Two more by-elections in Telangana..! MLAs who resigned..?

తెలంగాణలో ఇటీవలే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపినాథ్ మరణనంతరం వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం యమ జోష్ మీద ఉంది. అయితే తెలంగాణలో మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలను ఎదురుకునేందుకు కాంగ్రెస్ సిద్దం కాబోతుంది. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి లపై త్వరలో స్పీకర్ వేటు వేసే అవకాశం ఉందని, దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యం కావచ్చని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

ఇక విషయంలోకి వెళ్తే..

తెలంగాణలో ఉప ఎన్నికల వేడి ఒక్కటే తగ్గకుండానే మరొక ఎన్నిక వాతావరణం వేడెక్కే పరిస్థితి కనిపిస్తోంది. గత రెండేళ్లుగు చూసుకుంటే.. తొలి సారిగా దుబ్బాక ఉప ఎన్నిక, ఆ తర్వాత నాగార్జున సారగ్ ఉప ఎన్నిక, హా రెండు బీఆర్ఎస్ పాలనలోనే జరిగాయి. ఆ తర్వాత మళ్లీ గ్రేటర్ లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల జరిగి కాంగ్రెస్ పార్టీ బంపర్ మేజారీటితో విజయం సాదించింది. ఇక రాష్ట్రంలో ఎన్నికలు వేడి తగ్గినట్లే.. ఉంటే స్థానిక సంస్థ ఎన్నికలు, ఆ తర్వాత GHMC ఎన్నికలు తప్ప.. ఇప్పట్లో ఉప ఎన్నికలు జరగవు అని అందరు అనుకున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికలు ఇంకా మూడేళ్ల సమయం అయితే ఉంది. కానీ ఇప్పుడు దాదాపు 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం అని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. నిజంగా వాళ్లు అన్నట్లుగానే 10 నియోజకవర్గాలు కావు కానీ.. రెండు నియోజకవర్గాల్లో మాత్రం అతి త్వరలోనే ఉప ఎన్నికలు అయితే రాబోతున్నాయి అని స్పష్టంగా అర్ధం అవుతుంది.

ఇంకాస్తా వివరాల్లోకి వెళ్తే..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన వెంటనే, హైదరాబాద్ నగరంలో మరో సీటు ఖాళీ కాబోతోందన్న చర్చ వేగంగా సాగుతోంది. ఇటీవలే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన పలువురిపై స్పీకర్ కార్యాలయంలో విచారణ జరుగుతోంది. ఈ విచారణలో దానం నాగేందర్, కడియం శ్రీహరిల వ్యవహారం కీలక ఘట్టానికి చేరుకుంది. ఇక ప్రస్తుతం కాలీ అవుతున్న ఆ స్థానం జూబ్లీహిల్స్‌కు పక్కనే ఉన్న ఖైరతాబాద్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన దారం నాగేందర్ విజయం సాధించారు. కానీ ఎన్నికల తర్వాత ఆయన ఆకస్మికంగా కాంగ్రెస్‌లో చేరి రాజకీయ సమీకరణాలను మార్చేశారు. అంతేకాకుండా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం ఆయనపై “పార్టీ ఫిరాయింపు” ఆరోపణలకు మ‌రింత బ‌లం చేకూర్చిన‌ట్ల‌య్యింది.

10 మంది ఎమ్మెల్యేలపై వేటు తప్పదా..?

తెలంగాణలో మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారినందుకు అనర్హతను కోరుతూ బీఆర్ఎస్ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. విచారణ వేగంగా సాగడం లేదని ఆరోపిస్తూ కోర్టును కూడా ఆశ్రయించింది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పుడు స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టగా, ఈ 10 మందిలో దానం నాగేందర్ కేసు అత్యంత బలమైన సాక్ష్యాలతో ఉందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆయన కాంగ్రెస్ టికెట్‌పై పార్లమెంట్ పోటీ చేయడం స్పీకర్ ముందున్న కేసుకు కీలక ఆధారమైందని అంటున్నారు. దీంతో ఆయన అనర్హత ఖాయం అన్న భావన పెరుగుతోంది. అనర్హత వేటు పడకముందే దానం నాగేందర్ స్వయంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం హాట్‌గా వినిపిస్తోంది. నిజానికి దానం చాలా రోజుల క్రితమే రాజీనామా చేయడానికి ముందుకొచ్చారని, కానీ సరైన సమయం కోసం సీఎం రేవంత్ రెడ్డి వేచి ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలతో రాజకీయ వాతావరణం కాంగ్రెస్‌కనుక మంచిగా మారిన నేపథ్యంలో, రేవంత్ స్వయంగా దానం రాజీనామా కార్డ్‌ను బయటకు తీయవచ్చని టాక్. ఇదిలా ఉండగా… జూబ్లీహిల్స్‌లో తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొన్న బీఆర్ఎస్, ఖైరతాబాద్‌లో కూడా ఉప ఎన్నిక చేయడానికి సిద్ధమా? అన్న ప్రశ్న పెద్ద చర్చగా మారింది. ఇప్పటి వరకు “ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగాలి… మేము గెలుస్తాం” అని బీఆర్ఎస్ నాయకులు ధైర్యంగా చెప్పేవారు. కానీ జూబ్లీహిల్స్ ఓటమి ఆ ధైర్యాన్ని బాగా దెబ్బతీసింది.

ఖైరతాబాద్ లోనే తొలి ఉప ఎన్నిక..

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఇప్పుడు త్వరితగతిన అనర్హత తీర్పులు రావాలని కోరుకుంటుందనే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వ్యూహాత్మకంగా బీఆర్ఎస్‌ను మరింత రక్షణాత్మక స్థితిలోకి నెట్టే ప్రయత్నంగా దానం రాజీనామాను ఉపయోగించవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. కొద్ది రోజుల్లోనే ఖైరతాబాద్ రాజకీయాలు వేడెక్కి ఉప ఎన్నికల దిశగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *