టాలీవుడ్ స్టార్ యాక్టర్, టీవీ యాంకర్ అనసూయ ఎదో ఒక వివాధంతో తరచు వార్తలో నిలుస్తుంది. తాజాగా మరో సారి యాంకర్ అనసూయ వార్తలో, సోషల్ మీడియాలో తెగ వైరలు అవుతుంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఓ షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవంలో అనసూయ పాల్గొన్నారు. స్టేజీపై స్పీచ్ ఇస్తుండగా కొందరు యువకులు అసభ్యకర కామెంట్స్ చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె… ‘చెప్పు తెగుద్ది’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘మీ ఇంట్లో మీ అమ్మ, చెల్లి, భార్య, కుటుంబ సభ్యులను ఇలాగే కామెంట్స్ చేస్తే మీరు ఊరుకుంటారా..? పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వాలంటూ మీ ఇంట్లో మీకు నేర్పలేదా..?’ అంటూ ఫైర్ అయ్యారు. ఈ ఘటన తాలూకు వీడియో బయటకు రావడంతో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన నెటిజన్లు అలానే బుద్ధి చెప్పాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.