కోలీవుడ్ (Kollywood) యాక్షన్ హీరో, విలక్షణ నటుడు విశాల్ (Vishal) తన పుట్టినరోజున అభిమానులకు తీపి కబురు అందించారు. తన ప్రేయసి, ప్రముఖ నటి సాయి ధన్సికతో ఆయన నిశ్చితార్థం శుక్రవారం ఘనంగా జరిగింది. చెన్నైలోని విశాల్ నివాసంలో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం ఈ జంట ఉంగరాలు మార్చుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే..
గత మే నెలలోనే తాము ప్రేమలో ఉన్న విషయాన్ని విశాల్, ధన్సిక (Vishal,Dhansika) అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి, విశాల్ పుట్టినరోజైన ఈరోజే వీరి వివాహం జరగాల్సి ఉంది. అయితే, విశాల్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నడిగర్ సంఘం (తమిళ నటీనటుల సంఘం) భవన నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ భవనం నిర్మాణం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని విశాల్ గతంలో ప్రకటించారు. ఆయన ప్రేయసి, ప్రముఖ నటి సాయి ధన్సికతో నిశ్చితార్థం శుక్రవారం చెన్నైలోని తన నివాసంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెద్దగా హంగు ఆర్భాటాలు లేకుండా జరిపిన ఈ కార్యక్రమం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు విశాల్ ప్లాన్ ప్రకారం, విశాల్ పుట్టినరోజైన (29-8-2025 ) రోజే పెళ్లి జరగాల్సి ఉందని సమాచారం. అయితే, విశాల్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నడిగర్ సంఘం (తమిళ నటీనటుల సంఘం) భవన నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ భవనం నిర్మాణం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని విశాల్ గతంలో ప్రకటించారు. ప్రస్తుతం విశాల్ వయసు 47 యేళ్లు. సాయి ధన్సిక ఏజ్ 35 సంవత్సరాలు కావడం గమనార్హం.
ఇక నటి సాయి ధన్సిక విషయానికొస్తే, జూనియర్ ఆర్టిస్ట్‌గా (Junior Artist) కెరీర్ ప్రారంభించి తన ప్రతిభతో ఎదిగారు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కబాలి’ చిత్రంలో ఆయన కూతురి పాత్రలో అద్భుతంగా నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆమెకు తమిళంతో పాటు తెలుగులోనూ వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇద్దరూ తమ కెరీర్‌లో బిజీగా ఉండగా, త్వరలోనే వీరి పెళ్లి తేదీని ప్రకటించే అవకాశం ఉంది.