Vijay Deverakonda : అరావళి పర్వతాల్లో విజయ్, రష్మిక పెళ్లి.. మూడంచెల భద్రత..! వెండింగ్ కి.. ప్రధాని మోదీ..!
విరోష్ వెడ్డింగ్ కి మోదీ..!
టాలీవుడ్ స్టార్ హీరో విజయ దేవరకొండ – నేషనల్ క్రష్ రష్మిక మందన్నల వివాహం ఫిబ్రవరి 26వ తేదిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరగనుంది. టాలీవుడ్‌తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమ చూపంతా ఇప్పుడు ఈ పెళ్లి గురించే ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మీడియాకు, బయటి ప్రపంచానికి దూరంగా.. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరిద్దరూ వివాహ బంధం ద్వారా ఒక్కటి కానున్నారు. విజయ్ – రష్మికల పెళ్లి నేపథ్యంలో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ఉదయ్‌పూర్ చేరుకుంటున్నారు. కాగా విజయ్ – రష్మికలకు ఓ విశిష్ట అతిథి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆయన ఎవరో కాదు సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ.
ఈ వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (విరోష్) వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. మరికొన్ని గంటల్లో వివాహబంధం లోకి అడుగు పెట్టబోతున్నారు. వీరి వివాహం ఉదయ్ పూర్ లో జరగనుంది. రష్మిక, విజయ్ వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఉన్న ఐటీసీ హోటల్లో గ్రాండ్ గా జరగనుంది. వారి వివాహ వేదిక వద్ద మూడు అంచెల భద్రతను మోహరించినట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు, హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం, అంతర్జాతీయ భద్రతా మధ్య ఈ వేడుక జరగనుంది. వీరి వివాహానికి కొద్దిమంది అతిధులు మాత్రమే హాజరుకానున్నారు.
లవ్ ట్రాక్ నుంచి వివాహ బంధంలోకి..!
ఇప్పటి వరకు రహస్యంగా ప్రేమాయణం సాగించిన విజయ్ దేవరకొండ- రష్మికలు తమ పెళ్లిని కూడా అత్యంత గోప్యంగా ఉంచుతూ వచ్చారు. అయితే ఆలస్యం చేయడం మంచిది కాదని భావించిన జంట.. పెళ్లికి రెండ్రోజుల ముందు బహిర్గతం చేశారు. రష్మికను తాను పెళ్లాడబోతున్నానని విజయ్ అధికారికంగా ప్రకటించారు. తాము చేయాల్సిన పనిని అభిమానులు ఎప్పుడూ ముందే చేస్తుంటారు. ఈసారి కూడా తమ పెళ్లికి విరోష్ అనే వారే పేరు పెట్టారు. అభిమానులు మా జీవితాల్లో ఒక భాగం.. వారిని గౌరవిస్తూ తమ వివాహ వేడుకకు వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెడుతున్నట్లు విజయ్ ప్రకటించారు.

విరోష్ వెడ్డింగ్ కి మోదీ శుభాకాంక్షలు..
ఇక టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల వివాహాన్నికి దేశ ప్రధాని నరేంద్రమోడీ విషెస్ తెలియజేశారు. విరోష్ పెళ్లి నేపథ్యంలో విజయ్ తల్లిదండ్రులు ప్రధాని మోడీకి వివాహ ఆహ్వాన పత్రికను పంపారు. దీనిపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ కొత్త జంటను ఆశీర్విస్తూ ప్రత్యేకంగా లేఖ పంపారు. శ్రీమతి మాధవి, శ్రీ గోవర్థన్ రావు దేవరకొండలకు… ఫిబ్రవరి 26, 2026న జరగనున్న విజయ్ – రష్మికల వివాహానికి మీరు నన్ను ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ఇది నిజంగా సంతోషకరమైన, శుభప్రదమైన క్షణాలు. ఈ సందర్భంగా దేవరకొండ, మందన్న కుటుంబాలకు హృదయపూర్వక అభినందనలు. ఇది విజయ్- రష్మికల జీవితాలలో ఒక కొత్త, అందమైన అధ్యాయానికి నాంది అని చెప్పారు. “సప్తపది అనే పవిత్ర బంధంతో ఏడడుగులు వేస్తూ జీవిత భాగస్వాములుగా మారుతున్న మీకు నా శుభాకాంక్షలు. మీ దాంపత్య జీవితం ప్రేమ, కలలు, పరస్పర గౌరవంతో నిండి ఉండాలి. జీవితాంతం స్నేహం, తోడ్పాటు, ఒకరినొకరు అర్థం చేసుకునే గుణంతో ముందుకు సాగాలి” అని ప్రధాని ఆశీర్వదించారు. దేవరకొండ, మందన్న కుటుంబాలకు కూడా ఆయన అభినందనలు తెలిపారు. ఏడు అడుగులు కలిసిన వేసిన స్పూర్తితో ఈ జంట జీవితాంతం స్నేహితులుగా మారతారు అని మోడీ ఆకాంక్షించారు.
అరావళి పర్వతాల మధ్యలో విరోష్ పెళ్లి..!
రాజస్థాన్‌లోని అందమైన అరావళి పర్వతాల మధ్యలో ఉన్న ఉదయ్‌పూర్‌లో ప్రఖ్యాత మెమంటో ITC హోటల్ ఈ రాయల్ వెడ్డింగ్‌కు వేదికగా మారింది. ఇక ఈ ప్యాలెస్ లో ఈ వివాహ వేడుకల కోసం దాదాపు రూ. 6 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుకను ఘనంగా, కానీ ప్రైవేట్‌గా నిర్వహిస్తున్నారు. ఈ వివాహానికి టాలీవుడ్ నుంచి దర్శకులు సందీప్ రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బాతో పాటు పలువురు సినీ ప్రముఖులు, కొందరు రాజకీయ నేతలు కూడా హాజరవుతారని సమాచారం. ఈ వివాహం రెండు విభిన్న సంప్రదాయాల ప్రకారం జరగనుండటం మరో విశేషం. తెలుగు సంప్రదాయంతో పాటు రష్మిక కుటుంబానికి చెందిన కొడవ సంప్రదాయంలో కూడా వివాహ తంతు నిర్వహిస్తారు. ముహూర్తాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఉదయం వేళల్లోనే ప్రధాన కార్యక్రమాలు జరుగుతాయని తెలుస్తోంది. ప్రధాని మోదీ ఆశీస్సులతో ‘విరోష్’ వివాహ వేడుకకు మరింత ప్రత్యేకత చేకూరింది. ఈ పెళ్లి ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.