Vijay Deverakonda : విజయ్ – రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్..! తొలి వెడ్డింగ్ కార్డ్ రేవంత్ రెడ్డికే..
విజయ్ వెడ్స్ రష్మిక..
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహంపై చాలా కాలంగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ జంట తమ పెళ్ళి గురించి అధికారిక ప్రకటన చేయనప్పటికీ- ఈ నెల 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వారి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రకటనపై వాళ్లిద్దరు స్పందించలేదు. కానీ ఇప్పుడు గా రూమర్స్ కి చెక్ పెట్టేశారు. వాళ్లు వీళ్లు చెప్పుడు కాదు.. ఏకంగా విజయ్ దేవర కొండనే స్వయంగా ఈ విజయాని మీడియాకు చెప్పేశారు. మరి ఆయన పెళ్లి ఎప్పుడు, మొదటి కార్డు ఎవరికి ఇచ్చారు.. అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందా రండి.
ఇక విషయంలోకి వెళ్తే..
టాలీవుడ్ హిట్ పెయిర్స్‌లో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటకు ఉన్న క్రేజే వేరు. ఆన్‌స్క్రీన్‌పైనే కాదు, ఆఫ్‌స్క్రీన్‌లోనూ వీళ్లిద్దరి కెమిస్ట్రీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ ఎప్పటి నుంచో వార్తలొస్తున్నా.. అటు విజయ్ గానీ, ఇటు రష్మిక గానీ ఇప్పటివరకూ అఫీషియల్‌గా స్పందించలేదు. అయితే తాజాగా బయటికి వచ్చిన కొన్ని ఆసక్తికరమైన లీక్స్ చూస్తుంటే.. ఈ జంట పెళ్లి పీటలు ఎక్కడానికి సైలెంట్‌గా రెడీ అయిపోయినట్లే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వీరి వెడ్డింగ్ డేట్ గురించి ఒక రూమర్ కూడా చక్కర్లు కొడుతోంది. అయితే ఇది ఆఫిషల్ గానే విజయ్ దేవకొండ , రష్మిక పెళ్లి చేసుకోబోతున్నాట్లు ఆ కార్డు చూస్తే అర్ధం అవుతుంది. అందుకు ప్రస్తుతం విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో అవుతుంది. ఇగ పెళ్లికి అతిథులను ఆహ్వానిస్తున్నారు విజయ్ దేవకొండ , రష్మిక జంట. వీరి వివాహం ఫిబ్రవరి 26న గ్రాండ్ గా జరగనుంది. అత్యంత సన్నిహితుల మధ్య విజయ్ దేవకొండ, రష్మిక పెళ్లి జరగనుందని తెలుస్తుంది. కాగా మార్చి 4న తాజ్ కృష్ణలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.
ముహూర్తం ఖరారు.. వెన్యూ ఎక్కడంటే..?
సోషల్ మీడియాలో, ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరి 26న విజయ్ – రష్మిక ఒక్కటి కాబోతున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌ను ఫిక్స్ చేశారట. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక చాలా గ్రాండ్‌గా, కానీ ప్రైవేట్‌గా జరగనుందట. వెడ్డింగ్ తర్వాత మార్చి 4న హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కన్వెన్షన్ సెంటర్‌లో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యే ఛాన్స్ ఉంది. రీసెంట్‌గా విజయ్ దేవరకొండ తెలంగాణ CM రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశాడు. ఆ ఫొటోలు బయటకొచ్చిన కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయ్యాయి. అయితే విజయ్.. రేవంత్‌ను కలిసింది తన వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడానికే అని ప్రచారం జరుగుతుండగా.. అదే నిజం అని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అంతేకాదు విజయ్ దేవరకొండ తన మొదటి కార్డును సీఎం రేవంత్ రెడ్డికే ఇచ్చారట.
గతేడాదే సీక్రెట్ ఎంగేజ్‌మెంట్..?
నిజానికి ఈ పెళ్లి సందడి ఈ రోజుది కాదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 2025, అక్టోబర్‌లోనే విజయ్, రష్మికల ఎంగేజ్‌మెంట్ సీక్రెట్‌గా జరిగిపోయిందట. మీడియా కంట పడకుండా, చాలా సైలెంట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉంగరాలు మార్చుకున్నారని టాక్. అందుకే ఇప్పుడు పెళ్లి పనుల జోరు పెరిగిందని అంటున్నారు. రూ.60 కోట్ల ఆఫర్‌కు నో.. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ స్టార్ వెడ్డింగ్‌ను టెలికాస్ట్ చేయడానికి ఓ ప్రముఖ ఓటీటీ (OTT) సంస్థ భారీ ఆఫర్ ఇచ్చిందట. రాజస్థాన్ వెడ్డింగ్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం ఏకంగా రూ.60 కోట్లు ఇస్తామని ముందుకొచ్చారట. కానీ తమ పెళ్లిని కమర్షియల్ చేయకుండా, ప్రైవేట్‌గా ఉంచుకోవాలనుకున్న ఈ జంట.. ఆ భారీ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. కెరీర్ పరంగా.. సినిమాల విషయానికొస్తే.. విజయ్ దేవరకొండ చివరగా ‘కింగ్‌డమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’తో అలరించింది. ఇన్ని రూమర్స్ వస్తున్నా, సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్నా.. ఇద్దరూ మాత్రం మౌనం వహిస్తున్నారు. కానీ ఈ ఫిబ్రవరి 26న పెళ్లి బాజాలు మోగడం పక్కా అనేది మీడియా వర్గాల సమాచారం.
గీత గోవిందంతో ప్రయాణం..!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తొలిసారి 2018లో గీత గోవిందం చిత్రంలో నటించారు. ఈ మూవీలో ఈ జంట తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. దాంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అప్పట్లో ఈ జంట షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 2019 లో డియర్ కామ్రేడ్ చిత్రంలో వీరిద్దరూ నటించారు. ఆ మూవీ సమయంలో ఆ బంధం బలపడిందని.. విజయ్- రష్మిక డేట్ లో ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి.
ఆ తర్వాత వీరిద్దరూ వెకేషన్ కు వెళ్లడం.. ఎయిర్ పోర్టుల్లో కనిపించడం.. విజయ్ ఫ్యామిలీతో రష్మిక ఎంజాయ్ చేయడం.. విజయ్ మూవీస్ ను రష్మిక థియేటర్ కు వెళ్లి మరీ చూడటం.. ఇలాంటి వరుస ఘటనల నేపథ్యంలో ఇక ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని అందరూ ఫిక్స్ అయ్యారు. అంతేకాక గతేడాది ఈ జంట నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ ఈ విషయాన్ని ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు.