Tsunami warnings for Japan on July 5
  • ప్రపంచాని భయపెడుతున్న న్యూ బాబా వంగా జోస్యం…
  • “ది ఫ్యూచర్ ఐ సా” పుస్తకంలో ఏం రాసి ఉంది..?
  • జపాన్ ను కలవరపెడుతున్న మాంగా కళాకారిణి “రియో టాట్సుకి”
  • జూలై 5న మహా ప్రళయం రానుందా..?
  • జపాన్ ను ముంచెత్తనున్న భారీ సునామీ..?
  • 2011 లో వచ్చినట్లే… మరో సారి సునామీ రానుందా..?
  • జపాన్ సముద్ర గర్భంలో ఏం జరుగుతుంది..?
  • జపాన్ దేశం కడలిలో కలిసిపోనుందా..?
  • గతంలో ఆమె చెప్పిన విషయాలను నిజమయ్యాయి… మరి ఈ సారి కూడా నిజం కానున్నాయా..?

బాబా వంగా (Baba Vanga)… ఈ పేరుతో ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోకల్ స్థాయి వ్యక్తుల నుంచి నేషనల్ స్థాయి వరకు బాబా వంగా తెలుసు. ప్రస్తుతం ఆమె జీవించి లేకపోయినా… ఆమె చెప్పిన జోస్యాలతో ఇప్పటికే ప్రాణాలతోనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో ఏ ప్రకృతి విపత్తు వస్తుంది అని కొన్ని సంవత్సరాల ముందే చెప్పిన వ్యక్తి. నిజంగా ఇమె చెపపిన జోస్యాం నిజంగా జరిగాయి కూడా. ప్రస్తుతం న్యూ బాబా వంగా గా పేరు పొందిన జపాన్ రియో టాట్సు జోస్యాం మరో సారి వైరల్ అవుతుంది. వైరల్ అవ్వడమే కాదు… ఏకింతా ఆందోళన కలిగిస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే…

ప్రపంచవ్యాప్తంగా పలువురు జోస్యగాళ్లలో బాబా వంగా (Baba Vanga) పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఆమె చెప్పిన అనేక జోస్యాలు (Prophecy) ఈ ప్రపంచంలో నిజం కావడంతో… ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ప్రస్తుతం బాబా వంగా జోస్యాం కాదులే కానీ… అచ్చం ఆమె జోస్యాం వలే… ‘న్యూ బాబా వంగా’ (New Baba Vanga) గా గుర్తింపు పొందిన జపాన్ మాంగా కళాకారిణి “రియో టాట్సుకి” చేసిన జోస్యం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. బాబా వంగా జోస్యం గురించి అందరికీ తెలుసు. ఆమె చెప్పిన అనేక మాటలు నిజమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా, న్యూ బాబా వంగా జోస్యం అందరినీ కలవరపెడుతోంది. ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో రాబోవు 3 వారాల్లో ఓ పెద్ద విపత్తు సంభవిస్తుందనేది ఈ కొత్త బాబా జోస్యం. దీంతో ఆ దేశానికి విమాన బుకింగ్‌లు 83 శాతం తగ్గాయని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి.

ఇది కూడా చూడండి : Pakistan Drought : పాక్ లో కరువు తాండవం… POK ఇస్తేనే నీళ్లు… లేదంటే చావండి…

న్యూ బాబా వంగా జోస్యం…

తాజాగా… న్యూ బాబా వంగా జోస్యం అందరినీ కలవరపెడుతోంది. ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో రాబోవు 3 వారాల్లో ఓ పెద్ద విపత్తు సంభవిస్తుందనేది ఈ కొత్త బాబా జోస్యం. దీంతో ఆ దేశానికి విమాన బుకింగ్‌లు 83 శాతం తగ్గాయని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. రియో టాట్సుకి తన పుస్తకం (The Future I Saw) లో చేసిన జోస్యం ప్రకారం… 2025 జూలై 5వ తేదీన ఈ మహా విపత్తు ముంచుకొచ్చే ప్రమాదం ఉందని రియో టాట్సుకి (Ryo Tatsuki) .. తన ‘ది ఫ్యూచర్ ఐ సా’ (The Future I Saw) అనే పుస్తకంలో పేర్కొన్నారు. జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో టెక్టానిక్ ప్లేట్ల (Tectonic plates) కదలడం లేదా అగ్నిపర్వత విస్ఫోరణం వల్ల ఈ విపత్తు సంభవించవచ్చని ప్రస్తావించారు. ఇది మెగా సునామీ, భూకంపం రూపంలో ఉండొచ్చన్నారు. సముద్రంలో గాలి బుడగలు బయటకు వచ్చే దృశ్యాలు తనకు కలలో కనిపించాయని చెప్పారు. ఇది సముద్ర గర్భంలో అగ్నిపర్వత పేలుడుకు సంకేతమని న్యూ బాబా వంగా తన పుస్తకంలో ప్రస్తావించారు. దీని బట్టి వచ్చే నెలలో జపాన్ ను భారీ సునామీ ముంచెత్తనున్నట్లు ఆమె పుస్తకం ద్వారా తెలుస్తుంది.

మాంగా కళాకారిణి రియో టాట్సుకి…

జపనీస్ మాంగా కళాకారిణి రియో టాట్సుకి గతంలో చెప్పిన జోస్యం నిజమైంది. 2011లో జపాన్‌లో సంభవించిన తోహోకు భూకంపం (Earthquake), సునామీ (Tsunami) గురించి, ఫుకుషిమా దైచి అణు విపత్తు, యువరాణి డయానా మరణం, ఫ్రెడ్డీ మెర్క్యురీ మరణంతో పాటూ కొవిడ్-19 మహమ్మారి తదితరాలపై ఆమె గతంలో కచ్చితమైన అంచనా వేశారు. ఈమె జోస్యానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా.. ప్రజలు ఆమె జోస్యాన్ని బాగా విశ్వసిస్తున్నారు. 2030 లో కొవిడ్ మహమ్మారి మళ్లీ ఎటాక్ చేస్తందని, ఈసారి దాని ప్రభావం మరింత ప్రాణాంతకంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. జపాన్‌కు చెందిన మాంగా కళాకారిణి రియో టాట్సుకి న్యూ బాబా వంగాగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఇక ఈ రియో టాట్సుకి జోస్యం తో… జపాన్కు టూరిజం తగ్గుతుందా..? జపాన్ వెళ్లేందుకు టూరిస్టులు జంకుతున్నారా..? 2011 సునామీ భయం జపాన్ (Japan) ప్రజల్లో, పర్యటకుల్లో ఇంకా ఉందా..? “రియో టాట్సుకి” భవిష్యవాణి… జపాన్ వణికిపోతుందా..? ప్రస్తుతం అక్కడి పర్యాటక రంగం ఎలా ఉంది..?

ఇది కూడా చూడండి : Chenab Bridge : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి గా చీనాబ్ బ్రిడ్జి…

జపాన్ నుంచి వెళ్లిపోతున్న పర్యాటకులు…

దీంతో… ద్వీప జపాన్‌కు పర్యాటకులు వెల్లేందుకు జంకుతున్నారు. తాజాగా రియో టాట్సుకి జోస్యాంతో… జపాన్ లో విమాన బుకింగ్‌లు (Flight bookings) 83 శాతం తగ్గాయని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. జూలైలో జపాన్ కు వెళ్లే పర్యాటకుల సంఖ్య బాగా తగ్గిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జపాన్ టూరిజం బుకింగ్స్‌లోనూ భారీ కోత కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా బోయింగ్ విమానాల్లో చేసుకున్న బుకింగ్‌లు 15 నుంచి 20 శాతం మంది రద్దు చేసుకుంటున్నారు. చైనాలోని హాంగ్ కాంగ్ నుంచి వచ్చే విమానాలతో పాటూ హోటల్ బుకింగ్స్ 50 శాతం పడిపోయినట్లు బ్లూమ్ బర్గ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెల్లడించింది. అదేవిధంగా చైనాతో పాటూ థాయిలాండ్, వియాత్నం బుకింగ్స్ కూడా 83 శాతం పడిపోయినట్లు చెబుతున్నారు. తాము 80 శాతం సీట్లు భర్తీ అవుతాయని భావించామని, అయితే రిజర్వేషన్లు 40 శాతం మాత్రమే వచ్చాయని ఎయిర్‌లైన్ జపాన్ కార్యాలయం జనరల్ మేనేజర్ హిరోకి ఇటో తెలిపారు. ఇక తాజా పరిస్థితుల పై జపాన్ లోని మియాగి ప్రిఫెక్చర్ గవర్నర్ స్పందించారు. మియాగి ప్రిఫెక్చర్ గవర్నర్ యోషిహిరో మురై మాట్లాడుతూ ప్రజలు పుకార్లను నమ్మొద్దని సూచించారు. జపనీయులు ఎవరూ విదేశాలను పారిపోవడం లేదని, కాబట్టి ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మకుండా తమ ప్రాంతాలను సందర్శిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇక ఆమె చెప్పిన ఈ జోస్యం ఎంతవకు నిజం అవుతాయో వేచి చూడాలి. కానీ ఈ జోస్యం తప్పు అయితే బాగుండాలని ప్రజలు కోరుకుటున్నారు.

Suresh

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *