Tollywood senior actor Kota Srinivas' last film

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కోట శ్రీనివాస‌రావు (Kota Srinivas) విల‌క్ష‌ణ న‌టుడిగా ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నారు. 1978లో చిరంజీవి (Chiranjeevi) సినిమా ప్రాణం ఖరీదు చిత్రంతో ఆయ‌న ఇండ‌స్ట్రీకి ఆరంగేట్రం చేశారు. కమెడియన్ గా , విలన్ (Villain) గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుమారు 850 సినిమాల్లో నటించిన ఆయ‌న‌ని భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.

Kota Srinivasa Rao | తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో (Telugu film industry) కోట శ్రీనివాస‌రావు విల‌క్ష‌ణ న‌టుడిగా ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నారు. 1978లో చిరంజీవి సినిమా ప్రాణం ఖరీదు చిత్రంతో ఆయ‌న ఇండ‌స్ట్రీకి ఆరంగేట్రం చేశారు. కమెడియన్ (Comedian) గా , విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుమారు 850 సినిమాల్లో నటించిన ఆయ‌న‌ని భారత ప్రభుత్వం పద్మశ్రీ (Padma Shri) పురస్కారంతో గౌరవించింది. అలాగే ఆయన నటనా ప్రతిభకు ప్రతీకగా తొమ్మిది నంది అవార్డులు (Nandi Awards) కూడా దక్కాయి. కోట శ్రీనివాస‌రావు నటుడిగానే కాకుండా రాజకీయ వేత్తగానూ రాణించారు. 1999- 2004 మధ్య కాలంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయ‌న తర్వాత పాలిటిక్స్‌ (Politics) కి దూరంగా ఉండి త‌న దృష్టి మొత్తం సినిమాల‌పైనే పెట్టారు. అనంత‌రం అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన ఆయన ఎక్కువగా సినిమాల్లో కనిపించలేదు. చివ‌రిగా పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లులో న‌టించారు కోట‌.

కోట న‌టించిన చివ‌రి చిత్రం హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు జులై 24న విడుద‌ల కాగా, ఆయ‌న‌ జూలై 13న కన్నుమూసిన విషయం తెలిసిందే. వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, తుదిశ్వాస విడిచారు. కోట మరణించిన 11 రోజుల‌కి ఆయన చివరిసారి నటించిన చిత్రం ‘హరిహర వీరమల్లు’ థియేటర్లలో విడుదలైంది. కొద్ది సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉన్నా, మంచి కథలు వస్తే నటించేందుకు ఆసక్తి చూపుతూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలో కొన్ని చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు కోట శ్రీనివాసరావు . అదే తరహాలో, పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) సినిమాలో ఆయన ఒక కీలక పాత్రలో నటించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *