Mahesh Kumar Goud : జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్లుగా నే ఫలితాల సరళి ఉంది. బీఆర్ఎస్ లెక్కలు పని చేయలేదు. తొలి రౌండ్ నుంచే కాంగ్రెస్ మెజార్టీ కొనసాగింది. మూడో రౌండ్ లో బీఆర్ఎస్ స్వల్ప మెజార్టీ సాధించింది. ముందు నుంచి పక్కా ఉప ఎన్నిక కోసం అమలు చేసిన వ్యూహాలు ఫలితాన్ని ఇచ్చాయి. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ నేత టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ చేశారు.
ఇక విషయంలోకి వెళ్తే..
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా..! విజయం మాదే మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలోని జాబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ అత్యధిక మేజారీటితో దూసుకుపోతున్నాడు. వెలువడిన రెండు రౌండ్లలో 1,144 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ పై అధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ ఫలితాలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. జాబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కట్టబోతున్నారని చెప్పారు. నవీన్ యాదవ్ కు మంచి మెజార్టీ రావాల్సి ఉండేది కానీ .. ఓటింగ్ శాతం తగ్గడం ఫలితాలపై ప్రభావం చూపించింది అని ఆయన అన్నారు. ఇక షేక్‌పేట్ డివిజన్ ఫలితాల్లో బీజేపీ కి అసలు ఓట్ల పడలేదని.. షేక్ పేట్ ప్రజలు బీజేపీని తరమి తరమి కొట్టారని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. రెండు రౌండ్లు కలిపి లంకల దీపక్ రెడ్డికి కేవలం 307 ఓట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రమంతులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేసినా జూబ్లీహిల్స్ ఓటర్లు, షేక్ పేట్ ఓటర్లు పెద్దగా లెక్కచేయలేదు. ఇక ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ ఇంకా కొనసాగుతుంది వస్తుంది. ఇప్పటివరకు 8 రౌండ్ల ఓట్ల లెక్కింపు కంప్లీట్ అయ్యింది. ఈ 8 రౌండ్లలోనూ కాంగ్రెస్‌కు 1876 ఓట్ల ఆధిక్యం సాధించింది. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 21,495 ఓట్లు ఓట్ల లీడ్‌లో కొనసాగుతుంది. రౌండ్ రౌండ్‌కు మెజార్టీ పెరుగుతూ వస్తుంది. దీంతో జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కు గట్టి దెబ్బ తగిలినట్లే అని చెప్పాలి.