There is a commotion in the Bigg Boss house.. a fight between Tanuja and Emmanuel.

బిగ్​బాస్ సీజన్ 9 (Bigg Boss Season 9) తెలుగు 44వ రోజుకు చేరుకుంది. సోమవారం అంతా నామినేషన్స్ రచ్చ జరగ్గా.. మంగళవారం కూడా నామినేషన్స్​కి తర్వాత జరిగిన రచ్చనే కొనసాగింది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల చేసింది స్టార్ మా. కళ్యాణ్ మోసం చేయడంతో తనూజకు (Tanuja) ఇమ్మాన్యుయేల్​కు (Emmanuel) మధ్య గట్టిగా గొడవ జరిగింది. ఇన్ని రోజులు జంటగా కలిసి ఉన్న తనూజ, ఇమ్మాన్యుయేల్ మధ్య గొడవ జరిగింది. ప్రోమోలో ఏమి ఉందంటే.. వాడు (కళ్యాణ్) (Kalyan) నామినేట్ చేయలేదు అనిసి లేచి వాయిస్ రైజ్ చేయడం ఏంటో నాకు అర్థం కాలేదని దివ్యకు చెప్తుంది. నాకు అర్థమే కాలేదు ఆ పాయింట్ అనేసరికి ఇమ్మాన్యుయేల్ వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించగా.. నో డా.. నువ్వు మాట్లాడకు అంటుంది. దీంతో ఇమ్మూ.. ఇప్పుడు కళ్యాణ్ అనేవాడు తనూజని నామినేట్ చేయడానికి నా దగ్గర పాయింట్లు ఉన్నాయి అన్నాడు అందుకే ఇచ్చాను అంటూ దివ్యకి చెప్తాడు. దీంతో తనూజ – ఇమ్మానుయేల్ ఒకర్నొకరు దారుణంగా దూషించుకున్నారు.

అసలేం జరిగింది..?

మొదటిగా తనూజ.. ఇమ్మానుయేల్ (Tanuja – Emmanuel) గురించి దివ్య నిఖిత (Divya Nikhitha) దగ్గర తన బాధను పంచుకుంటుంది. కళ్యాణ్ తనని నామినేట్ చేయలేదని వీడు లేచి వాయిస్ పెంచడానికి ఎంత ధైర్యం అని అన్నది. ఇంతలో ఇమ్మానుయేల్ వచ్చి.. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. లేదు.. నేను నీతో మాట్లాడాలని లేదు అని అన్నది తనూజ. దాంతో ఇమ్మానుయేల్.. ‘కళ్యాణ్ అనేటోడు తనూజని నామినేట్ చేయడానికి నా దగ్గర పాయింట్లు ఉన్నాయని అన్నాడు అందుకే అడిగా.. నా నామినేషన్ పాయింట్ క్లియర్‌గా ఉంది.. నువ్వు నామినేట్ కావాలనుకున్నాను.. అదే చెప్పాను’ అని అన్నాడు ఇమ్మానుయేల్. మరి ఆ విషయం నువ్వు చెప్పాలి కదా? అంటూ ఇమ్మానుయేల్‌తో వాదనకు దిగింది తనూజ. దివ్యతో.. తినకి రమ్యని చేయాలని.. రమ్యకి తినని చేయాలని ఉంది. ఒకరికిచ్చి ఇంకొకరికి ఇవ్వకుంటే పార్షయాలిటీ చూపించినట్లు ఉంటుంది. అందుకే ఇచ్చాను అని ఇమ్మూ చెప్తాడు. వాళ్లు వాళ్లు చూసుకుంటారు కదా నాకేంటి అంటాడు. అది విన్న తనూజ సూపర్ గేమ్ అంటూ క్లాప్స్ కొడితే ఇమ్ము కూడా అదే రిపీట్ చేస్తాడు. గో అహెడ్ ఇమ్మాన్యుయేల్ అనగా.. గో అహెడ్ తనూజ అంటాడు. ఇలాంటి వ్యక్తినా నేను సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను అని బాధేసింది అనేసరికి ఎవరూ ఎవరికోసం నిలబడలేదని తనూజా అంటుంది.

బిగ్ బాస్ లో గ్యాంగ్ లీడర్స్..

ఇక ఇది ఇలా ఉంటే.. బిగ్‌బాస్ తాజాఎపిసోడ్ మరింత ఎంటర్‌టైనింగ్‌గా (Entertainment) మారింది. ఎపిసోడ్‌లో ఎమర్జెన్సీ సైరన్ మోగడంతో హౌస్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. హౌస్‌మేట్స్ అందరికీ బిగ్‌బాస్ మాస్ లుక్‌లో టాస్క్ ఇచ్చాడు. ఈసారి హౌస్ మొత్తం గ్యాంగ్‌స్టర్ జోన్గా మారిపోయింది. బిగ్‌బాస్ ప్రకటించాడు. ఇకపై హౌస్‌లో ఇద్దరు గ్యాంగ్ లీడర్స్ ఉన్నారు. ఒకరు మాస్ మాధురి, మరొకరు సంజన సైలెన్సర్” అని. ఇక మిగతా సభ్యులంతా రౌడీ, గూండా గెటప్స్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఇక “ఈ వారం మీ అందరికీ కంటెండర్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఆ నిర్ణయం గ్యాంగ్ లీడర్స్ చేతుల్లో ఉంది. ఎవరి టీమ్‌లో ఎక్కువ మంది ఉంటారో, ఆ లీడర్ కంటెండర్ అవుతారు.” దీంతో మాధురి, సంజన ఇద్దరూ తమ గ్యాంగ్‌లోకి ఎక్కువ మందిని చేర్చుకునేందుకు యత్నించారు. మాధురి అయితే నిజంగానే రౌడీ స్టైల్లో “నువ్వు నా టీమ్‌లో ఉంటావా లేదా?” అంటూ భయపెట్టింది. ఇక ఇమ్మానుయేల్ తన కామెడీతో అందరినీ అలరించాడు . “మా అక్కతో పెట్టుకుంటే ఎవరైనా ఎలిమినేషన్!” అంటూ మాధురిని జోక్ చేశాడు. ఈ టాస్క్ మొత్తం కామెడీ, మాస్ డైలాగులతో నిండిపోయింది. ముఖ్యంగా ఇమ్మానుయేల్ జోకులు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *