
బిగ్ బాస్ (Big Boss) … తెలుగు ప్రేక్షకులకే కాదు సౌత్ ఇండియా (South India) టెలివిజన్ (Television) ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెర పై బిగ్ బాస్ అనే ఒక లైవ్ షోత్ స్టార్ట్ అయ్యి… లక్షలాది ప్రేక్షకులని తన సొంత చేసుకున్న టీవి షో. ఇక ఈ బిగ్ బాస్… బుల్లితెరపై ఎన్ని వివాదాలు, విమర్శలు వచ్చినప్పటికీ బిగ్ బాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ భాషలలోనూ ఈ షోకు విపరీతమైన ఆదరణ ఉంది. ఇప్పటివరకు తెలుగులో 8 సీజన్స్ విజయవంతమయ్యాయి. ఇక త్వరలోనే సీజన్ 9 సైతం స్టార్ట్ కాబోతుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా సీజన్ 9 కంటెస్టెంట్స్ పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Also Read : Sankranti : 2026 సంక్రాంతి టాలీవుడ్ రఫాడిస్తుందా..?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ లైవ్ షో…

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న రియాలిటీ live షో బిగ్ బాస్. ఇప్పటికే ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం, ఇప్పుడు తొమ్మిదో సీజన్‌తో మన ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ షోకి సంబంధించిన పనులు అన్నపూర్ణ స్టూడియోలో చురుగ్గా సాగుతున్నాయి. ఇక ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా మొదలైందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎవరు రాబోతున్నారు? ఎలాంటి కంటెస్టెంట్లని దించుతున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. గత షోకి పెద్దగా ఆదరణ రాలేదు. ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
Also Read : Jailer2 : సూపర్ స్టార్ మూవీలో విలన్ గా టాలీవుడ్ స్టార్ హీరో
గతేడాది ప్రేక్షకులను మెప్పించని బిగ్ బాస్.. మరి ఈ సారి

నిజానికి గత ఏడాది జరిగిన బిగ్ బాస్ ఆశించిన మేర ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ సారి ఆ మిస్టేక్స్ జరగకుండా షో రేటింగ్ పెంచేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ తెలుగు 9వ (Bigg Boss Telugu 9) సీజన్‌కి క్రేజీ కంటెస్టెంట్లని రంగంలోకి దించబోతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా కొందరు కంటెస్టెంట్ల పేర్లు లీక్ అయ్యాయి.
ఈ లీకైన జాబితాలో బుల్లితెర నటీనటులు, యూట్యూబ్ స్టార్లు (YouTube Stars) , సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో పాటు కొందరు ప్రముఖుల పేర్లు కూడా ఉండటం విశేషం. అదే సమయంలో కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలిచిన సెలబ్రిటీల పేర్లు కూడా వినిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది.
Also Read : Sidhu Jonnalagadda : మంచి మనసు చాటుకున్న టిల్లు బాయ్…
హౌస్ లోకి వెళ్లేది వీళ్లేనా…?

సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ జాబితా ప్రకారం ‘మై విలేజ్ షో’ (My Village Show) ద్వారా గుర్తింపు పొందిన అనిల్ గీల, సీరియల్ నటి కావ్య, నటి రీతూ చౌదరి, ప్రదీప్ అనే పేరుతో ఒకరు, నటుడు శివ కుమార్, ‘బ్రహ్మముడి’ (Brahmamudi ) సీరియల్ ఫేమ్ దీపిక, ‘జబర్దస్త్’ (Jabardasth) కమెడియన్ ఇమ్మాన్యుయేల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు సీరియల్ నటుడు సీతాకాంత్, నటి ప్రియాంక జైన్ ప్రియుడు శివ కుమార్, యూట్యూబర్ అలేఖ్య (చిట్టి పికిల్స్), నటుడు అమర్ తేజ్ భార్య తేజస్విని గౌడ, సీరియల్ నటి దేబ్‌జాని, ‘కేరింత’ (Kerintha) సినిమా హీరో సుమంత్ అశ్విన్, అలాగే సీరియల్ నటులు హారిక, ఏక్‌నాథ్‌లు కూడా ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ జాబితాపై బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) వైరల్ అవుతున్న ఈ పేర్లలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు. ఏది ఏమైనప్పటికీ, బిగ్ బాస్ తొమ్మిదో సీజన్‌పై మాత్రం ప్రేక్షకుల్లో అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Suresh