Vijay and Rashmika get married according to Telugu and Karnataka traditions

Vijay and Rashmika Married : రష్మిక ను రెండు సార్లు పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ..! ఎందుకంటే..?

ఒకే రోజు రెండు సార్లు పెళ్లి..!

టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు ఒక్కటయ్యారు. తమ రిలేషన్‌షిప్‌పై కొన్నేళ్లుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ ఇవాళ‌ ఉదయం రాజస్థాన్ రాజుల ప్యాలెస్ అయిన ఉదయ్ పూర్ లో ఉదయం 10:10 గంటలకు రష్మిక మెడల విజయ్ మూడు ముడులు వేశి తన జీవిత భాగస్వామిగా స్వీకరించారు. కాగా ఒకే రోజు రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు విజయ్ రష్మిక.

ఇక విషయంలోకి వెళ్తే…

టాలీవుల్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరి వివాహం గురువారం ఉదయం ఉదయ్ పూర్ లోని ఐటీసీ హోటల్లో జరగింది. ఈ పెళ్లికి సినీప్రముఖులు, సన్నిహితులు హాజరైనట్లు సమాచారం. ఈ పెళ్లికి పూర్తి ప్రైవసీగా నో ఫోన్ పాలసీని సైతం అమలు చేశారు. ఈ వివాహ వేడుక రెండు విభిన్న సంస్కృతుల కలయికగా అత్యంత వైభవంగా జరుగింది. వీళ్ల పెళ్లికి ఇటీవల తమ ఇన్ స్టా ఖాతాల్లో తమ పెళ్లి వేడుకకు ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెట్టినట్టు అధికారికంగా ఇద్దరూ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా విజయ్, రష్మిక ఉదయ్ పూర్ పెళ్లి చేసుకున్నారు. అయితే విజయ్- రష్మిక జంట ఒకేరోజు రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు.

కన్నడ సంప్రదాయంలో పెళ్లి..!

కర్ణాటకలోని కొడవ పద్ధతిలో పెళ్లి చేసుకోకున్నారు. కర్ణాటకలోని కొడగు (కూర్గ్ ) జిల్లాలో జన్మించింది రష్మిక. అక్కడి స్థానిక వారియర్ కమ్యూనిటీనే కొడవగా పిలుస్తారు. ఈ వర్గానికి చెందిన ప్రజల ఇళ్లల్లో పెళ్లిళ్లు ఎలా జరుగుతాయో తెలుసా ? అని సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక ఈ పెళ్లికి.. పూర్తి ప్రైవసీగా నో ఫోన్ పాలసీని సైతం అమలు చేశారు. ఈ వివాహ వేడుక రెండు విభిన్న సంస్కృతుల కలయికగా అత్యంత వైభవంగా జరుగింది. ఉదయం విజయ్ కుటుంబ పద్ధతిలో హిందూ సంప్రదాయం ప్రకారం పె చేసుకున్నారు. ఆ తర్వాత కొడవ ప్రజల సంస్కృతి, ఆహార్యం, వివాహ పద్దతులు ఇతరులతో పోలిస్తే విలక్షణంగా ఉంటాయి. యువతీయువకులు తమ వర్గ సంప్రదాయాలు పాటిస్తూ పూర్వీకులను గౌరవిస్తూ పెళ్లి చేసుకున్నారు. మాములుగా జరిగే హిందూ వివాహాలకు భిన్నంగా కొడవ వెడ్డింగ్ చేసుకున్నారు. అంటే అగ్నీసాక్షిగా ఏడడుగులు నడుస్తూ ప్రమాణాలు చేసుకోవడం వంటిది ఏమీ ఉండదు. సుదీర్ఘంగా పెళ్లి మంత్రాలు వినిపించావు. ఈ ప్రక్రియ మొత్తంలో స్థానికతే కనిపిస్తుంది. అరటి ఆకుల్లో విందు, సంప్రదాయ అలంకరణలు ఈ ప్రత్యేక ఆకర్ణగా నిలిచాయి. ఈ వేడుకలో కుప్పుస దుస్తులు, తలపాగ ధరింస్తారు. యోధ సంప్రదాయానికి చిహ్నంగా పీచే కట్టి అనే కత్తి ధరించడం ముఖ్య ఆచారంతో చేసుకున్నారు. వధువు కోర్గి శైలిలో రష్మిక చీర కట్టడం ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది. సాయంత్రం 4:30 గంటలకు కర్ణాటక కొడవ సంప్రదాయ పద్ధతిలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

మార్చి 4న రిసెప్షన్..

వివాహం అనంతరం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి 4న సాయంత్రం హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో ఈ వేడుక జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని అంచనా ఉండటంతో ఈ రిసెప్షన్‌పై కూడా భారీ ఆసక్తి నెలకొంది.

గీత గోవిందంతో ప్రేమ ప్రయాణం..

ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తొలిసారి 2018లో గీత గోవిందం చిత్రంలో నటించారు. ఈ మూవీలో ఈ జంట తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. దాంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అప్పట్లో ఈ జంట షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 2019 లో డియర్ కామ్రేడ్ చిత్రంలో వీరిద్దరూ నటించారు. ఆ మూవీ సమయంలోనే వీరి బంధం బలపడిందని.. విజయ్- రష్మిక డేట్ లో ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *