రష్యా, జపాన్ లో సునామీ…
రష్యా (Russia) లో భారీ భూకంపం సంబంవించిన విషయం తెలిసిందే. దీంతో రష్యాలో ఉన్న సముద్ర (sea) తీర ప్రాంతాంలో.. రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. రష్యాలో వచ్చిన భారీ భూకంపం కారణంగా పలు దేశాలను సునామీ అతలాకుతలం చేస్తోంది. రష్యా తూర్పు తీరంలోని కంచాట్కా ద్వీపకల్పంలోని (Kamchatka Peninsula)పెట్రో పావ్లోవ్‌స్క్‌లో (Petropavlovsk) బుధవారం తెల్లవారుజామున 8.8 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. ఈ రాకాసి అలలు ఇప్పటికే రష్యాతో పాటు జపాన్, అమెరికాలోని పలు తీర ప్రాంతాలను తాకింది. ఇంకా పలు దేశాలు, దీవులకు సునామీ తాకే అవకాశం ఉంది. సునామీ (Tsunami) ముప్పు పొంచి ఉన్న దేశాలు, దీవుల జాబితాను అమెరికా సునామీ వార్నింగ్ సిస్టమ్ విడుదల చేసింది. సునామీ ప్రభావాన్ని బట్టి నాలుగు కేటగిరీలుగా ఆ జాబితాను ప్రకటించింది.
30 దేశాలకు సునామీ హెచ్చరికలు
దీంతో రష్యాతో పాటు జపాన్(Japan), అమెరికాలోని (America) పలు తీర ప్రాంతాలను తాకింది. ఇంకా పలు దేశాలు, దీవులకు సునామీ తాకే అవకాశం ఉంది. సునామీ ముప్పు పొంచి ఉన్న దేశాలు, దీవుల జాబితాను అమెరికా సునామీ వార్నింగ్ సిస్టమ్ విడుదల చేసింది. సునామీ ప్రభావాన్ని బట్టి నాలుగు కేటగిరీలుగా ఆ జాబితాను ప్రకటించింది. అమెరికాలో 2011లో సంభవించిన తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపం (Earthquake) అని అధికారులు పేర్కొన్నారు. సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అలర్ట్‌గా ఉండాలని రష్యా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. భూకంపనాలకు ప్రజలు భయాందోళనతో వీధుల్లోకి పరుగులు తీశారు. ఇళ్లలోని క్యాబినెట్‌లు కూలిపోవడం, అద్దాలు విరిగిపోవడం, రోడ్లపై నిలిపిన కార్లు ఊగడం వంటి సిసి టివి ఫుటేజీలు విడుదల అయ్యాయి. ఈ నెలలో రష్యాలో అనేక భూకంపాలు సంభవించాయి. జూలై 20న రష్యాలో ఒక గంటలోపు ఐదు భూకంపాలు సంభవించాయి. తాజాగా భూకంపంతో.. దాదాపు 30 దేశాలకు సునామీ హెచ్చిరలు జారీ చేశారు.
ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్..
పసిఫిక్ మహాసముద్ర (Pacific Ocean) తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి.దీంతో ముందు జాగ్రత్తగా.. తూర్పు జపాన్ లో రైల్వే సర్వీసులు నిలిపివేశారు. అమెరికా, ఫిలిపీన్స్, ఈక్విడార్ లకు సునామి హెచ్చరికలు జారీ చేశారు. కాలిఫోర్నియా (California) నుంచి వాషింగ్టన్ వర్క్ (Washington Work) సముద్ర తీర ప్రాంతాల్లో అలర్ట్ జారీ చేశారు. యుఎస్ జియోలాజికల్ సర్వే (US Geological Survey) భూకంప వార్తలను దృవీకరించింది. భూకంపం వలన ఆయా దేశాల ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యానికి తీవ్ర అంతరాయం కలిగింది.