Terrorist threat to Indian airports.. What will happen on September 22nd..?
  • భారత దేశానికి మరో ఉగ్ర ముప్పు పొంచి ఉందా..?
  • విమానాశ్రయాల వద్ద హై అలర్ట్..
  • దేశవ్యాప్తంగా ఎయిర్ పోర్టులో ఉగ్ర ముప్పు..
  • సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 మధ్య ఏం జరగబోతుంది.
  • హెచ్చరికలు జారీ చేసిన ఇంటెలిజెన్స్ బ్యూరో
  • భద్రత పెంచాలని ఆదేశించిన సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ
  • అన్ని విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్న ఎయిర్ లైన్స్
  • ఎయిర్ పోర్టులకు వెళ్లే అన్ని వాహనాలు తనిఖీ

భారత దేశానికి మరో సారి ఉగ్ర ముప్పు పొంచి ఉందా అంటే… అవుననే సమాధానం వినిపిస్తుంది. దేశంలో విమానాశ్రయాలకు భద్రత ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. దేశంలో ఉన్న ఎయిర్ పోర్టులపై ఉగ్ర, సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిగా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అప్రమత్తమైంది. దేశంలో అన్ని విమానాశ్రయాల్లో భద్రత పెంచాలని సూచించింది. విమానాశ్రయాలు రన్వేలు హెలిపాడ్స్, ఫ్లయింగ్ స్కూల్క్ కు భద్రత పెంచాలని అడ్వైజరీ జారీ చేసింది.

సెప్టెంబర్ 22న ఏం జగరబోతుంది..?

అవును మీరు విన్నది నిజమే.. కాశ్మీర్ నుంచి కన్యా కుమారి.. గుజరాత్ నుంచి మణిపూర్ దాకా దేశంలో ఉన్న అన్ని ఎయిర్ పోర్టులకు హై అలర్ట్ ప్రకటించారు. ఒక్క విధంగా చెప్పలంటే.. ప్రస్తుతం ఎయిర్ పోర్టులన్ని కూడా Z + సెక్యూరిటితో ఉన్నాయి. ఎయిర్ పోర్ట్ గానీ ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో గాని చిన్న పెలుడు సంభంవించినా.. క్షణాల్లో రియాక్ట్ అవ్వతుంది. తాజా ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్ పోర్ట్ లకు ఉగ్రముప్పు ఉందని హెచ్చరించాయి. అది కూడా ఫలాన డేట్ నుంచి జరగబోతున్నాయి అంటూ కూడా చెప్పేశాయి. 2025 సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 మధ్య ఎప్పుడైనా దాడులు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో అన్ని ఎయిర్ పోర్ట్ లకు హై అలెర్ట్ ప్రకటించారు.

బీసీఏఎస్ ఆదేశాల మేరకే..

ఆగస్టు 4న బీసీఏఎస్ జారీ చేసిన అడ్వైజరీ ప్రకారం, అన్ని విమానాశ్రయ కేంద్రాల్లో భద్రతను తక్షణమే బలపర్చాలని సూచించబడింది. టెర్మినల్లు, పార్కింగ్ ఏరియాలు, బౌండరీలు, సిటీ సైడ్ ప్రాంతాల్లో సెక్యూరిటీ పెట్రోలింగ్ నిరంతరం కొనసాగించాలని ఆదేశించింది. ఇక ఎయిర్పోర్టులలో ప్రతి ఉద్యోగి, కాంట్రాక్టర్, సందర్శకుడి ఐడీని ఖచ్చితంగా పరిశీలించాలని, సీసీటీవీ వ్యవస్థలు పూర్తిగా పనిచేసేలా చూసుకోవాలని.. అలాగే సిటీ సైడ్ భద్రతను లోకల్ పోలీసులతో కలిపి పటిష్టంగా నిర్వహించాలని కేంద్ర ఇంటెలిజెన్స్ పేర్కొంది. ముఖ్యంగా అంతర్జాతీయ, దేశీయ విమానాలన్నింటికీ బీసీఏఎస్ ఆదేశాలు వర్తిస్తాయి. ప్రతి కార్గో, మెయిల్, పార్సెల్ను ఎంబార్మెంట్కు ముందు కఠినంగా స్క్రీన్ చేయాలి. ఈ ముప్పు నేపధ్యంలో ప్రమాదకర వస్తువుల విషయమై కఠిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ హెచ్చరిక ఒక ప్రత్యేక ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఆధారంగా వెలువడింది.

ఆరు రోజుల్లో 70 బెదిరింపులు..

ఇక ఇటీవలే.. గడిచిన ఆరు రోజుల్లో ఏకంగా 70 విమానాలకు బాంబు బెదిరింపులు రావడం గమనార్హం. ఇందులో ఒక్క శనివారమే సుమారు 10కి పైగా వేర్వేరు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయని చెబుతున్నారు. ఇందులో ఇండిగో విమానాలకు ఆరు వరకు ఉండటం గమనార్హం. అందుకే బాంబు బెదిరింపు కాల్స్ ని గానీ, మెల్స్ ని గానీ ఎక్కడ నిర్లక్యం చేయకుండా వచ్చిన ప్రతి సారి ఎయిర్ పోర్ట్ సిబ్బంది బాంబ్ స్క్వాడ్ తో తనిఖీ చేసి ప్రయాణాలకు అనుమతి ఇస్తున్నారు.

ఎయిర్ పోర్ట్స్ వద్ద ఎమర్జెన్సీ..

ఈ హెచ్చరికల నేపథ్యంలో… కేద్ర విమానయాన భద్రతా బ్యూరో ఆదేశాల మేరకు ఎయిర్ పోర్ట్ దగ్గర భద్రతను పెంచారు. టర్మినల్స్, పార్కింగ్, పెరీ మీటర్ జోన్ ఇలా అన్ని చోట్లా పెట్రలింగ్ ను కట్టదిట్టం చేశారు. ప్రతీ ఇంచును అనుక్షణం తనిఖీలు చేసే ఏర్పాట్లు చేశారు. దాంతో పాటూ స్థానిక పోలీసుల సహాయంతో ఎయిర్ పోర్ట్ కు వచ్చే వాహనాల తనిఖీకి కూడా ఏర్పాట్లు చేశారు. అంతర్జాతీయ, దేశీయ మార్గాల్లో పంపే మెయిల్‌ పార్సిళ్లను క్షుణ్ణంగా సోదా చేస్తున్నారు. సిబ్బంది, కాంట్రాక్టర్లు, విజిటర్స్‌ను కూడా తనిఖీలు చేయాలని నిర్ణయించారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే యాక్షన్ తీసుకోనున్నారు. అవసరమైతే మాక్ డ్రిల్స్ ను కూడా చేపట్టాలని అధికారులు సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *