నలిగిపోయిన నిధి..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. హైదరాబాద్‌లో జరిగిన ఓ సినిమా ఈవెంట్లో ఆమెకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. పాన్ ఇండియా హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా ‘ది రాజా సాబ్. ఈసినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతోంది. కాగా ఈమూవీ ప్రమోషనర్స్ ఊపందుకున్నాయి. ఈక్రమంలోనే రాజాసాబ్ సినిమాలోని ‘సహన సహన’ పాటను రిలీజ్ చేశారు టీమ్. ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్ ను బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిధి అగర్వాల్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈవెంట్ ప్రశాంతంగా కంప్లీట్ అయ్యింది. కానీ హీరోయిన్ బయటకు వెళ్లే సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఇక విషయంలోకి వెళ్తే…
హీరోయిన్ నిధి అగర్వాల్ నిన్న హైదరాబాద్ లులు మాల్ లో జరిగిన రాజాసాబ్ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో పాల్గొంది. ఈ ఈవెంట్ అనంతరం వెళ్లిపోతుండగా ఆమెని అభిమానులు చుట్టుముట్టి ఇబ్బంది పెట్టారు. అసభ్యకరంగా ప్రవర్తించారు అని చెప్పాలి. అవును నిజంనగా నిన్న జరిగింది అదే. పలువురు ఆమెని తాకుతూ, ఆమె బట్టలు పట్టుకొని, ఆమె దారికి అడ్డుగా ఉండి అసభ్యంగా ప్రవర్తించారు. అక్కడి నుంచి ఆమె వెళ్లిపోవడానికి చాలా కష్టపడింది. దీంతో నిధి అగర్వాల్ ని ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు హీరోయిన్స్ ని ఇలా ట్రీట్ చేస్తారా అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇంకాస్తా వివరాల్లోకి వెళ్తే..
కామంతో నిండిపోయిన ఫ్యాన్స్.. !
రాజా సాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. ఆమె ఇబ్బంది పడుతోందని స్పష్టంగా కనిపిస్తున్నా సరే ఉద్దేశపూర్వకంగా తన మీద పడిపోయి తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడం ఎంత మాత్రం హర్షణీయం అయితే కాదు. ఏ మాత్రం పరిస్థితి అదుపు తప్పినా చాలా దారుణం జరిగి ఉండేది. ఇది చేసింది ప్రభాస్ ఫ్యాన్సా నిధి ఫ్యాన్సా అన్నది కాదు ప్రశ్న. ఇలాంటి ప్రవర్తనతో యువత ఏం చెప్పాలనుకుంటున్నారేది అసలు ప్రశ్న. దీనికి సమాధానం దొరకటం కష్టం. ఎందుకంటే ఈ ఘటనకు కారణమైనవాళ్లకు విచక్షణ లేదు, సోయి లేదు, కామంతో కాళ్లు నిండిపోయాయి. ఆమె ఏసుకున్న బట్టల వాళ్లును ఊసగోప్లాయా అంటే.. 100కు 100 శాతం అది తప్పు. ఈ సమాజంలో ఎవరికి వాళ్ల ఇష్టం వచ్చినట్లు దుస్తులు దరించ వచ్చు. అది వాళ్ల హక్కు. 100 మందిలో ఒక్క యువతి.. ఒకే ఒక్క యువతి హద్దులు దాటిన అభిమానం తో నలిగిపోయింది. ఇక్కడ ఇంకో మాటా చెప్పాలి. నేను వీళ్లని అభిమానం అని అనను. ముమ్మాటికి కామం అనే అంటాను. ఆమె ఇప్పుడు హీరోయిన కావచ్చు.. ఎన్నో సినిమాలు చేసి ఉండోచ్చు. కానీ అంతకు ముంద ఆమె ఒక మహిళ అని గుర్తుందా.. మీ ఇంట్లో ఎవరైన బయటకు వెళ్లినప్పుడు 10 మంది మొగోళ్ల మధ్య మీ ఇంట్లో అమ్మ గానీ, అక్క గానీ, చెల్లి గానీ చూట్టి ముడితే ఎలా ఉంటది. నాకు తెలుసు ఇలా మాట్లాడితే మీకు కోపం రావచ్చు. ఈ మాటలు విన్న మీకే ఇంత కోపం వస్తే.. నేరుగా ఆ పరిస్థితిని ఎదుక్కొన్న నిధి అగర్వాల్ కు ఎలా ఉంటది. ఇన్ని రోజులు గౌరవంగా తనకు వచ్చిన పినిని పద్దతిగా చేసుకుంటు పోతుంది తప్పా.. ఏ నాడు సమాజం పట్ల వ్యతిరేకంగా ఉండలేదే. అలాంటప్పుడు మీరేందుకు ఇలా ఆమె పట్ల అసభ్యకరంగా.. నీచంగా.. కామంగా ప్రవర్తించారు.
నిధికి దేవుళ్లుగా వచ్చిన బాడీ గాడ్స్
ఒక్క సారి ఆలోచిండండి. ఆ క్షణంలో.. అక్కడ నిధి అగర్వాల్ చూట్టు బాడీ గాడ్స్ లేక పోతే ఆమె పరిస్థితి ఎలా ఉండేది. ఊహించుకుంటేనే భయంగా ఉంది. అందరు అలా ఉన్నారు అని చెప్పడం లేదు. కానీ అక్కడ ప్రవర్తించిన తీరు.. సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలు అన్ని కూడా అందుకు గట్టిగా ఆ కోణంలోనే ఆ ఆలోచనలోనే ఉన్నట్లు స్పష్టంగా అర్ధం అవుతుంది. ఆ క్షణంలో ఆమె బాడీ గాడ్సే ఆమెకు దేవుల్లు.. నాకు తెలిసి ఈ ఒక్క పనితో… నిధి ఆగర్వాల్ ఆ బాడీ గాడ్స్ కి జీవితాంత రుణపడి ఉంటది. స్టార్లను దగ్గరి నుంచి చూడాలనుకోవడం తప్పు కాదు. కానీ అది హద్దుల్లో ఉండాలి. హద్దులు మీరేతే మొన్న సంధ్య థియేటర్ లో జరిగిగన అనార్ధాలే ఎదురైవుతాయి. తప్పు జరిగే అవకాశం ఉందని తెలిసినప్పుడు అక్కడి నుంచి తప్పుకోవాలి. అలా కాకుండా బరితెగించి వాళ్ళ మీద పడిపోవడం, ఎక్కడ పడితే అక్కడ తాకడం ఏంది.. సిగ్గు ఉండాలి కధా ఇలా చేసేందుకు. ప్రతి సారి ఇలాగే జరిగితే.. భవిష్యత్తులో హీరో హీరోయిన్లను బయటికి రావాలంటేనే భయపడుతారు. వాళ్లుకు ఉంటుంది. నా అభిమానులను కలవాలి. వాళ్లతో ముచ్చటించాలి అని. కానీ కొందరు తిటగాండ్లు పబ్లిక్ లో ఇలాంటి పనులు చేస్తున్నారు. దీంతో హీరో, హీరోయిన్లు పబ్లిక్ ని కలిసే ఇలాంటి చిన్న అవకాశాలను కూడా పోగొట్టినట్టు అవుతుంది.
నిధి అగర్వాల్ ఘటనపై విమర్శలు..
ఈ ఘటనపై పలువురు నెటిజన్లు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. సంచలన గాయని చిన్మయి శ్రీపాద ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “హైనాల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్న మగవాళ్ల గుంపు. ఇది వేధింపు కాదా?” అంటూ ఆమె తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మరోవైపు, ఈవెంట్ ను నిర్వహించినవారిపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈతప్పు అక్కడి అభిమానులది కాదు.. మూవీ టీమ్‌దే. ఇంత చిన్న ప్రదేశంలో ఈవెంట్ ఎలా ప్లాన్ చేస్తారు? నిర్వహణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. సెలబ్రిటీల బద్రతపై ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా.. మరికొందరు మాత్రం “వీళ్లు అభిమానులు కాదు, అభిమానుల ముసుగులో ఉన్న రాబందులు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫ్యాన్స్ విషయంలో బాలయ్య కరెక్ట్..
గతంలో ఒకసారి పూరి జగన్నాథ్ అన్నట్టు బాలయ్య తన దగ్గరికి వచ్చే ఫ్యాన్స్ మీద అప్పుడప్పుడు చేయి చేసుకోవడం రైటేనని, సైకోలు, సాడిస్టులు ఆ గుంపులో కలిసిపోయి ఉంటారు. కాబట్టి ఎవడైనా లిమిట్స్ దాటితే బాలయ్య చేతి దెబ్బ రుచి చూస్తారని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు జరిగిన ఘటన చూస్తే అదే రైటనిపిస్తోంది. బహుసా రేపు రేపు ఇలాగే చేయాలేమో మరి. ఇది వాళ్ల ఒక్కరిపైనే నింద వేయలేం.. ఇక్కడ నిర్వాహకుల తప్పు కూడా ఉంది. ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా మూవీ వేడుక చేయాలనుకున్నప్పుడు లులు మాల్ లాంటి బిజీ ప్లేస్ ని ఎంచుకోకూడదు. సెక్యూరిటీ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. చోటు విశాలంగా ఉన్నప్పటికీ వేలాది మంది ఒకేసారి వస్తే అవి అకామిడేట్ చేయలేవు. అలాంటప్పుడు కనీసం శిల్పకళా వేదిక లాంటి వాటిని ఎంచుకోవాలి. కానీ పబ్లిసిటీ కోసం ఇలా మాల్స్ ఎంచుకోవడం కరెక్ట్ కాదు. ఏది ఏమైనా నిధి అగర్వాల్ విషయంలో జరిగింది తప్పు. ఇకపై ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే ఫ్యాన్స్ తమకు తాము మార్పు తెచ్చుకోవాల్సిందే. లేకుంటే సినిమాలో తప్ప నిజ జీవితంలో.. హీరో, హీరోయిన్లను చూడటం సాధ్యం కాదు. బహుశా ఇందుకేనేమో.. మన డార్లింగ్ ప్రభాస్ ఈవెంట్స్ కి గానీ, పార్టీస్ కి గానీ, రిలీజ్ కి, రీ రిలీజ్ కి గానీ రారు. ఏది ఏమైనా.. ఇలా ముమ్మాటికి తప్పే.

Leave a Reply