- సింగూరు ఇన్ డేంజర్..
- సింగూరు ప్రాజెక్టుకు డేంజర్ బెల్స్..
- పూర్తిగా నిండిపోయిన సింగూరు ప్రాజెక్టు
- ప్రాజెక్టుకు భారీగా పొట్టేత్తిన వరద
- గత ఏడాది ఆనకట్టకు బుంగ
- నాడు తాత్కాలిక మరమ్మతులతో సరి
- శాశ్వత మరమ్మతులు చేపట్టని వైనం
- ప్రస్తుతం నిండు కుండలా.. సింగూరు ప్రాజెక్టు
- ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం..
తెలంగాణలో విస్తారంగా వర్షాలు కుస్తున్నాయ్. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో సహా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుంన్నాయి. ఇక తెలంగాణలో ప్రధాన నది అయిన ముసీ నదికి భారీగా వరదు వచ్చి చేరుతోంది. దీంతో మూసీ పై ఉన్న ప్రధాన ఆయకట్లు అన్ని నిండు కుండాల తలపిస్తున్నాయి. ఇక తాజాగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మంజీర నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు కు భారీగా వదర పెట్టేత్తింది. దీంతో సింగూరు ప్రాజెక్టు కు జలకళ సందరించుకుంది. ఇక ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు కర్నాటక నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక భారీ వరదకు.. సింగూరు ప్రాజెక్టు భద్రతపై ఆందోళన నెలకొంది.
ఇక విషయంలోకి వెళ్తే…
ఇక రాష్ట్ర వ్యాప్తంగా విస్తరాంగా వర్షాలు కురుస్తుండటంతో.. సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద పెట్టేత్తింది. దీంతో సింగూరు భద్రత పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరులో 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ రిజర్వాయర్‌కు ప్రమాదం పొంచి ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరులో 29.91 టీఎంసీల సామర్థ్యంతో 1976లో సింగూరు రిజర్వాయర్ నిర్మాణం ప్రారంభించగా.. 1989లో పూర్తయింది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 6.96 టీఎంసీలను కేటాయించడంతోపాటు ఘన్‌పూర్ ఆనికట్, నిజాం పరిధిలోని సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు మంజీరా నదిలో పూడికను కట్టడి చేయడానికి వీలుగా ఈ ప్రాజెక్టు నిర్మించారు.తాజా వర్షాలతో భారీగా వరద నీరు పోటెత్తుతోంది. 29.917 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్‌లో ప్రస్తుతం 21 టీఎంసీలకు చేరడంతో ఏ గేట్లు ఎత్తే వరదని దిగువ విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు టూరిస్ట్ స్పార్ట్ గా పర్యటకులతో సందడి నెలకొంది. అయితే గతంలో భారీ వరదకు.. భారీ ఉదురు గాళులకు.. అలల తాకిడికి కట్ట లోపలి భాగంలోని రివిట్‌మెంట్ దెబ్బతిని బుంగ పడింది.
తాత్కాలిక మరమ్మతులే..!
గతేడాది అప్పటి సంగారెడ్డి కలెక్టర్ శరత్ రిజర్వాయర్ కట్టకు పడిన బుంగను పరిశీలించారు. అధికారులు అప్పుడు చిన్న పరిమాణంలో ఉన్న కంకర చిప్స్‌ను సంచుల్లో నింపి దానికి అడ్డుగా వేశారు. అయితే ఆ సంచులన్నీ చిరిగిపోయి కంకర చిప్స్ చెల్లాచెదురయ్యాయి. ఇప్పుడు మళ్లీ రిజర్వాయర్‌లో అలల తాకిడి పెరిగింది. ఈసారీ కంకర చిప్స్ సంచులతో తాత్కాలిక మరమ్మతులు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. నాడు సమయం లేకపోవడంతో కంకర చిప్స్ బ్యాగులతో తాత్కాలిక మరమ్మతులకే పరిమితమయ్యారు కానీ శాశ్వత మరమ్మతులు చేపట్టలేదు. ఈసారి కూడా కొత్తగా కంకర చిప్స్‌ను నింపి దెబ్బతిన్న రివిట్‌మెంట్ వద్ద పరిచారు.
నిండు కుండలా సింగూరు డ్యాం..
ఇక ప్రస్తుతం.. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూర్ వద్ద 29.917 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 20.817 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్ ఫ్లో 3688 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 633 క్యూసెక్కులు కొనసాగుతున్నాయి. 523.600 మీటర్లకు 521.762 మీటర్ల వరకు నీళ్లు ఉన్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఇప్పటివరకు దాదాపు 3 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. ఇక వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే నాటి బుంగ మళ్లీ బయటపడే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే కట్ట ప్రమాదంలో పొంచి ఉన్నట్లే. ఇక ప్రాజెక్టుకు 17 గేట్లు ఉండగా ఒక గేటు నుంచి నీరు లీకేజీ అవుతున్నా గుర్తించారు. రిజర్వాయర్ నిండుకుండలా మారడంతో ప్రస్తుతం లీకేజీకి మరమ్మతులు చేసే పరిస్థితి లేకుండాపోయింది. ప్రస్తుతం డ్యాంకు ఏమైనా ప్రమాదం జరిగితే… దిగువన ఉన్న మంజీరా బ్యారేజీ, నిజాంసాగర్‌తోపాటు చెక్‌డ్యామ్‌లు కూడా దెబ్బతింటాయని పేర్కొంది.
మిషన్ భగీరథ వల్లే.. ప్రాజెక్టుకు ప్రమాదం..?
ఇక ఈ ప్రాజెక్టు ప్రమాదంలో పడటానికి మరో ప్రధాన కారణం ఉంది. సింగూరు రిజర్వాయర్ డిజైన్ ప్రకారం 517.8మీటర్ల దాకా నీటిని నిల్వ చేయాల్సి ఉండగా.. మిషన్ భగీరథ అవసరాల కోసం 520.50 మీటర్ల మేర నిల్వ చేసేందుకూ అనుమతి ఇస్తూ 2017 అక్టోబరు 30న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కొన్నేళ్లుగా రిజర్వాయర్‌లో 522 మీటర్ల కన్నా ఎక్కువగా నీటిని నిల్వ చేస్తున్నారని కమిటీ గుర్తించింది. ఈ కారణం వల్లే జలాశయం తీవ్రంగా దెబ్బతిందని తేల్చింది. క్రమంగా కట్ట దెబ్బతినడమే కాకుండా మరమ్మతులకు అవకాశం లేకుండా పోయిందని వెల్లడించింది. దెబ్బతిన్న రివిట్‌మెంట్‌ను అత్యవసరంగా సరిచేయకపోతే ఏ క్షణంలోనైనా గండి పడే అవకాశం ఉందని అప్పటి కమిటీ తెలిపింది. 2016, 2019, 2024లో మొత్తం నాలుగు సార్లు సింగూరు జలాశయాన్ని తనిఖీ చేసి.. స్పిల్‌వే, ఎర్త్‌డ్యామ్, గ్యాలరీలకు తక్షణమే మరమ్మతులు చేయాలని సిపారసులు చేసినా… పట్టించుకోలేదని గుర్తు చేసింది. తక్షణమే మరమ్మతులకు ఉపక్రమించకపోతే ఏ క్షణంలోనైనా ఆనకట్ట తెగే ప్రమాదం ఉందని ఆనకట్ట భద్రత సమీక్ష కమిటీ (డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్) ఆందోళన వ్యక్తం చేసింది. డ్యామ్ ఎగువ భాగంలో రాళ్లతో కూడిన రివిట్‌మెంట్ దెబ్బతిన్నదని, దీన్ని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేయాలని సూచించింది. నిర్ణీత కాలవ్యవధిలోగా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.