Telecom company Jio has introduced new offers for its customers.

జియో… ప్రస్తుతం ఈ కంపెనీ యావత్ భారత్ టెలికాం సంస్థ వ్యవస్థనే శాసిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ కంపెనీ పేరు తెలియని వారు గానీ, ఈ జియో సిమ్ వాడని వారు గానీ ఎవరు ఉండరు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ముగ్గురిలో ఇద్దరు జియో యూజర్సే ఉంటారు. వరుసగా జియో కంపెనీ యూజర్లను ఆకర్షించేందుకు ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త ఫీచర్ తో యూజర్లను పెంచుకుంటు పోతుంది. తాజాగా మరో ఫీచర్ తో జియో యూజర్లకు సరికొత్త ప్లాన్ ను పరిచయం చేయబోతుంది.

తాజాగా జియో సంస్థ… జియో యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. క్లౌడ్ గేమింగ్ మార్కెట్‌ కోసం జియో కంపెనీ 5 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. జియోగేమ్స్ క్లౌడ్ ఫ్రీగా అందిస్తోంది. ఖరీదైన హార్డ్‌వేర్ లేకుండా మొబైల్, పీసీ,జియో సెట్-టాప్ బాక్స్‌లో కన్సోల్ లాంటి గేమ్‌లను యాక్సస్ చేయొచ్చు. జియో క్లౌడ్ గేమింగ్ మార్కెట్‌ కోసం 5 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. ప్రారంభ ధర రూ. 48 ప్లాన్ నుంచి అందుబాటులో ఉన్నాయి.

జియో క్లౌడ్ గేమ్స్ అంటే..?

ప్రస్తుతం జియో యూజర్లకు ఈ డౌట్ రావచ్చు. అయితే ఆగండి అక్కడికే వస్తున్నా…

జియో గేమింగ్ క్లౌడ్ అంటే… మీరు ఫ్యాన్సీ కన్సోల్ లేదా PC లేకుండా హై-ఎండ్ గేమ్‌లను ఆడవచ్చు. YouTube వీడియోలను చూస్తున్నట్లే, గేమ్‌లు క్లౌడ్‌లోని శక్తివంతమైన సర్వర్‌లలో నడుస్తాయి. ఈ ఫీచర్ తో… ఇప్పుడు మీరు ఈ ఆటలను రిలయన్స్ జియో ప్రారంభించిన జియో గేమ్స్ క్లౌడ్‌లో ఆడవచ్చు. మీ ఫోన్, పిసి, టీవీ లేదా వెబ్ బ్రౌజర్‌లో కూడా మీరు ఆడగల టన్నుల కొద్దీ ఆటలు ఉన్నాయి. ఇందుకు మీకు కావలసిందల్లా మంచి ఇంటర్నెట్ కనెక్షన్. ఈ ఫీచర్ తో మీరు మరే యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే గేమ్స్ ని ఆడుకోవచ్చు. మా దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్‌లు, జియో సెట్ టాప్ బాక్స్‌లు మరియు ల్యాప్‌టాప్‌ల కోసం జియో గేమ్స్ క్లౌడ్ ఉంది. ఇక ఈ క్లౌడ్ ఆధారిత గేమింగ్ సర్వీస్.. తద్వారా యూజర్లు గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోకుండానే నేరుగా ఆన్‌లైన్ గేమ్‌లను ఆడవచ్చు. సబ్‌స్క్రిప్షన్ రూ. 398తో కొత్త ప్లాన్‌లలో ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా పొందవచ్చు. ప్రస్తుతం ఈ ఆఫర్ ప్రీపెయిడ్ యూజర్లకు మాత్రమే. పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు కాదని గమనించాలి. జియో కొత్త గేమింగ్ ప్లాన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

జియో గేమ్స్ ప్లాన్ ఇలా…

ప్రస్తుతం జియో సంస్థ… కేవలం రూ.48 ప్లాన్ తో గేమింగ్ వినియోగదారుల కోసం 10MB డేటా, 3 రోజుల పాటు జియోగేమ్స్ క్లౌడ్ యాక్సెస్‌ను అందిస్తుంది. ఇక ఇదే రీచార్జ్ ని రూ.98 ప్లాన్ తో జియో వినియోగదారుడు దాదాపు 7 రోజుల పాటు 10MB డేటాను పొంది.. గేమింగ్ యాక్సెస్‌ తో అడుకోవచ్చు. ఇక డేటా వోచర్ ద్వారా యాక్టివ్ బేస్ ప్లాన్ పొందవచ్చు. ఇక రూ.298 ప్లాన్ తో… 28 రోజుల పాటు జియోగేమ్స్ క్లౌడ్ యాక్సెస్‌తో పాటు 3GB డేటాను అందిస్తుంది. డేటా వోచర్, యాక్టివ్ ప్లాన్‌తో మాత్రమే వాడుకోవచ్చు. రూ.495 ప్లాన్ తో రోజుకు 1.5GB డేటా, 5GB బోనస్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 28 రోజుల పాటు రోజుకు 100 SMS అందిస్తుంది. ఇందులో జియోగేమ్స్ క్లౌడ్, జియోసినిమా (డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ), ఫ్యాన్ కోడ్, జియోటీవీ, జియోక్లౌడ్ యాక్సెస్ కూడా జియో సంస్థ అందిస్తుంది. ఇక చివరగా… రూ. 545 ప్లాన్ తో అత్యంత ప్రీమియం ప్లాన్. 2GB రోజువారీ డేటా, 5GB బోనస్ డేటా, అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తుంది. మిగతా అన్ని ఫీచర్లు రూ. 495 ప్లాన్ మాదిరిగానే ఉంటాయి. అన్ని ప్లాన్‌లు జియో వెబ్‌సైట్, యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. జియోగేమ్స్ క్లౌడ్ సౌకర్యాన్ని (jiogames.com) నుంచి పొందవచ్చు.

Suresh

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *