These are the Bigg Boss contestants.. This time it's a double house..?

Boss Telugu 9 : బిగ్ బాస్.. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న తెలుగు లైవ్ రియాల్టీ షో. ఈ సీజన్ గత సీజన్ కంటే వెరైటీగా ఉండనున్నట్లు ఇప్పటికే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున హింట్ ఇచ్చారు. దీంతో బిగ్ బాస్ (Big Boss) ప్రేక్షకులకు మరింత ఎంటైన్మెంట్ దొరికినట్లు అయ్యింది. ఇక విషయంలోకి వెళ్తే.. బిగ్ బాస్ తెలుగు మరో కొత్త సీజన్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 8 సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు 9వ సీజన్ తో రాబోతుంది.

బిగ్‌బాస్ సీజన్ 9..

బిగ్‌బాస్ తెలుగు 9 (Bigg Boss Telugu 9) మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈసారి హౌస్‌లో మామూలుగా ఉండదని, అందరి సరదా తీర్చేస్తానని అక్కినేని నాగార్జున ముందే చెప్పారు. దీనికి తగినట్లుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బిగ్‌బాస్‌లో ఈసారి సామాన్యులకు కూడా గేట్లు తెరిచారు.. పలువురు సామాన్యులను ఇంట్లోకి పిలుస్తానని చెప్పిన బిగ్‌బాస్.. ఈ కామన్‌మెన్ల (Commoners) ఎంపిక కోసం బిగ్‌‌బాస్ అగ్నిపరీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 4 ఎపిసోడ్స్ పూర్తికాగా.. తాజాగా 5వ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఇప్పటికే 8 సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు 9వ సీజన్ తో రాబోతుంది.

సీజన్ లాంచ్ డేట్ ఫిక్స్..

ఇక ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక.. షో ఫార్మాట్ ప్రణాళికలు పూర్తవగా.. తాజాగా సీజన్ లాంచ్ డేట్ (Season launch date) అనౌన్స్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 7 నుంచి బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఎప్పటిలాగే సీజన్ 9 కి కూడా నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తారు. అయితే గత సీజన్ల కంటే సీజన్ 9 డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ప్రోమోలో నాగార్జున డబుల్ హౌస్, డబుల్ డోస్ అని చెప్పడం ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది. దీని ప్రకారం ఈ షాలో రెండు హౌస్ లో ఉంటాయని తెలుస్తోంది. ఒక హౌస్ లో సెలెబ్రెటీలు, మరో హౌస్ లో కామనర్స్ ఉంటారు. మొత్తానికి సెలెబ్రెటీస్ వర్సెస్ కామనర్స్ (Celebrities vs. Commerce) గా సీజన్ రసవత్తరంగా ఉండబోతుంది. ఇక ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ జాబితా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ.. కొంత మంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సాయి కిరణ్, ఛత్రపతి శేఖర్, ఇమ్మాన్యుయెల్ (Emmanuel), సుమంత్ అశ్విన్, ముఖేష్ గౌడ, శివ కుమార్, రీతూ చౌదరీ (Ritu Chaudhary), దీపికా, కావ్య శ్రీ, తేజస్విని, దేబ్జానీ, అలేఖ్య చిట్టి పికిల్స్ (Alekhya Chitti Pickles), నవ్యసామి, మై విలేజ్ షో అనిల్ హౌస్ లోకి వెళ్ళబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఈ సారి బిగ్ బాస్ రసవంతంగా ఉండబోతున్నట్లు.. తాజా ప్రోమోతో అర్ధం అయ్యింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *