Telangana government announces Gaddar Awards.

2026 Gaddar Film Awards : గద్దర్ అవార్డులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..

తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ప్రకటించిన గద్దర్ ఫిలిం అవార్డ్స్–2025లో నాగచైతన్య, చిరంజీవి పేర్లు ప్రధానంగా నిలిచాయి. ‘తండేల్’ సినిమాలో నటనకు నాగచైతన్య ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. మరోవైపు తెలుగు సినీ రంగానికి చేసిన విశేష సేవలను గుర్తిస్తూ మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం (NTR National Award) ప్రకటించారు. 2025లో సెన్సార్ సర్టిఫికెట్ పొందిన చిత్రాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డులను ఎంపిక చేశారు.

ఇక విషయంలోకి వెళ్తే…

సినీ పరిశ్రమను (Film Industry) ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులు’ (Gaddar Film Awards) ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చే ఇచ్చే నంది అవార్డుల స్థానంలో ప్రముఖ గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరిట తెలంగాణలో గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2025వ సంవత్సరానికి గాను తాజాగా ఈ అవార్డుల్ని ప్రకటించారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వతంత్ర జ్యూరీ కమిటీ ఈ అవార్డుల కోసం ఎంపిక ప్రక్రియ నిర్వహించింది. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికెట్ పొందిన చిత్రాలను ఈ అవార్డుల కోసం పరిగణనలోకి తీసుకున్నారు. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 17 విభాగాల్లో విజేతలను ప్రకటించగా, మార్చి 19 ఉగాది సందర్భంగా అవార్డుల ప్రదానం జరగనుంది. ఇ

గద్దర్‌ ఫిల్మ్ అవార్డులు 2025..

గద్దర్‌ అవార్డుల (Gaddar Awards) ప్రకటన వచ్చింది. 2025 ఏడాదిలో విడుదలైన చిత్రాలకు సంబంధించిన అవార్డులను ప్రకటించారు తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మెన్‌ (Telangana FDC Chairman) దిల్‌ రాజు. ఇందులో చిరంజీవి, కమల్‌ హాసన్‌, జయసుధ, ఆర్‌ నారాయణమూర్తి, అశ్వినీదత్‌, రమేష్‌ ప్రసాద్‌, సుద్ధాల అశోక్‌ తేజలకు ప్రత్యేక అవార్డులు వరించాయి. ఎన్టీఆర్‌ అవార్డుకి చిరంజీవిని ఎంపిక చేవారు. అలగే పైడి జయరాజ్‌ అవార్డుకి కమల్‌ హాసన్‌ని ఎంపిక చేశారు. అక్కినేని అవార్డుకి జయసుధని ఎంపిక చేయడ విశేషం.

గద్దర్‌ అవార్డులను ప్రకటించిన దిల్‌ రాజు..

ఇక నాగిరెడ్డి చక్రపాణి అవార్డు (Nagireddy Chakrapani Award) నిర్మాత అశ్వనీదత్‌కి వరించగా, సినారె అవార్డు (Sinare Award) సుద్ధాల అశోక్‌ తేజకి, రఘుపతి వెంకయ్య అవార్డు రమేష్‌ ప్రసాద్‌కి, కాంతారావు అవార్డుకి ఆర్‌ నారాయణమూర్తిని ఎంపిక చేశారు. బీఎన్‌ రెడ్డి ఫిల్మ్ (BN Reddy Film Award) సింగీతం శ్రీనివాసరావుని ఎంపిక చేయడం విశేషం. తెలుగు సినిమా అభివృద్ధికి దోహదపడ్డ మన సినీ దిగ్గజాల పేరుతో అవార్డులను ప్రకటించారు. ఈ సారి కొత్తగా వీటిని ప్రకటించారు.

మార్చి 19న గద్దర్‌ ఫిల్మ్ అవార్డుల ప్రదానం..

గతేడాది విడుదలైన అవార్డులకు సంబంధించి ఈ అవార్డులను ప్రకటించారు. నంది అవార్డుల స్థానంలో తెలంగాణ ప్రభుత్వం గద్దర్‌ అవార్డులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తనికెళ్ల భరణి ఛైర్మెన్‌గా ఎంపికైన జ్యూరీ కమిటీ ఈ అవార్డులను నిర్ణయించింది. మార్చి 19న ఈ గద్దర్‌ అవార్డులను ప్రధానం చేయనున్నారు.

