Upasana | తెలంగాణ ప్రభుత్వం.. మెగాస్టార్ చిరంజీవి కోడలు, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసనకు కీలక బాధ్యతలను అప్పగించింది. తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌కు కో-ఛైర్మన్‌గా ఉపాసనను నియమించింది. తనకు ఈ బాధ్యతలను అప్పగించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రభుత్వం కీలక నిర్ణయం..
తెలంగాణ ప్రభుత్వం కీలకంగా ప్రకటించిన కొత్త స్పోర్ట్స్ పాలసీలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, క్రీడా నిపుణులకు కీలక పాత్రలు అప్పగించింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కోడలు, గ్లోబల్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన కొణిదెలకు గౌరవనీయమైన బాధ్యతలు అప్పగించారు. తాజాగా ప్రకటించిన తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ కు ఉపాసన కో-చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ బోర్డుకు లక్నో సూపర్ జెయింట్స్ యజమాని, ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ గోయెంకా ఛైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, కో-చైర్మన్ బాధ్యతలు ఉపాసన చేపట్టనున్నారు. తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా కేంద్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం స్పోర్ట్స్ హబ్‌ను ఏర్పాటు చేసింది. ఈ హబ్‌ను నిర్వహించడానికి బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఏర్పాటు చేశారు. ఛైర్మన్‌గా సంజీవ్ గోయెంకాను కో-ఛైర్మన్‌గా ఉపాసన కొణిదెల నియమిస్తూ ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ప్రభుత్వం అందజేసింది.

సీఎం కు కృతజ్ఞతలు..
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా నియమితులైనందుకు గౌరవంగా భావిస్తున్నట్లు ఉపాసన తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలిపారు. ఈ అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి , తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణను ప్రపంచ క్రీడా శక్తిగా మార్చడంలో సంజీవ్ గోయెంకాతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు.
CSR వైస్ ఛైర్‌పర్సన్ గా పేరు..
ఇక ఇప్పటికే… అపోలో హాస్పిటల్స్‌లో CSR వైస్ ఛైర్‌పర్సన్ , UR లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆరోగ్యం, ఫిట్‌నెస్, యువతకు సంబంధించిన కార్యక్రమాలలో ఉపాసన పేరు తెచ్చుకున్నారు. ఆమె నాయకత్వం క్రీడాకారుల సంక్షేమం , క్రీడా విద్యపై దృష్టి సారిస్తుందని ప్రభుత్వం భావించినట్లుగా తెలుస్తోంది. ఈ పాలసీ ద్వారా తెలంగాణ క్రీడా రంగాన్ని రాజకీయ ప్రభావం నుండి దూరంగా ఉంచి, ప్రైవేట్ సంస్థలు, నిపుణులతో భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.
చిరంజీవే సీఎంతో మాట్లాడి ఉపాసనకు పదవి ఇప్పించారా..?
ఇక తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల.. తన కోడలికి దక్కిన ఈ గౌరవం పట్ల చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. మా కోడలు ఉపాసన ఇప్పుడు తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌కి కో చైర్ పర్మన్. ఆమెని గౌరవప్రదమైన పదవిలో నియమించడం చాలా సంతోషంగా ఉంది. దీనిని గౌరవం అనడం కన్నా మరింత బాధ్యతని పెంచింది అని చెప్పాలి. డియర్ ఉపాసన.. నీకున్న నిబద్ధత, ప్యాషన్‌తో ప్రతిభని గుర్తించి ప్రోత్సహిస్తావని, ప్రతిభావంతులని అగ్రస్థానంలో నిలబెట్టడానికి తగిన విధి విధానాలని రూపొందించడంలో నీ వంతు కృషి చేస్తావని ఆశిస్తున్నాను. దేవుడి దీవెనలు నీకు తోడుగా ఉంటాయని చిరు పేర్కొన్నారు. ఇక ఇటీవలే.. సీఎం రేవంత్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటి అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ అయిన రెండు రోజులకే, ఆయన కోడలిని స్పోర్ట్స్ హబ్‌కి కో చైర్ పర్మన్ నియమించడం పట్ల తీవ్ర అసక్తి నెలకొంది.
