Tollywood star hero as villain in superstar movie

Jailer2 : సూప‌ర్ స్టార్ మూవీలో విల‌న్ గా టాలీవుడ్ స్టార్ హీరో

కోలీవుడ్ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా కూలీ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ ప‌నులు ముగించుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ లో బిజీగా ఉంది. ఆగ‌స్ట్ 14న ఈ సినిమా రిలీజ్ కు రెడీ కానుంది. ఈ మూవీ రిలీజ్ అవ‌క‌ముందే ర‌జినీ త‌న నెక్ట్స్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాడు.

జైల‌ర్ సినిమాకు సీక్వెల్ గా జైల‌ర్2 ను మొద‌లుపెట్టాడు ర‌జినీకాంత్. డైరెక్ట‌ర్ నెల్స‌న్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ సీక్వెల్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు కోలీవుడ్ వ‌ర్గాల్లో చక్క‌ర్లు కొడుతుంది. జైల‌ర్2 లో విల‌న్ రోల్ కోసం అక్కినేని నాగార్జున ను చిత్ర మేక‌ర్స్ సంప్ర‌దించార‌ని టాక్. ఆల్రెడీ కూలీలో ర‌జినీతో క‌లిసి నాగ్ న‌టించిన విష‌యం తెలిసిందే.

ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రి కాంబినేష‌న్ ను వ‌ర్క‌వుట్ చేయాల‌ని జైల‌ర్2 మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. అయితే ఈ విష‌యంలో నాగ్ ఇంకా త‌న డెసిష‌న్ ను వెల్ల‌డించలేద‌ని తెలుస్తోంది. నాగ్ జైల‌ర్2 లో న‌టిస్తాడనే వార్త ఇప్పుడు కోలీవుడ్ వ‌ర్గాల్లో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అనిరుధ్ సంగీతం అందించ‌నున్న జైల‌ర్2 సినిమాపై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *