అపర కుబేరుడు ఎలన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లగ్జరీ ఎలక్ట్రిక్ వాహన (Electric vehicle) తయారీ దిగ్గజం టెస్లా.. భారత్ మార్కెట్‌లోకి అధికారికంగా అడుగుపెడుతోంది. ఈ మేరకు తొలి షోరూమ్‌ను దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది.
ఇక విషయంలోకి వెళ్తే…
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా భారత్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తొలి షోరూం ప్రారంభించనున్నట్లు తెలిసింది. అంటే జులై 15న టెస్లా భారత్‌లో తొలి షోరూంను అఫీషియల్‌గా లాంఛ్ చేయనున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. ముంబై జియో వరల్డ్‌లో ఈ షోరూం ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే టెస్లా సంస్థ వై మోడల్ కార్లను చైనా (China) లోని షాంఘై నగరంలో గల తమ ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చినట్లు సమాచారం.
ఈ షోరూం కోసం ముంబై నడిబొడ్డున బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) బిజినెస్ (Business) డిస్ట్రిక్ట్‌లో 4,000 చదరపు అడుగుల స్థలాన్ని టెస్లా సంస్థ అద్దెకు తీసుకున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పార్కింగ్ సౌకర్యాలుగల ఈ షోరూమ్ స్పేస్‌కుగాను కంపెనీ ప్రమోటర్, బిలియనీర్ ఎలాన్ మస్క్ (Billionaire Elon Musk) నెలకు రూ.35 లక్షల అద్దె చెల్లించనున్నారని తెలిసింది. అద్దె ఏడాదికి 5 శాతం పెంపు ప్రాతిపదికన ఐదేళ్ల కాలానికి యూనివ్‌కో ప్రాపర్టీస్ నుంచి లీజుకి తీసుకుంది. ఈ ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్ దేశీయంగా ఏర్పాటైన తొలి యాపిల్ స్టోర్‌కు దగ్గరగా ఉంటుంది. రెంటల్ అగ్రిమెంట్ ఫిబ్రవరి 27న రిజిస్టరైంది. రూ.2.11 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్‌గా కూడా టెస్లా జమ చేసినట్లు సమాచారం.
నిజానికి మెదీ అమెరికా పర్యటన సమయంలోనే భారత్‌లో టెస్లా విస్తరణకు బీజం పడింది.కానీ కొన్ని కారణాల వల్ల ఇన్నాలు టెస్లా భారత్లో షోరూం పెట్టలేదు. తాజాగా టెస్లాక్ భారత్ మార్కెటింగ్ గేట్లు తెరిచింది. ఆటోమొబైల్ (Automobile) రంగంలో కొత్త ఒరవడి సృష్టించిన టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌కు ఈసారి భారత్‌ను ఎంచుకుంది. యూరప్ (Europe), చైనాలో అమ్మకాలు పడిపోవడంతో ఇండియాలో సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో ఉంది ఎలాన్ మస్క్ సంస్థ. అందులో భాగంగానే ముంబైలో తమ తొలి షోరూంను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లలో అత్యధిక అమ్మకాలతో రికార్డు నెలకొల్పిన వై మోడల్ కారు ధర పన్నులు, బీమా కలిపితే రూ. 48 లక్షలపైనే ఉండనుంది.
ముంబైలోని షోరూమ్‌కు వచ్చే స్పందనను బట్టి, టెస్లా తన తదుపరి షోరూమ్స్‌ను ఢిల్లీలో, బెంగళూరులో ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా బెంగళూరులో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి స్టార్టప్ కల్చర్, సాంకేతిక మద్దతు దృష్ట్యా అది కీలక కేంద్రంగా మారనుంది. భారత మార్కెట్లో వ్యాపారం విస్తరించాలన్న ఉద్దేశంతో టెస్లా, దేశీయంగా ఎలక్ట్రిక్ కార్ల అసెంబ్లీ ప్లాంట్ స్థాపన పై సైతం ఆలోచిస్తోంది. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఈ ఉద్దేశంతో ఇప్పటికే టెస్లా ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
Suresh