'Vyooham' movie producer Dasari Kiran arrested

హైదరాబాద్ : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాసరి కిరణ్‌ను హైదరాబాద్‌లో పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుగా తీసుకున్న రూ.5కోట్లు ఇవ్వమని అడిగినందుకు తమపై అనుచరులతో దాడిచేయించారని దంపతులు ఫిర్యాదు చేశారు.

ఇక విషయంలోకి వెళ్తే.. గతంలో రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ సినిమా కోసం టాలీవుడ్ నిర్మాత దాసరి కిరణ్‌‌ దాదాపు రూ. 5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. అప్పు ఇచ్చిన వాళ్లు.. తమ రూ.5కోట్లు ఇవ్వమని అడిగినందుకు తమపై అనుచరులతో దాడిచేయించారని దంతతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా డబ్బు మాకు తిరిగి ఇవ్వాలని మహేశ్ అనేక సార్లు అడిగినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఈనెల 18న విజయవాడలోని కిరణ్ కార్యాలయానికి మహేశ్, ఆయన భార్య వెళ్లారు. అక్కడ కిరణ్ అనుచరులు దాదాపు 15 మంది వారిపై దాడి చేశారు. దీంతో మహేశ్ విజయవాడ పటమట పోలీసులకు పిర్యాధు చేశారు. దీంతో దాసరి కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఆ 5 కోట్లపై కిరణ్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

‘జీనియస్’ ‘వంగవీటి’, ‘సిద్దార్థ్’ వంటి చిత్రాలను దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తీసిన ‘వ్యూహం’ చిత్రాన్ని దాసరి కిరణ్ నిర్మించిన సంగతి తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన టీటీడీ బోర్డు సభ్యులుగా కూడా పనిచేసారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *