- డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో సరి కొత్త మైలురాయి..
- ఆగస్టులో తొలిసారి 2000 కోట్లు దాటిన యూపీఐ లావాదేవీలు
- ఒకే నెలలో రూ. 24.85 లక్షల కోట్ల విలువైన ట్రాన్సాక్షన్లు
- జులైతో పోలిస్తే 2.8 శాతం వృద్ధి నమోదు
- డిజిటల్ చెల్లింపుల్లో మహారాష్ట్ర టాప్ అని తెలిపిన ఎస్బీఐ నివేదిక
- వ్యాపారులకు చేసే చెల్లింపుల వాటా గణనీయంగా పెరుగుదల
భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) చారిత్రక మైలురాయిని అందుకుంది. చరిత్రలో తొలిసారిగా ఒకే నెలలో 20 బిలియన్లు అంటే (2000 కోట్లు) లావాదేవీల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆగస్టు నెలకు సంబంధించిన గణాంకాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) సోమవారం విడుదల చేసింది.
ఇక విషయంలోకి వెళ్తే..
భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) చారిత్రక ఘనత సాధించింది. తొలిసారిగా ఒకే నెలలో 20.01 బిలియన్ (2000 కోట్లు) లావాదేవీల మార్కును అధిగమించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఆగస్టు 2025 గణాంకాలను సోమవారం విడుదల చేసింది, ఇది యూపీఐ యొక్క విశేష వృద్ధిని స్పష్టం చేస్తుంది. ఎన్‌పీసీఐ డేటా ప్రకారం, ఆగస్టు 2025లో యూపీఐ ద్వారా 20.01 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయి. ఇది జులై నెలలో నమోదైన 19.47 బిలియన్ లావాదేవీలతో పోలిస్తే 2.8 శాతం అధికం. వార్షిక ప్రాతిపదికన, ఈ వృద్ధి 34 శాతంగా ఉంది. లావాదేవీల విలువ రూ.24.85 లక్షల కోట్లుగా నమోదైంది, గత ఏడాదితో పోలిస్తే 24 శాతం పెరుగుదలను సూచిస్తుంది. సగటున రోజుకు 645 మిలియన్ లావాదేవీలు జరిగాయని, ఒక్కో రోజు సగటు విలువ రూ.80,177 కోట్లుగా ఉందని ఎన్‌పీసీఐ తెలిపింది. ఆగస్టు 2న ఒకే రోజు 700 మిలియన్ లావాదేవీలతో యూపీఐ మరో రికార్డు సృష్టించింది. రాష్ట్రాల వారీగా యూపీఐ వాడకం ను ఒక సారి చూసుకుంటే.. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం, డిజిటల్ చెల్లింపుల్లో మహారాష్ట్ర 9.8 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది, కర్ణాటక (5.5 శాతం) మరియు ఉత్తరప్రదేశ్ (5.3 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పీ2ఎం (వినియోగదారుల నుంచి వ్యాపారులకు) లావాదేవీలు గణనీయంగా పెరిగాయి, 2020 జూన్‌లో 39 శాతంగా ఉన్న వాటా 2025 జులై నాటికి 64 శాతానికి చేరింది. కిరాణా సామాను (24.3 శాతం లావాదేవీలు) మరియు రుణ వసూళ్లు (12.8 శాతం విలువ) వంటి విభాగాల్లో యూపీఐ వాడకం అధికంగా ఉంది.

CIC కంటే చాలా వేగంగా…
యూపీఐ లావాదేవీల వృద్ధి దేశంలో చలామణిలో ఉన్న నగదు (సీఐసీ) కంటే చాలా వేగంగా ఉందని ఎస్బీఐ నివేదిక సూచిస్తుంది. 2025 ఏప్రిల్-జులై మధ్య యూపీఐ సగటు నెలవారీ లావాదేవీల విలువ రూ. 24,554 బిలియన్‌గా ఉండగా, సీఐసీ వృద్ధి కేవలం రూ.193 బిలియన్‌గా ఉంది. ఈ వేగవంతమైన వృద్ధి ఆర్థిక సమ్మిళితత్వాన్ని ప్రోత్సహిస్తోంది, డిజిటల్ చెల్లింపుల ద్వారా వ్యాపారులు మరియు వినియోగదారులకు సౌలభ్యాన్ని అందిస్తోంది. ముఖ్యంగా వినియోగదారుల నుంచి వ్యాపారులకు చేసే (పీ2ఎం) చెల్లింపులు గణనీయంగా పెరిగాయని ఈ నివేదిక వెల్లడించింది. 2020 జూన్ లో మొత్తం లావాదేవీల్లో వీటి వాటా కేవలం 39 శాతంగా ఉండగా, ఈ ఏడాది జులై నాటికి అది 64 శాతానికి పెరిగింది. దేశంలో చలామణిలో ఉన్న నగదు (సీఐసీ) వృద్ధి కంటే యూపీఐ లావాదేవీల వృద్ధి చాలా వేగంగా ఉందని, ఇది ఆర్థిక సమ్మిళితత్వానికి నిదర్శనమని నివేదిక పేర్కొంది. కిరాణా సామాను, రుణాల వసూళ్లు వంటి విభాగాల్లో యూపీఐ వాడకం ఎక్కువగా ఉన్నట్లు తేలింది.