“గద్దర్” అవార్డులు ప్రకటన..

  • ఎన్టీఆర్ నేషనల్ అవార్డు – మెగాస్టార్ చిరంజీవి
  • పైడి జయరాజ్ అవార్డు – కమల్ హాసన్‌
  • ఏఎన్నార్ అవార్డు – జయసుధ
  • బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు – డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు
  • కాంతారావు అవార్డు – డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు
  • నాగిరెడ్డి & చిత్రపాణి ఫిల్మ్ అవార్డు – తెలుగు ప్రొడ్యూసర్ అశ్వినీ దత్‌
  • సి నారాయణరెడ్డి ఫిల్ అవార్డు – పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ
  • ఉత్తమ నటుడు – నాగ చైతన్య (తండేల్‌)
  • ఉత్తమ నటి – రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్‌)
  • ఫస్ట్ బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ – రాజు వెడ్స్ రాంబాయి
  • సెకండ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ – దండోరా
  • థర్డ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ – ది ప్రీ వెడ్డింగ్‌ షో
  • నేషనల్‌ ఇంటిగ్రిటీ సినిమా – తండేల్‌
  • ఉత్తమ పర్యావరణ చిత్రం – ఇగ్వా
  • ఉత్తమ డెబ్యూ ఫీచర్‌ ఫిల్మ్ – లిటిల్‌ హార్డ్స్
  • ఉత్తమ వినోదాత్మక చిత్రం – సంక్రాంతికి వస్తున్నాం
  • ఉత్తమ సోషల్‌ మెసేజ్‌ చిత్రం – కోర్టు
  • ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్ మూవీ – మిరాయ్‌
  • ఉత్తమ బాలల చిత్రం – అనగనగనా
  • ఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
  • ఉత్తమ సపోర్టింగ్‌ నటుడు – శివాజీ
  • ఉత్తమ సపోర్టింగ్‌ నటి- భూమిక
  • ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్ కె రాబిన్‌ (దండోరా)
  • ఉత్తమ నేపథ్య గాయకుడు – అనురాగ్‌ (రాజు వెడ్స్ రాంబాయి)
  • ఉత్తమ నేపథ్య గాయని – సాహితి చాగంటి (కన్నప్ప)
  • ఉత్తమ హాస్యనటుడు – కృష్ణ తేజ (జిగ్రీస్‌)
  • ఉత్తమ బాలనటుడు – రోహన్ ‌ రాయ్‌ (ప్రీ వెడ్డింగ్‌ షో)
  • ఉత్తమ కథా రచయిత – గుణశేఖర్‌ (యుఫోరియా)
  • ఉత్తమ స్క్రీన్‌ ప్లే రైటర్‌ – అనిల్‌ రావిపూడి
  • ఉత్తమ గేయ రచయిత – నందకిశోర్‌ (కుబేర)
  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ – కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌)
  • ఉత్తమ ఎడిటర్ ‌- శ్రీకర్‌ ప్రసాద్‌ (మిరాయ్‌)
  • ఉత్తమ ఆడియోగ్రాఫర్‌ – ఎం.ఆర్‌ రాధాకృష్ణన్‌ కిష్కిందపురి
  • ఉత్తమ కొరియోగ్రాఫర్‌ – సందీప్ (గిర గిర గిర)
  • ఉత్తమ ఆర్ట్ డైరక్టర్‌ – తోట తరణి (ఛాంపియన్)‌
  • ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్ – గోవింద్‌ అఖండ
  • ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌‌ – చంద్రకాంత్(‌చాంపియన్)
  • ఉత్తమ స్పెషల్‌ జ్యూరీ ఫిల్మ్ – 23
  • ఉత్తమ మేల్‌ యాక్టర్‌ – చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
  • ఉత్తమ నటి – అనంతిక (8 వసంతాలు)
  • స్పెషల్‌ జ్యూరీ హీరో – రోషన్‌ (చాంపియన్‌)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *