తమిళనాడు లో (Tamil Nadu) విషాదం నెలకొంది. స్టార్ హీరో TVK పార్టీ (TVK Party) అధినేత విజయ్ దళపతి (Vijay Thalapathy) సభలో తొక్కిసులాట చోటు చేసుకుంది. ఇక విషయంలోకి వెళ్తే.. తమిళగ వెట్రి కళగం (Tamil Vetri Kalagam) (TVK)’ పార్టీ అధినేత విజయ్ తమిళనాడు మధురైలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో తొక్కిసలాట నెలకొని 400మంది అస్వస్థతకు గురయ్యారు. సభలో స్పృహ తప్పి పడిపోయిన 33 ఏళ్ల వ్యక్తిని మదురై ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లుగా సమాచారం. గాయపడిన వారిలో 12మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. దాదాపు 4 లక్షలకు పైగా విజయ అభిమానులు, పార్టీ కార్యకర్తలు సభకు హాజరైనట్లుగా అంచనా. సభలో రద్దీ కారణంగా తొక్కిసలాట నెలకొనడంతో 400 మందికి అస్వస్థత గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని ఆషుపత్రులకు తరలించారు. ఇక 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ (2026 Assembly Elections) గా దళపతి విజయ్ అడుగులు వేస్తున్నారు. వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇళయ దళపతి నటుడు విజయ్ వరుస పెట్టి మరి సభలు పెడుతున్నారు. ఇక ఈ సభ ప్రారంభానికి ముందే.. సభ కోసం ఏర్పాటు చేసిన 100 అడుగుల జెండా స్తంభం అకస్మాత్తుగా కూలిపోవడంతో ఒకరు మృతి చెందారు. ఆ విషాదం జరిగిన కొద్దిసేపటికే సభలో ఆకస్మికంగా తొక్కిసలాట చోటు చేసుకుంది.
మదురైలో గురువారం టీవీకే రెండో వార్షికోత్సవ సభను నిర్వహించారు. ఈ సభకు లక్షలాది మంది ఆయన అభిమానులు తరలిరాగా.. సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దీంతో తోపులాటకు దారితీయగా.. వందల మంది ఊపిరాడక కింద పడిపోయారు. వారిలో చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఎన్నికల బరిలోకి తమిళగ వెట్రి కళగం దిగబోతుందని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేస్తుందని విజయ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.