మదురైలో టీవీకే పార్టీ ఏర్పాటు చేసిన 100 అడుగుల జెండా స్తంభం అకస్మాత్తుగా కూలిపోవడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన మహనాడు ఏర్పాట్ల సమయంలో జరిగింది. ఈ దుర్ఘటనతో అభిమానులు, పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
TVK Party Madurai : తమిళనాడు మదురైలో హీరో విజయ్(Vijay Thalapathy) స్థాపించిన టీవీకే (తమిళగ వెట్రి కళగం) (Tamil Vetri Kalagam) పార్టీకి సంబంధించిన ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. పార్టీ నిర్వహిస్తున్న రెండవ మహనాడు (TVK Vettri Maanadu) కోసం ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడం, అభిమానులను, స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
టీవీకే పార్టీ (TVK party) సమావేశం కోసం సుమారు 100 అడుగుల ఎత్తు గల భారీ జెండా స్తంభం మదురైలో ఏర్పాటు చేశారు. అయితే, మహనాడు ప్రాంగణం మధ్య నిలబెట్టిన ఈ జెండా స్తంభం ఒక్కసారిగా కూలిపోయింది( Flag Pole Collapse ). ఆ స్తంభం పక్కన పార్క్ చేసి ఉన్న కారుపై పడింది. కారు పూర్తిగా నుజ్జునుజ్జయి, అందులో ఉన్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఊహించని ఈ సంఘటన కారణంగా ఆ ప్రాంతంలో ఒక్కసారిగా పొలిసులు, రెస్క్యూ బృందాలు చేరుకుని పరిస్థితిని నియంత్రించారు. జెండా స్తంభం ఎందుకు కూలింది? అనే ప్రశ్నపై పోలీసులు విచారణ ప్రారంభించారు. నిర్మాణంలో లోపం, లేక బలమైన గాలులు కారణం అయ్యుండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఈ ఘటనపై టీవీకే (TVK) నాయకత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అధికారుల విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.