Srisailam project..

  • డేంజర్ జోన్ లో శ్రీశైలం..
  • శ్రీశైలంలో క్షణం క్షణం.. భయం భయం..
  • శ్రీశైలం ప్రాజెక్టు కింద పగుళ్లు.. మరో వైపు వాటర్ లీకేజ్..!
  • శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉన్న నాయకులు పట్టించుకోరా..?
  • ప్రాజెక్టు కింద ఉన్న ఆ గొయ్యిని పూడ్చేది ఎప్పుడు..?
  • డ్యాం నుంచి లీక్ అవుతున్న వాటర్ ను ఆపేదెవరు..
  • శ్రీశైలం డ్యామ్ ను రక్షించేది ఎవరు..?
  • జాతీయ డ్యాం భద్రతా అథారిటీ సూచనలను ప్రభుత్వాలు పట్టించుకోవా..?
  • డ్యాం భద్రత పై తెలుగు రాష్ట్రాలకు పట్టింపు లేదా..?

శ్రీశైలం.. తెలుగు రాష్ట్రాల జీవ నాడి. గత మూడు నెలలుగా శ్రీశైలం డ్యాం డేంజర్ లో ఉందని BRK న్యూస్ ఛానెల్ (BRK News Channel) పలు కథనాలు ప్రచురించింది. శ్రీశైలం డ్యాం భద్రత విషయంలో ప్రభుత్వాలు ఎలా ముందుకు వెళ్తున్నాయో.. కుండ బద్దలు కొట్టినట్లు BRK న్యూస్ వెల్లడించిన విషయం తెలిసిందే. డ్యాం ప్రమాదంలో ఉంది అని ముందు నుంచి BRK న్యూస్ ఛానెల్ చెబుతునే ఉంది. ప్రస్తుతం BRK న్యూస్ చెప్పిందే జరిగింది. ప్రస్తుతం డ్యాం పరిస్థితి మరింత ప్రమాదంలోకి జారుకుంది.

ఇక విషయంలోకి వెళ్తే..

శ్రీశైలం డ్యామ్ లో (Srisailam Dam) ఏం జరుగుతుంది అని ఎవరైనా అయిగితే.. కృష్ణమ్మ పాల నూరగలు పొంగుతు పరవళ్ల తొక్కుతుంది అని అంటారా..? కానీ కాదు… శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల నుంచి, విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాంతాలన నుంచి నీరు లీకేజి జరుగుతుంది. ఏంటి నమ్మడం లేదా.. అయితే ఇది చూడండి.

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు..

శ్రీశైలం ప్రాజెక్టు.. నిజంగా శ్రీశైలం డ్యామ్ ప్రమాదంలో ఉందా..? అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టు రోజు రోజుకు ప్రమాదంపు అంచులకు కురుకుపోతుంది. అవును నిజంగా.. తెలుగు రాష్ట్రాలకు త్రాగు, సాగు నీరు, విద్యుత్ ని అందజేస్తున్న “నీలం సంజీవ రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు” (Neelam Sanjeeva Reddy) ప్రస్తుతం ప్రమాదపు అంచులో కొట్టుమిట్టాడుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో ఉందన్న విషయం ప్రభుత్వాలు తెలిసిన, ప్రాజెక్టుపై మాత్రం జాప్యం చేస్తున్నాయి. అయితే 15 సంవత్సరాల కిందట జరిగిన ప్రమాదమే… ఇప్పుడు మరింత ముప్పుగా మారింది. శ్రీశైలం జలాశయం పదో నంబర్ గేట్ వద్ద భారీగా వాటర్ లీకేజీ అవుతోంది. గత నెలలో ఈ గేటు వద్ద మరమ్మతులు నిర్వహించినప్పటికీ భారీగా నీరు లీకేజీ కావడం గమనార్హం. జలాశయం అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలా లీకేజీ జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. అది చిలికి చిలికి గాలివాన అయినట్లు.. ప్రస్తుతం ప్రమాదమే రేపు మహా ప్రళయంగా మారే అవకాశాలు ఉన్నాయి.

డేంజర్ లో పదో నెంబర్ గేట్..

ఇక విషయంలోకి వెళ్తే.. శ్రీశైలం జలాశయం (Srisailam Reservoir) పదో నంబర్ గేట్ వద్ద గత నెలలో అధికారులు రబ్బర్ సీల్స్ మార్చారు. వాటర్ లీకేజీ (Water leakage) కారణంగా మరమ్మతులు నిర్వహించారు. దీని కోసం ప్రభుత్వం.. సుమారు కోటి ముప్పై లక్షలు నిధులను కేటాయించింది. కానీ, తాజాగా మరోసారి అక్కడే వాటర్ లీకేజీ అవుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో, నాసిరకంగా పనులు చేసినట్టు తెలుస్తోంది. లీకేజీ కావడంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఇక, జలాశయం అధికారుల నిర్లక్ష్యంతో ఇలా జరిగిందని పలువురు ఆరోపణలు చేస్తున్నారు.

శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ లో లీకేజ్..

ఇక ఇదే కాకుండా.. శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో (Hydro Power Station) వాటర్ లీకేజీ అవుతోంది. ఒకటో యూనిట్ నుంచి వాటర్ లీక్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. జల విద్యుత్ కేంద్రంలో నిరంతరాయంగా విద్యుత్ ఉత్పాదనతో పాటు పంపు మోడ్ పద్ధతిలో శ్రీశైలం డ్యామ్ లోకి నీటి మళ్లింపు కొనసాగుతుంది. నీటి లీకేజీ జరుగుతున్న ప్రాంతంలో మరమ్మత్తులు చేపట్టకపోతే జీరో ఫ్లోర్ లాక్ పడిపోయే ప్రమాదం పొంచి ఉందని ఇంజినీర్లు చెబుతున్నారు. మరోవైపు వాటర్ లీక్ అవుతున్న ప్రాంతాన్ని హైదరాబాద్ విద్యుత్ సౌధ అధికారులు పరిశీలించారు. తక్షణమే పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని స్థానిక ఇంజినీర్లను వారు ఆదేశించారు.

ప్రస్తుతం శ్రీశైలం పరిస్థితి..

ఇదిలా ఉండగా.. శ్రీశైలం జలాశయానికి భారీ స్థాయిలో వరద కొనసాగుతోంది. జూరాల నుండి 1,09,277 క్యూసెక్కులు నీటి ప్రవాహం శ్రీశైల జలాశయానికి వచ్చి చేరుతోంది. సుంకేసుల నుండి 61,931 క్యూసెక్కులు నీరు వస్తోంది. ప్రస్తుతానికి శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లో 1,71,208 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 67,399 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 878.40 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు.. ప్రస్తుతం : 179.8995 టీఎంసీలుగా ఉంది. కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. జలాశయం గరిష్ట స్థాయికి చేరువలో ఉండటంతో గేట్లు ఎత్తే అవకాశం ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *